Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Allergy and Ayurvedic Treatment by Prof. Dr. Murali Manohar Chirumamilla, M.D. (Ay) (Telugu)

ఈ సంచికలో >> శీర్షికలు >>

విశేషాలు! - పి వి ఎల్ సుజాత

viseshalu

* హెర్మాఫ్రాడిటిక్ ఛాక్ బాస్ అనే కరీబియన్ కు చెందిన సముద్రజాతి చేప రోజుకు ఎన్నిసార్లైనా స్త్రీనుండి పురుషుడిగా మళ్లీ స్త్రీగా మారగలుగుతుంది. మనలో మన మాట మనకూ అలాంటి అద్భుత శక్తి ఉంటే బావుణ్ననిపిస్తోంది కదూ..ఎంచక్కా అందమైన అబ్బాయి కనిపిస్తే అమ్మాయిగా, బాపూ బొమ్మ కనిపిస్తే అబ్బాయిగా మరిపోవచ్చు.

*****

ఆర్కిటిక్ మంచు ప్రదేశానికి చెందిన నక్కలు తమ నివాస స్థలం చుట్టూ చక్కగా..ఆకర్షణీయమైన పూలమొక్కల గార్డెన్లు పెంచుకుంటాయిట. వెళ్లి చూసొద్దామంటారా..చలండి..బాబూ..చ..లి..తట్టుకోలేం.

*****

జిరాఫీ భూమ్మీద ఉన్న అన్ని జీవుల కన్నా పొడవైన తోకను (దాదాపు 2 మీ|| లు) కలిగి ఉంటుంది. అందుకనే మె’డెత్తు”కుని తిరుగుతుంది..ఇదన్న మాట దాని బడాయికి కారణం.

*****

ఆంజనేయ స్వామి తోకే పొడవైనది కాదండోయ్..ఆసియా బుల్లి గడ్డిబల్లి తోక చా..లా.. పొడవుగా అంటే 25 సెం.మీ. పొడవుంటుంది. ఆ తోక దాని శరీరానికి దాదాపు మూడు రెట్లు.

మరిన్ని శీర్షికలు
sahiteevanam