Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
interview with chandrasekhar yeleti

ఈ సంచికలో >> సినిమా >>

చిరంజీవి సరసన అందాల చందమామ?

chiru 150th movie heroin kajal

ఎట్టకేలకు చిరంజీవి 150వ సినిమాలో హీరోయిన్‌ ఫిక్సయ్యిందిట. ముద్దుగుమ్మ కాజల్‌ చిరుకి జోడీగా సెలెక్ట్‌ అయ్యిందని సమాచారమ్‌. వి.వి.వినాయక్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న 'కత్తి' తమిళ్‌ రీమేక్‌కి ఎన్నో స్పెషల్‌ హంగులు సిద్ధమయ్యాయి. కానీ ఇంతవరకూ హీరోయిన్‌ పేరు మాత్రం సస్పెన్స్‌గానే ఉంది. ఆ సస్పెన్స్‌కు తెర పడినట్లే కనిపిస్తోంది. రాంచరణ్‌తో వరుస సినిమాలు చేసి హిట్లు కొట్టిన అందాల చందమామ కాజల్‌. తాజాగా 'సర్దార్‌ గబ్బర్‌ సింగ్‌'లో పవన్‌ కళ్యాణ్‌కి జోడీగా కనిపించింది. ఆ సినిమాలో రాకుమారి గెటప్‌తో చాలా హుందాగా అలరించింది. అందుకే చిరంజీవి తన పక్కన జోడీగా కాజల్‌ అయితే బాగుంటుందని సూచించినట్లు తెలుస్తోంది.

అందుకు వినాయక్‌ కూడా ఓకే అన్నాడట. వినాయక్‌ దర్శకత్వంలో రామ్‌చరణ్‌ హీరోగా వచ్చిన 'నాయక్‌' సినిమాలో కాజల్‌ హీరోయిన్‌ అని తెలుసు కదా. దాంతో ఈ చందమామని హీరోయిన్‌గా పెట్టుకోవడానికి వినాయక్‌ కూడా ఇంట్రెస్ట్‌ చూపించాడట. అయితే చిరంజీవికి జోడీగా బాగుండాలంటే కాజల్‌ కొంచెం బొద్దుగా కనిపించాలి. అందుకే ఒళ్లు పెంచే పనిలో పడిందట ముద్దుగుమ్మ కాజల్‌. త్వరలోనే కాజల్‌ చిరుతో కలిసి 'కత్తి' సెట్‌లో సందడి చేయనుందట. రాంచరణ్‌ ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. రాంచరణ్‌ కూడా చిరంజీవి పక్కన హీరోయిన్‌గా కాజల్‌కే ఓటేశాడట. సినిమా బడ్జెట్‌ విషయంలో నిర్మాతగా రాంచరణ్‌ ఏమాత్రం వెనుకాడటం లేదు. శరవేగంగా ఈ సినిమా షూటింగ్‌ జరుపుకుంటోంది. 

మరిన్ని సినిమా కబుర్లు
reshmi so naughty