Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
sahiteevanam

ఈ సంచికలో >> శీర్షికలు >>

29-07-2016 నుండి 04-08-2016 వరకు వారఫలాలు - శ్రీకాంత్

మేష రాశి : ఈవారం మొత్తంమీద ఆరంభంలో కొంతమేర పనుల ఒత్తిడి మూలాన చికాకును కలిగి ఉంటారు. పనులకు సంభందించిన విషయాల్లో మొదట్లో ఉన్న ఉత్సాహం చివరివరకు కొనసాగించే విషయంలో కొంత ఇబ్బందులు ఎదుర్కొంటారు. విశ్రాంతిని కోరుకుంటారు కాస్త సమయాన్ని ప్రశాంతంగా గడిపే ప్రయత్నం చేయుట మంచిది. సమయానికి భోజనం చేయుటకు ప్రయత్నం చేయండి. ఆర్థికపరమైన విషయాల్లో మాత్రం బాగుంటుంది రావాల్సిన ధనం సమయానికి చేతికి అందుతుంది. ఇష్టమైన వారిని కలుస్తారు వారితో చర్చలు చేయుటకు అవకాశం ఉంది. సమయానికి భోజనం చేయుట మంచిది. రాజకీయపరమైన విషయాల్లో అభివృద్ధి ఉంటుంది. పెద్దలను కలుస్తారు వారినుండి నూతన అవకశాలు పొందుటకు అవకాశం కలదు.
 

 

వృషభ రాశి : ఈవారం మొత్తంమీద మానసికంగా కొంత ఒత్తిడిని కలిగి ఉంటారు. పెద్దలతో కలిసి తీసుకొనే నిర్ణయాల విషయంలో స్పష్టమైన ఆలోచనలు చేయండి సమయాన్ని  ఇవ్వండి. తలపెట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేయుటలో చిన్న చిన్న ఇబ్బందులు తప్పకపోవచ్చును. సంతానపరమైన విషయాల్లో మార్పులకు అవకాశం ఉంది. ఊహించని ఖర్చులకు అవకాశం ఉంది వాటిని తగ్గించుకొనే ప్రయత్నం చేయుట మంచిది. కొన్ని కొన్ని విషయాల్లో చాలావరకు సర్దుబాటు అవసరం. కుటుంబంలో మీరు తీసుకొనే నిర్ణయాలు కొత్త మార్పులు చోటుచేసేకొనే విధంగా ఉంటవి. వ్యాపారపరమైన విషయాల్లో పెట్టుబడులు పెట్టుటకు అవకాశం ఉంది కాకపోతే ఈ విషయంలో ఫలితాలు కొంత ఆలస్యంగా వచ్చుటకు అవకాశం ఉంది . వ్యతిరేకవర్గం నుండి ఇబ్బందులు తప్పక పోవచ్చును.  

 

                       

మిథున రాశి :   ఈవారం మొత్తంమీద కుటుంభసభ్యుల ఆలోచనలు తెలుసుకొనే ప్రయత్నం చేస్తారు కొన్ని  కొన్ని విషయాల్లో విభేదించే అవకాశం ఉంది. ఆరంభంలో మాత్రం స్వల్ప అనారోగ్యసమస్యలు కలుగుటకు అవకాశం ఉంది తగిన జాగ్రత్తలు తీసుకొనుట మంచిది. సంతానపరమైన విషయాల్లో సంతోషాన్ని పొందుతారు సమయాన్ని వారితో గడుపుటకు అవకాశం ఉంది. నలుగురిలో గుర్తింపును పొందుటకు అవకాశం ఉంది తలపెట్టిన పనులను విజయవంతంగా పూర్తిచేసే అవకాశం ఉంది. ఉద్యోగంలో వచ్చు మార్పులు కొంత నిరుత్సాహాన్ని కలుగజేసిన తేరుకొనే అవకాశం ఉంది. ప్రయాణాలు చేయవలసి రావోచ్చును దూరప్రదేశ ప్రయాణాలు మాత్రం కలిసి వస్తాయి. చిననాటి మిత్రులను కలుస్తారు. స్త్రీ సంభందమైన విషయాలకు సమయాన్ని ఇచ్చుటకు అవకాశం ఉంది.

 

 

కర్కాటక రాశి : ఈవారం మొత్తంమీద మొదట్లో ఉన్న సానుకూలత తర్వాత ఉండకపోవచ్చును. చేపట్టిన పనుల పట్ల అవగాహన అవసరం లేకపోతే ఇబ్బందులు తప్పవు. తలపెట్టిన ప్రయత్నాలు నిదానంగా ముందుకు సాగుటకు అవకాశం ఉంది. ధనమునకు సంభందించిన విషయాల్లో జాగ్రత్తగా లేకపోతే ఊహించని ఖర్చులకు అవకాశం ఉంది. వ్యాపారపరమైన విషయాల్లో నూతన పెట్టబడులు వద్దు గతంలో ఆరంభించిన లేక మొదలుపెట్టిన వాటిని కొనసాగించే ప్రయత్నం మంచిది. అధికారులతో కలిసి తీసుకున్న నిర్ణయాల్లో కొంత ఇబ్బందులు కలిగినను ఓర్పుతో ముందుకు వెళితే మేలుజరుగుతుంది. మీయొక్క మాటతీరు నూతన సమస్యలు పొందుతారు కావున నిదానంగా వ్యవహరించుట మంచిది. 

 

           
సింహ రాశి : ఈ వారం మొత్తంమీద నూతన ప్రయత్నాల విషయంలో బాగా ఆలోచించి ముందుకు వెళ్ళుట వలన మేలుజరుగుతుంది. తలపెట్టిన పనుల విషయంలో స్పష్టమైన ఆలోచన కలిగి ఉండుట అవసరం. ఆర్థికపరమైన విషయాల్లో మిశ్రమఫలితాలు పొందుతారు. ప్రయాణాల విషయంలో బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. స్వల్పఅనారోగ్యసమస్యలు కలుగుటకు అవకాశం ఉంది జాగ్రత్త. అధికారులతో స్వలప్ మనస్పర్థలు ఏర్పడే ఆస్కారం కలదు కావున నిదానంగా వ్యవహరించుట సూచన. స్త్రీ / పరుష సంభందమైన విషయాల్లో జాగ్రత్తగా లేకపోతే ఇతరులకు సమాధనం చెప్పవలసి రావోచ్చును. సంతానం మూలాన ఇబ్బందులు కలుగుతాయి.   

 

కన్యా రాశి : ఈ వారం మొత్తంమీద తలకు మించిన భారం పెంచుకోవడం వలన తిప్పలు తప్పకపోవచ్చును. ప్రయాణాలు చేయునపుడు చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. అవసరమైతే వాయిదా వేయుట మంచిది. ఆర్థికపరమైన విషయాల్లో నూతన నిర్ణయాలు తీసుకోకండి. అనుభవజ్ఞులను సంప్రదించుట మేలు. ఉద్యోగపరమైన విషయాల్లో కాస్త శ్రమించుట చేత ఆశించిన ఫలితాలను పొందే ఆస్కారం ఉంది. సోదరసంబంధమైన విషయాల్లో బాగా ఆలోచనలుచేస్తారు. అలాగే వారితో చర్చలు చేపడతారు. వ్యతిరేకవర్గం నుండి వచ్చే ఇబ్బందులను సమర్థవంతంగా ఎదుర్కొంటారు. విలువైన వస్తువుల విషయంలో ఆసక్తిని చూపిస్తారు. సామజికపరమైన విషయాల్లో పాల్గొనేటప్పుడు మీకంటూ ఒక విధానం ఉండుటం అనేది అవసరం, ఆ దిశగా ఆలోచనలు చేయండి.

 

   

తులా రాశి :ఈవారం మొత్తంమీద ప్రయాణాలకు సమయం ఇస్తారు, దూరప్రదేశ ప్రయాణాలు చేయవలసి వస్తుంది. విలువైన వస్తువులను కొనుగోలు చేసే అవకాశం ఉంది. స్త్రీ పరమైన విషయాలకు సమయం వెచ్చిస్తారు అలాగే వారికోసం ధనం వెచ్చిస్తారు. ఉద్యోగంలో అధికారులకు అనుగుణంగా నడుచుకొనుట అలాగే నూతన నిర్ణయాలు తీసుకొనేముందు ఒకటికి రెండు సార్లు ఆలోచన చేయుట మంచిది. పెట్టుబడులు అలాగే వ్యాపారపరమైన విషయాల్లో బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం వలన లబ్దిని పొందుటకు అవకాశం కలదు.విలువైన వస్తువులను జాగ్రత్తగా కాపాడుకొనే ప్రయత్నం చేయుట మంచిది. అనవసరమైన విషయాల్లో తలదూర్చడం వలన మాటపడవలసి వస్తుంది జాగ్రత్త. కుటుంబసభ్యుల తీరు మిమ్మల్ని కాస్త ఆందోళనకు గురిచేసే అవకాశం ఉంది.

    

వృశ్చిక రాశి  : ఈవారం మొత్తంమీద నూతన పరిచయాలకు సమయం ఇస్తారు అలాగే వారితో కలిసి కొత్త కొత్త పనులను ఆరంభించే అవకాశం ఉంది. ఉద్యోగంలో మీ శక్తిని మనసులో పెట్టుకొని వాటికి కట్టుబడి ఉండే ప్రయత్నం చేయండి లేకపోతే పనిభారం తప్పకపోవచ్చును. కుటుంభంలో తండ్రిసంభందమైన విషయాల పట్ల మక్కువను కలిగి ఉంటారు ఆలాగే వారి తరుపు బంధువులతో కలిసి సమయాన్ని గడుపుతారు. ఆర్థికపరమైన విషయాల్లో మిశ్రమఫలితాలు పొందుతారు. ప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది వాటిమూలన లబ్దిని పొందుతారు. స్త్రీ సంభందమైన విషయాల్లో మార్పులకు అవకాశం కలదు. వ్యాపారపరమైన విషయాల్లో బాగుంటుంది నూతన పెట్టుబడులకు అవకాశం ఉంది. దైవసంభందమైన విషయాలకు సమయం ఇవ్వడం వలన మేలుజరుగుతుంది. మిత్రుల ద్వార సమాచారం తెలుసుకొనే అవకాశం కలదు.      

 

ధనస్సు రాశి  :  ఈ వారం మొత్తం మీద పెద్దలను కలుస్తారు మీ ఆలోచనలు వారికి తెలియ జేసే అవకాశం కలదు. మీరు కుటుంభంలో పెద్దలతో మీ నిర్ణయాలు పంచుకుంటారు. సోదరవర్గం నుండి కొంత వ్యతిరేకత వచ్చిన దానిని అదిగమిస్తారు. తలపెట్టిన పనులు కాస్త ఆలస్యంగా పూర్తిచేసే అవకాశం ఉంది అయినను వాటిని విజయవంతంగా పూర్తిచేయుట ద్వార మంచి గుర్తింపును పొందుతారు. స్థిరమైన ఆలోచనలు చేయుట వలన మరింత లాభం చేకూరుతుంది నిదానం అవసరం. మిత్రుల వలన కొత్త విషయాలు తెలుసుకుంటారు. ఉద్యోగంలో బాగానే ఉంటుంది శ్రమతప్పదు. ఆర్థికపరమైన విషయాల్లో నూతన ఆలోచనలు కలిగి ఉంటారు. ప్రయాణాలు చేయుటకు అవకాశం కలదు. వ్యాపారంలో భాగస్వామితో స్వల్ప మనస్పర్థలు కలుగుటకు ఆస్కారం ఉంది సర్దుబాటు మంచిది.   

 

 

మకర రాశి  :  ఈవారం మొత్తంమీద చేపట్టిన పనుల్లో అనుకూలమైన ఫలితాలను పొందుటకు అవకాశం ఉంది. ఆర్థికపరమైన విషయాల్లో సంతృప్తికరమైన ఫలితాలు పొందుటకు అవకాశం ఉంది. స్త్రీ / పురుష పరమైన విషయాల వలన సమస్యలు కలుగుటకు అవకాశం ఉంది జాగ్రత్త. ఉద్యోగంలో బాగుంటుంది అధికారులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవడం వలన మేలుజరుగుతుంది. ప్రయాణాలు చేయునపుడు తగిన జాగ్రత్తలు తీస్కోండి వాహనముల మూలాన ఇబ్బందులు కలుగుటకు అవకాశం ఉంది లేదా అగ్నిసంభందమైన విషయాల్లో పనిచేసే విషయంలో జాగ్రత్తగా వ్యవహరించుట సూచన. కుటుంబంలో వచ్చిన మార్పుల విషయంలో కొంత అయిష్టత కలిగి ఉండే అవకాశం ఉంది సర్దుబాటు విధానం మేలుచేస్తుంది. మిత్రులను కలుస్తారు.     
 

 

 

కుంభ రాశి : ఈవారం మొత్తంమీద ఫలితాలు మీకు అనుకూలంగా వచ్చే అవకాశం ఉంది. చేపట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేసే అవకాశం కలదు. ఆర్థికపరమైన విషయాల్లో సంతృప్తికరమైన ఫలితాలు వస్తాయి,వ్యాపారపరమైన విషయాల్లో పెట్టుబడులకు ఆస్కారం కలదు. మీయొక్క మాటతీరు మూలాన ఇతరులు ఇబ్బందిపడకుండా చూసుకోండి. ఉద్యోగంలో లేక వృత్తిలో సమయపాలన అవసరం. అధికారులతో అలాగే తోటివారితో విభేదాలు రాకుండా చూసుకోవడం ఉత్తమం. కుటుంబసభ్యుల నుండి ఆశించిన సహకారం అందుటకు అవకాశం కలదు అలాగే చాలాముఖ్యమైన నిర్ణయాలు వారితో కలిసి చర్చలు చేసి తెసుకొనే ఆస్కారం కలదు. ప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది వాటికి సమయం ఇస్తారు. కొన్ని విషయాలు మిమ్మల్ని నిరాశకు గురిచేస్తాయి.    

 

 

 

మీన రాశి :   ఈవారం మొత్తంమీద సామయాన్ని వృధాచేయకుండా ప్రణాలిక బద్దంగా ముందుకు వెళ్ళండి. కుటుంబంలో తీసుకొనే నిర్ణయాల విషయంలో పెద్దల సూచనలు పాటించుట వలన మేలుజరుగుతుంది. ఆర్థికపరమైన విషయాల్లో మాత్రం సంతృప్తికరమైన ఫలితాలు పొందుతారు. నూతన పరిచయాలకు అవకాశం ఉంది, వారికి సమయాన్ని కేటాయిస్తారు. స్త్రీ పరమైన విషయాల్లో మాత్రం జాగ్రత్తగా వ్యవహరించుట సూచన. అధికారులతో చర్చలు జరిగే విషయంలో మాత్రం మీ పరిధులను గుర్తుపెట్టుకొని ఆపరంగా ప్రవర్తించుట మంచిది. నూతన ఉద్యోగప్రయత్నాలు మొదట్లో కొంత ఇబ్బందిని కలిగించిన చివరకు సంతృప్తికరంగా ఫలితాలు వస్తాయి, నూతన అవకాశాలు లభిస్తాయి.    

మరిన్ని శీర్షికలు
visheshalu