Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
weekly horoscope july 29th to august 4th

ఈ సంచికలో >> శీర్షికలు >>

విశేషాలు - పి వి ఎల్ సుజాత

visheshalu

1. భూమ్మీదున్న 8,07,625 కీటకాల్లో పొడవైనది ‘ఫ్రిగానిస్ట్రియా చైనిసీస్‌ జావో’. ఏకంగా 62.4 సెంటీమీటర్ల పొడవు ఉంటుంది. అంటే ఒకటిన్నర అడుగులకు పైనే. పైగా దీని కాళ్లు కూడా దాదాపు శరీరమంత పొడవుంటాయి.

2. రెక్కలను ఆడించడంలో మిడ్జే కీటకం ముందు అన్నీ దిగదుడుపే! ఇది సెకనుకు 1046 సార్లు రెక్కలాడిస్తుంది.

3. ప్రపంచంలోకెల్లా ఎత్తయిన వృక్షాలు రెడ్‌వుడ్ మహావృక్షాలు. ఈ వృక్షం ఎత్తు 111.1 మీటర్లు. కాండం చుట్టుకొలత 13.5 మీటర్లు.

4.  సాలీడు ఆహారాన్ని నిల్వ చేసుకోటానికి  ఎర చుట్టూ తన సన్నని దారంతో బంతిలాగా గుండ్రంగా అల్లి ఈ బంతిలో నుంచి                 అవసరమైనపుడు ఆహారాన్ని తీసుకొని జీవిస్తుంది.

5. చిలీలోని ‘అటకామా’ ఎడారిలో 400 సంవత్సరాల కాలం వరకు ఒక్క వాన చినుకే కురవలేదు.

6. ఊసరవెల్లి ఆహారం కోసం వేట సాగిస్తూ తన నోటికింద వేలాడే భాగంలో ఉండే నాలుక కొనను ముందుకు జరుపుతుంది. దీనికి    జిగురులాంటి పదార్ధం వుంటుంది. గురి చూసి నాలుకను జరిపి చిన్న చిన్న సూక్ష్మజీవుల్ని అమాంతం నాలుక కొనపై వున్న జిగురుకు అంటించుకుని లోపలికి లాక్కుని మింగేస్తుంది.

7. మన దేశంలోని కొండ జాతి పాములు 34 సం.లు వరకు జీవిస్తాయి.

మరిన్ని శీర్షికలు
Healthy Indian Snacks for Children | Prof. Dr. Murali Manohar Chirumamilla, M.D. (Ayurveda)