Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
interview

ఈ సంచికలో >> సినిమా >>

నాట్స్ - యువకళావాహిని సినీ - టీవి పురస్కారాలు

nats yuva kalavahini awards

నాట్స్ - యువకళావాహిని  

సినీ - టీవి పురస్కారాలు


నాట్స్ - యువకళావాహిని సంయుక్తంగా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఫిలిం ఎక్స్లెన్సీ & టీవీ అవార్డులను ప్రకటించింది. 2015 సం. కి గాను ప్రముఖ సినీ రచయిత శ్రీ కోన వెంకట్, దర్శకులు మారుతీ, కధానాయకుడు వరుణ్ సందేశ్, హాస్య నటులు పృద్వి, వెన్నెల కిషోర్ మరియు క్యారెక్టర్ ఆర్టిస్ట్ శ్రీమతి సుధ అవార్డులకు ఎంపికైనట్లు కమిటీ తెలిపింది. 

టెలివిజన్ కేటగిరీ లో ఉత్తమ సీరియల్స్ గా అత్తారింటికి దారేది (ఈ టీవీ ), అష్టాచెమ్మా (మాటీవీ ), కొంచెం యిష్టం కొంచెం కష్టం (జీటీవీ), శ్రావణ సమీరాలు (జెమిని ), నాలుగోముడి (డిడి ) లు ఎంపికైనట్లు, అలాగే ఉత్తమ దర్శకులుగా మంజులానాయుడు శ్రావణ సమీరాలు (జెమిని ), ఉత్తమ నటుడుగా నందకిషోర్ (రామా సీత - జీటీవీ ), ఉత్తమ నటిగా మీనా అత్తారింటికి దారేది (ఈ టీవీ ), ఉత్తమ విలన్ గా భరణి శంకర్ (సీతామాలక్ష్మి - మాటీవీ ) ఉత్తమ నూతన నటుడు గా ప్రతాప్ (శశిరేఖ పరిణయం - మాటీవీ ), ఉత్తమ విలక్షణ నటి గా కరుణ (శ్రావణ సమీరాలు - జెమిని), ఉత్తమ క్యారెక్టర్ నటి గా శివపార్వతి (మంగమ్మ గారి మనవరాలు - జీటీవీ ), ఉత్తమ క్యారెక్టర్ నటుడు గా కోటశంకరరావు (నాపేరు మీనాక్షి - ఈటీవీ ), ఉత్తమ గాయని గా సునీత (వరూధిని పరిణయం -జీటీవీ ), ఉత్తమ బాల నటి గా ధన్వి శ్రీమయి (రామా సీత - జీటీవీ ), ఉత్తమ రచయిత గా ఆసం శ్రీనివాస్ (అష్టాచెమ్మా - మాటీవీ), 'బద్రి ' న్యూస్ రీడర్ అవార్డు వేల్పుల పూర్ణిమ మరియు ఉత్తమ యాంకర్ గా ప్రశాంతి లు ఎంపికైనట్లు, అలాగే ఉత్తమ ఫీచర్స్ అవార్డులకు గాను ప్రతిధ్వని (ఈటీవీ), బి ఎలర్ట్ (ఎన్ టీవీ ), పుణ్యక్షేత్రం (భక్తి టీవీ), హెల్ప్ లైన్ (వనిత టీవీ ), ఎన్ కౌంటర్ (టీవీ 9), ప్రవాస్ భారత్ (టీవీ 5), చెప్పాలని ఉంది (భారత్ టుడే ) , పబ్లిక్ పాయింట్ (ఏబీఎన్ ), ధూందాం ముచ్చట (టీ న్యూస్ ), న్యూస్ యాంగిల్ (హెచ్ ఎం టీవీ ), సినిమా చూపిస్త మామ (ఐ న్యూస్ ), మాటకారి మంగ్లీ (ఏ 6), స్టార్ స్టార్ (సాక్షి), సిల్వర్ స్క్రీన్ సిల్వర్ జూబ్లీ (స్టూడియో ఎన్ ), రాకింగ్ రాములమ్మ (6 టీవీ), పాడిపంటలు (ఎక్సప్రెస్స్ టీవీ ), ఎడిటర్స్ టైం (మహా టీవీ ), సెంట్రల్ ఫేజ్ (సీవీర్ న్యూస్ ), అన్నమయ్య పాటకు పట్టాభిషేకం (ఎస్ వీ బి సి ), మనమాట మనబాట (దూరదర్శన్) లు ఎంపికైనట్లు, ఈ అవార్డులను  28 జులై 2016 న రవీంద్రభారతిలో జరిగే కార్యక్రమంలో అవార్డుల ప్రధానం ఉంటుందని అవార్డు కమిటీ అధ్యక్షలు, నాట్స్ బ్రాండ్ అంబాసిడర్ డా. గజల్ శ్రీనివాస్ తెలిపారు. ఈ అవార్డు కమిటీ లో టీవీ నటులు లోహిత్ కుమార్, 'సినీ వినోదం' ఎ. రాంబాబు, జర్నలిస్ట్ అక్కినేని శ్రీధర్ లు కూడా ఉన్నారు  

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథి గౌ. ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి  శ్రీ నిమ్మకాయల చినరాజప్ప, శాసన సభ ఉపసభాపతి శ్రీ మండలి బుద్ధ ప్రసాద్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు డా. కె.వి. రమణ తదితరులు పాల్గొంటారని తెలిపారు. 

ఈ కార్యక్రమాన్ని అతిరధుల సమక్షంలో 28 జులై సాయంత్రం 5.30 కి రవీంద్ర భారతి లో నిర్వహిస్తున్నట్లు శ్రీ వై కే నాగేశ్వరరావు, నాట్స్ అధ్యక్షులు మోహన్ కృష్ణ మన్నవ, నాట్స్ ట్రస్ట్ బోర్డు అధ్యక్షులు శ్యామ్ మద్దాలి తెలిపారు 

మరిన్ని సినిమా కబుర్లు
milk beauty in going on experment way