Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
milk beauty in going on experment way

ఈ సంచికలో >> సినిమా >>

మెగా మూవీకి అల్లు ఆరవింద్‌ సపోర్ట్‌

allu aravind support to mega movie

అల్లు అరవింద్‌ నిర్మాణంలో ఎన్నో విజయవంతమైన సినిమాలు తెరకెక్కాయి. చాలా కాలంగా అల్లు అరవింద్‌ మెగా ఫ్యామిలీ సినిమాలకు నిర్మాణ బాధ్యతలు స్వీకరించడం కుదరడం లేదు. అయితే తాజా సమాచారం ప్రకారం అల్లు అరవింద్‌ చిరంజీవి 150వ సినిమాకి నిర్మాతగా తన పాత్రను అందిస్తున్నాడట. అదేంటి చరణ్‌ కదా ఈ సినిమాకి నిర్మాత అనుకుంటున్నారా? చరణే స్వయంగా ఈ బాధ్యతను మేనమామకి అప్పగించినట్లు తెలుస్తోంది. ఎందుకంటే హీరోగానూ, నిర్మాతగానూ చరణ్‌ ఒకేసారి రెండు పనులను మేనేజ్‌ చేయలేకపోతున్నాడు. భారీ బడ్జెట్‌ మూవీ అయిన 'ధృవ' సినిమాకి పూర్తిగా న్యాయం చేయలేకపోతున్నాడు.

మరో పక్క నిర్మాతగా మెగాస్టార్‌ సినిమాకీ బాధ్యతగా వ్యవహరించడంగా కష్టంగా మారింది. ఈ సినిమాకి ఇంకా హీరోయిన్‌ వెతుకులాట కూడా కొనసాగుతూనే ఉంది. మరో పక్క తన సినిమా 'ధృవ' నిమిత్తం విదేశాలు తిరగాల్సి వస్తోంది. ఈ కారణంగా మెగాస్టార్‌ మూవీ నిర్మాణాన్ని పర్యవేక్షించే బాధ్యత తీసుకునేందుకు అల్లు అరవింద్‌ ముందుకొచ్చారని తెలుస్తోంది. ఇక నుండీ సినిమా నిర్మాణ పనుల దగ్గర్నుంచీ హీరోయిన్‌ ఎంపిక వగైరా పనులన్నీ అల్లు అరవింద్‌ పర్యవేక్షణలోనే జరగనున్నాయట. చరణ్‌ 'ధృవ' దసరాకి విడుదల చేసే యోచనలో ఉంది చిత్ర బృందం. చిరంజీవి సినిమా సంక్రాంతికి 'లాక్‌' అయ్యింది. 2017 సంక్రాంతి సంబరాలకు చిరంజీవి కొత్త సినిమాతో సందడి చేసేందుకు మెగా ఫ్యాన్స్‌ సిద్ధమయి ఉన్నారు. 
 

మరిన్ని సినిమా కబుర్లు
akhil second movie fix