Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
allu aravind support to mega movie

ఈ సంచికలో >> సినిమా >>

అఖిల్‌కి రెండో సినిమా సెట్టయ్యింది

akhil second movie fix

అక్కినేని అఖిల్‌ హీరోగా తొలి సినిమా అఖిల్‌' పరాజయంతో రెండో సినిమా కోసం ఏ రిస్క్‌ చేయడానికి ఇష్టపడలేదు నాగార్జున. సీనియర్‌ డైరెక్టర్‌ చేతుల్లోనే అఖిల్‌ సినిమా ఫెయిల్‌ అయ్యింది. ఇక కొత్త డైరెక్టర్స్‌ని నమ్ముకుంటే ఎలా ఉంటుందో అని చాలా ఆలోచించాడు. ఎట్టకేలకు హను రాఘవపూడి డైరెక్షన్‌లో అఖిల్‌కి సినిమా సెట్‌ చేశాడు. తాజాగా 'కృష్ణగాడి వీర ప్రేమగాధ' సినిమాతో గ్రాండ్‌ సక్సెస్‌ అందుకున్నాడు హను రాఘవపూడి. ఆ సినిమా చూసినప్పటి నుండే హనును హోల్డ్‌లో పెట్టాడు

నాగార్జున. చాలా మంది ఇతర డైరెక్టర్స్‌ని కూడా పరిశీలించిన తరువాత చివరికి హనుకే తన ఓటు వేశాడు నాగ్‌. త్వరలోనే ఈ సినిమా సెట్స్‌ మీదికెళ్లనుంది. హనుకి ఇది మూడో సినిమా. తొలి సినిమా 'అందాల రాక్షసి'లో ఒక రకం లవ్‌స్టోరీతోనూ, రెండో సినిమా 'కృష్ణగాడి వీర ప్రేమగాధ'తో మరో డిఫరెంట్‌ లవ్‌ స్టోరీతోనూ ఆకట్టుకున్న ఈ యంగ్‌ డైరెక్టర్‌ ఇప్పుడు అఖిల్‌ కోసం మరో డిఫరెంట్‌ అండ్‌ కూల్‌ రొమాంటిక్‌ స్టోరీని ప్రిపేర్‌ చేశాడట. హను చెప్పిన స్టోరీ అఖిల్‌తోపాటు, నాగార్జునకీ బాగా నచ్చేసిందట. ఖచ్చితంగా ఈ సినిమా అఖిల్‌కి విజయం తెచ్చిపెడుతుందని నమ్మకంగా ఉంది అక్కినేని ఫ్యామిలీ. ఈ సినిమాలో హీరోయిన్‌గా 'కృష్ణగాడి వీరప్రేమగాధ' ఫేం మంజిమ మోహన్‌నే తీసుకున్నారని సమాచారమ్‌. అతి త్వరలో సినిమా సెట్స్‌ మీదకు వెళ్ళనుంది. మిగతా వివరాలు వెల్లడి కావాల్సి ఉంది. 

మరిన్ని సినిమా కబుర్లు
sreerastu shubhamastu hit