Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
akhil second movie fix

ఈ సంచికలో >> సినిమా >>

'శ్రీరస్తు శుభమస్తు' విజయోస్తు

sreerastu shubhamastu hit

అల్లు అర్జున్‌కి తొలి సినిమా 'గంగోత్రి'తోనే విజయం లభించింది. లుక్స్‌ విషయంలో, బాడీ లాంగ్వేజ్‌, డైలాగ్‌ డెలివరీ, యాక్టింగ్‌ వంటి విషయాల్లో అల్లు అర్జున్‌ కూడా తొలి సినిమాకి కొన్ని నెగెటివ్‌ కామెంట్స్‌ ఎదుర్కొన్నప్పటికీ, సినిమా మంచి విజయాన్ని అందుకుంది. సినిమా సినిమాకీ తనను తాను మార్చుకుంటూ అల్లు అర్జున్‌ స్టైలిష్‌ స్టార్‌గా మారాడు, సక్సెస్‌ల మీద సక్సెస్‌లు కొడుతున్నాడు. కానీ తమ్ముడు శిరీష్‌ విషయంలో ఆ సక్సెస్‌ ఇంకా పలకరించలేదు. నెగెటివ్‌ కామెంట్స్‌ దగ్గరే ఆగిపోయింది ఆయన కెరీర్‌. తాజాగా అల్లు శిరీష్‌ హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం 'శ్రీరస్తు శుభమస్తు'. పరశురామ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో లావణ్య త్రిపాఠి హీరోయిన్‌గా నటిస్తోంది. అల్లు శిరీష్‌కి ముచ్చటగా మూడో సినిమాగా తెరకెక్కుతోంది ఈ చిత్రం. తొలి రెండు సినిమాలతోనూ అల్లు శిరీష్‌ అంతగా ఆకట్టుకోలేకపోయాడు.

కానీ ఈ సినిమా కోసం చాలా కష్టపడుతున్నాడు. అన్ని విషయాల్లోనూ ఈ సినిమాకి చాలా డెవలప్‌ అయ్యాడు శిరీష్‌. నటనలోనూ, డాన్సుల్లోనూ, లుక్స్‌లోనూ కూడా ఎట్రాక్ట్‌ చేసేలానే ఉన్నాడట. అల్లు అరవింద్‌ నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమా బడ్జెట్‌ విషయంలో కూడా ఏమాత్రం వెనుకాడకుండా కలర్‌ఫుల్‌గా తెరకెక్కించారు. కాస్టింగ్‌లో కూడా సీనియర్‌ తారాగణంతో, స్క్రీన్‌ నిండా నిండుగా అందంగా కనిపించేలా చేశారు. ఉమ్మడి కుటుంబంలోని ఎమోషన్స్‌ని, ఆప్యాయత, అనురాగాల్ని చక్కగా చూపించారు ఈ సినిమాలో. తాజాగా విడుదలైన ఆడియో ఆకట్టుకుంటోంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ సినిమా ఆగష్టు 5న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. 

మరిన్ని సినిమా కబుర్లు
boxing coach venkatesh