Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
sreerastu shubhamastu hit

ఈ సంచికలో >> సినిమా >>

బాక్సింగ్‌ కోచ్‌ విక్టరీ వెంకటేష్‌

boxing coach venkatesh

బాలీవుడ్‌లో 'సాలా ఖదూస్‌' అనే చిత్రం ఘనవిజయం సాధించింది కొన్నాళ్ళ క్రితం. ఘనవిజయం సాధించడం కన్నా దేశవ్యాప్తంగా ఆ చిత్రం గురించి అందరూ చాలా గొప్పగా చెప్పుకున్నారు. కారణం ఆ సినిమాలో బాక్సింగ్‌ కోచ్‌ పాత్రలో మాధవన్‌ నటించడమే. బాక్సింగ్‌ నేర్చుకునే యువతిగా ఆ చిత్రంలో రితికా సింగ్‌ నటించింది. భావోద్వేగాలతో కూడిన చిత్రమది. మంచి యాక్షన్‌ సీక్వెన్సెస్‌తో రూపొందించారు 'సాలా ఖదూస్‌' చిత్రాన్ని. కమర్షియల్‌ ఎలిమెంట్స్‌తో కూడిన చక్కటి మెసేజ్‌ ఉన్న 'సాలా ఖదూస్‌'ని తెలుగులోకి విక్టరీ వెంకటేష్‌తో రీమేక్‌ చేయాలనుకుంటున్నారు. వెంకటేష్‌ నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ ఇదివరకే వచ్చేసింది. మారుతి దర్శకత్వంలో నయనతార హీరోయిన్‌గా రూపొందిన 'బాబు బంగారం' విడుదలయ్యాక వెంకటేష్‌, 'సాలా ఖదూస్‌' రీమేక్‌ పనుల్లో బిజీ అవుతారు. ఒరిజినల్‌లో నటించిన రితికా సింగ్‌నే, తెలుగు వెర్షన్‌కి కూడా తీసుకోవాలనుకుంటున్నారట. తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా అదనంగా కొన్ని మార్పులు చేర్పులు ఖచ్చితంగా ఉంటాయి. ఇటీవలి కాలంలో వెంకటేష్‌ చేస్తున్న చిత్రాలు చూస్తుంటే, ఆయన ఎంచుకుంటున్న పాత్రలు, సినిమాలు అందర్నీ ఆశ్చర్యపరచకమానవు. 'గోపాల గోపాల' లాంటి సినిమాకీ, 'దృశ్యం' లాంటి సినిమాకీ ఆయన గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడం చాలా గొప్ప విషయం. 'సాలా ఖదూస్‌' కూడా అంతే. ఇమేజ్‌ని పక్కన పెట్టి, కథా నేపథ్యం ఉన్న చిత్రాల్ని చేస్తూ సక్సెస్‌లు కొడ్తున్న వెంకీ 'సాలా ఖదూస్‌'తో కూడా మంచి విజయాన్ని అందుకోనున్నారని నిస్సందేహంగా చెప్పవచ్చు. ఆల్‌ ది బెస్ట్‌ టు వెంకీ. 
 

మరిన్ని సినిమా కబుర్లు
ramasakkani rakumarudu songs release