Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
sirasri question

ఈ సంచికలో >> శీర్షికలు >>

మన ఆరోగ్యం మన చేతుల్లో - అంబడిపూడి శ్యామసుందర రావు

నా గురుంచి :నేను బేసిక్ గా సైన్సు టీచర్ అవటంవల్ల సైన్సు పట్ల ఆసక్తితో  సైన్సు నేపధ్యముతో కాలేజీ రోజులనుంచి వ్యాసాలూ కాలేజీ మేగజైన్లకు వ్రాస్తూండేవాడిని తరువాత ఉద్యోగమూ పని ఒత్తిడివల్ల రచన వ్యాసంగము కొద్దిగా వెనక పడింది పదవి విరమణ 2008లో చేసినాక మళ్ళా రచనా వ్యాసంగము  ప్రారంభించాను  మొదట "బుజ్జాయి" అనే చిన్న పిల్లల మాసపత్రికకు కధలు జనరల్
నాలెడ్జికి సంబంధించిన వ్యాసాలు వ్రాసేవాడిని ప్రస్తుతము ఆన్ లైన్ మేగజైన్ లకు వ్యాసాలూ వ్రాసి పంపుతున్నాను . తెలుగుమల్లి .కామ్ , అక్షర ఈ మేగజైన్ ,అచ్చంగా తెలుగు మాగజైన్ , మాలిక , సంస్కృతి వైభవము అనే పత్రికలలో నావ్యాసాలు ప్రచురించబడ్డాయి . నాకు మొదటినుండి పుస్తకాలు చదవటం అలవాటు అలా చదవటమువల్ల నేను తెలుసుకున్న విషయాలను నా వ్యాసాల ద్వారా నలుగురి తో పంచుకోవటము నా హాబీ ' పంచుకుంటే  పెరిగేదే జ్ఞానము" అనే సిద్ధాంతాన్ని నమ్మేవాడిని  అందువల్లే రిటైర్  అయినా ఇంకా టీచింగ్ జాబ్ లో  ఉండి కాలాన్ని గడుపుతున్నాను నా ఆరోగ్యము అనుమతించినత వరకు పిల్లలకు పాఠాలు చెప్పాలనేదే నా కోరిక. ఇప్పటివరకు
భగవంతుని దయ వలన  నాకు ఏవిధమైన ఆరోగ్యసమస్యలు ,ఆర్ధిక సమస్యలు లేకుండా
కాలము వెళ్లబుచ్చుతున్నాను 


ప్రకృతి మనము సుఖముగా ఆరోగ్యవంతముగా బ్రతకటానికి అవసరమైనవి అన్నిఇచ్చింది వాటిని మనము వినియోగించు కుంటే మనము ఆరోగ్యముగా నిండు నూరేళ్లు బ్రతకవచ్చు.  మన  ఆహారములో ప్రధానమైనది  దక్షిణాదిన బియ్యము ,ఉత్తరాదిన గోధుమలు వీటితో పాటు శాఖ పాకాలు  అంటే కూరగాయలు కలుపుకొని తింటాము. కూరగాయలు వండుకొని అన్నములో కలిపి తినటంలో రుచి ప్రధానము కాదు ఆరోగ్యముకోసము వీటిని విధిగా తినాలి . మన ఆహారములో కూరగాయలతో పాటు పండ్లు ఫలాలు కూడా ప్రధాన పాత్ర వహిస్తాయి.  ఇవన్నీ శరీరానికి అవసరమైన విటమిన్లను పోషకాలను అందిస్తాయి.  వీటివల్లే మనిషికి అన్ని విధాల ఎదుగుదల ఉంటుంది. ఈ మధ్య శాస్త్రవేత్తల పరిశోధనల ప్రకారము మాంసాహారము కన్నా శాఖాహారము శ్రేష్టము అని తెలిసింది . ప్రస్తుతము మనము ఎక్కువగా తినే,మనకు ఎక్కువగా దొరికే పండ్లు ,కూరగాయలు వాటిలోని ఫోషకాలు అవి మన శరీరానికి ఏవిధముగా సహాయ పడతాయి మనము ఆరోగ్యముగా ఉండటానికి అవి ఏవిధముగా తోడ్పడుతాయి, మనకు డాక్టరు మందులు పనిలేకుండా మన ఆరోగ్యాన్ని వీటిద్వారా అంటే మనచేతుల్లోనే,మన చేతలద్వారా ఎలా  కాపాడుకోవచ్చో తెలియజేయాలని నాప్రయత్నము.

మరిన్ని శీర్షికలు
weekly horoscope 5th august to 11th august