Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
mana arogyam mana chetullo

ఈ సంచికలో >> శీర్షికలు >>

5-08-2016 నుండి 11-08-2016 వరకు వారఫలాలు - శ్రీకాంత్

మేష రాశి : ఈ వారం మొత్తంమీద కుటుంబంలో నిర్ణయాల పైన తండ్రితరుపు బంధువుల ప్రభావం అధికంగా ఉంటుంది. చేపట్టిన పనులను పూర్తిచేయడానికి వారం ఆరంభంలో శ్రమించాల్సి వస్తుంది. ఉద్యోగంలో అధికారులతో మీకున్న పరిచయం మూలాన నూతన ప్రయత్నాలు చేయగలుగుతారు. దూరప్రదేశప్రయాణాల విషయంలో ఒక నిర్ణయానికి వస్తారు. వ్యాపారపరమైన విషయాల్లో మిశ్రమఫలితాలు పొందుతారు. వాహనముల మూలాన ఊహించని ఖర్చులకు అవకాశం ఉంది. ఆరోగ్యం విషయంలో మాత్రం అశ్రద్ధ చేయకండి. మిత్రులతో కలిసి వినోదపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. 
 

 

వృషభ రాశి : ఈ వారం మొత్తంమీద మీ ఆలోచనలను పెద్దలకు తెలియజేసే ప్రయత్నం చేయుట మంచిది. ముఖ్యమైన నిర్ణయాల విషయంలో అనుభవజ్ఞుల ఆలోచనల మేర ముందుకు వెళ్ళండి. ఉద్యోగంలో అధికారులకు అనుగుణంగా నడుచుకొనుట, తోటిఉద్యోగులను కలుపుకొని వెళ్ళుట సూచన. సాధ్యమైనంత వరకు దూరప్రదేశప్రయాణాలు వాయిదా వేయుట సూచన. సోదరులతో మీ ఆలోచనలు పంచుకుంటారు, వారితో కలిసి నూతన ప్రయత్నాలు చేయుటకు అవకాశం కలదు. కుటుంబలో కొన్ని కొన్ని విషయాల్లో సర్దుబాటు విధానం కలిగి ఉండుట సూచన. మిత్రులతో చర్చలు చేయుటకు అవకాశం ఉంది.   

 

                       

మిథున రాశి :   ఈ వారం మొత్తంమీద ఇష్టమైన వ్యక్తులను కలుస్తారు, వారితో కలిసి నూతన ప్రయత్నాలు మొదలు పెట్టుటకు అవకాశం ఉంది. చేపట్టిన పనులను పూర్తిచేయుటకు కాస్త శ్రమించాల్సి వస్తుంది. కొన్ని కొన్ని విషయాల్లో మీ మాటతీరు వివాదాలకు దారితీస్తుంది, కావున కొంత సంయమనం పాటించుట మంచిది. మిత్రులతో కలిసి ప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది. విదేశీప్రయాణాలు చేయుటకు ఆస్కారం కలదు. బంధువులను కలుసుకునే ఆస్కారం ఉంది. ఆర్థికపరమైన విషయాల్లో ఖచ్చితత్వం పాటించుట సూచన. అన్నివేళలా మధ్యవర్తిత్వం పనికిరాదు, నిదానమే మంచిది అని గుర్తుపెట్టుకోండి.     

 

 

కర్కాటక రాశి : ఈ వారం మొత్తంమీద ఎవ్వరితోను మాటపట్టింపులకు పోకండి. చేపట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేయడానికి శ్రమించాల్సి వస్తుంది. ఉద్యోగంలో అధికారుల సూచనలను పరిగణలోకి తీసుకోండి. దూరప్రదేశంలో ఉన్న మిత్రులనుండి కీలకమైన విషయాలు తెలుస్తాయి. ఆర్థికపరమైన విషయాల్లో అనుభవజ్ఞుల సూచనల మేర ముందుకు వెళ్ళండి. నిర్ణయాలు తీసుకోవడంలో తడబాటు ఉంటుంది, కావున సాద్యమైనంత వరకు బాగాఆలోచించి ముందుకు వెళ్ళండి. ప్రయాణాలు చేయునపుడు తగిన జాగ్రత్తలు తీసుకోవడం సూచన. మిత్రులతో సమయాన్ని గడుపుతారు.  
 

           
సింహ రాశి : ఈ వారం మొత్తంమీద దాదాపుగా చేపట్టిన పనులను మొత్తంగా పూర్తిచేసే అవకాశం ఉంది. గతంలో మీరు తీసుకున్న నిర్ణయాలకు గాను పెద్దలనుండి ఆశించిన విధంగా ఫలితాలు వస్తాయి. రావాల్సిన ధనం మొత్తం మీద రాబట్టుకోగలుగుతారు. ముఖ్యమైన నిర్ణయాల విషయంలో మాకంటూ ఒక స్పష్టమైన విధానం ఉండుట వలన మరింత సంతృప్తికరమైన ఫలితాలు పొందుతారు. వ్యాపారపరమైన విషయాల్లో మిత్రులనుండి చక్కటి సహకారం లభిస్తుంది. దూరప్రదేశంలో ఉన్న మిత్రులకు సహాయం చేస్తారు. కుటుంబంలో ఒకరి ఆరోగ్యం ఒకింతగా మిమ్మల్ని ఆందోళనకు గురిచేసే అవకాశం ఉంది జాగ్రత్త.   

 

కన్యా రాశి : ఈ వారం మొత్తంమీద కుటుంబసభ్యులతో సమయాన్ని గడుపుటకు ప్రయత్నం చేయుట మంచిది. మాటతీరు మార్చుకోవడం వలన మరింత ఫలితాలు పొందవచ్చును. ఉద్యోగంలో విషయంలో మీకు స్పష్టమైన ఆలోచన ఉండటం అలాగే శ్రమించుట ద్వారా ఆశించిన ఫలితాలు పొందే అవకాశం ఉంది. వ్యాపారపరమైన విషయాల్లో నూతన పెట్టుబడులకు ఆస్కారం కలదు. విదేశీప్రయత్నాలు మొదలు పెట్టుటకు మంచి కాలం ముందుకు వెళ్ళండి. మిత్రులతో మీ ఆలోచనలు పంచుకొనే ప్రయత్నం చేస్తారు. బంధువులతో మాటపట్టింపులకు వెళ్ళకండి. కొన్ని కొన్ని విషయాల్లో నిర్ణయాలు తీసుకోవడంలో సందిగ్దత ఉంటుంది. 

   

తులా రాశి : ఈ వారం మొత్తంమీద చేసే పనుల విషయంలో స్పష్టత అవసరం. ఉద్యోగంలో అధికారులకు అనుగుణంగా నడుచుకొనుట సూచన. సమయాన్ని సద్వినియోగం చేసుకొనే ప్రయత్నం మంచిది. వ్యాపారపరమైన విషయాల్లో పెట్టుబడుల విషయంలో బాగాఆలోచచించి నిర్ణయం తీసుకోవడం మంచిది. మిత్రులతో మీ ఆలోచనలను పంచుకుంటారు. నూతన ప్రయత్నాలు మొదలు పెట్టు విషయంలో తొందరపాటు కూడదు. ఆరోగ్యపరమైన ఇబ్బందులు మిమ్మల్ని కొంత యిబ్బందికి గురిచేసే అవకాశం కలదు, జాగ్రత్త. మీ కోపం మూలాన ఆత్మీయులతో విభేదాలు ఏర్పడే ఆస్కారం కలదు, కావున సర్దుబాటు విధానం అన్నివిధాలా శ్రేయస్కరం.   

    

వృశ్చిక రాశి  : ఈ వారం మొత్తంమీద చాలావరకు అనుకూలమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. చక్కటి ప్రణాళిక కలిగి ఉంటె ఉన్నతమైన ఫలితాలు వస్తాయి. ఉద్యోగంలో అధికారులనుండి ప్రశంశలు పొందుతారు. ప్రయాణాలు చేయుటకు అవకాశం కలదు, విదేశీప్రయాణాలు కలిసి వస్తాయి. నూతన పరిచయాలకు అవకాశం ఉంది. వారితో కలిసి సమయాన్ని సరదాగా గడుపుటకు ఆస్కారం కలదు. కుటుంబపరమైన విషయాల్లో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకొనే ఆస్కారం కలదు. నూతన వాహనములు కొనుగోలు చేయుటకు అవకాశం కలదు. మిత్రులతో కలిసి నూతన పనులను మొదలు  పెట్టుటకు అవకాశం ఉంది.    

 

ధనస్సు రాశి  :  ఈ వారం మొత్తంమీద ఆరంభంలో స్వల్ప ఇబ్బందులు ఏర్పడ్డ వాటిని అధిగమిస్తారు. వ్యాపారంలో నూతన ప్రయత్నాలు చేయుటకు ఆస్కారం కలదు. పెట్టుబడులకు అనుకూలమైన సమయం, జాగ్రత్తగా ప్రణాళిక చేసుకుంటే లబ్దిని పొందుతారు. అగ్నిసంభందమైన వస్తువులతో పనిచేసే సమయంలో మాత్రం తగిన జాగ్రత్తలు తీసుకోండి. దైవపరమైన విషయాలకు సమయం ఇవ్వండి. బంధువులతో కలిసి వినోదాలలో పాలగోనే ఆస్కారం కలదు. అధికారులతో మనస్పర్థలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవడం సూచన. ఆరోగ్యపరమైన సమస్యలు మిమ్మల్ని ఇబ్బందికి గురిచేసే అవకాశం ఉంది. విదేశీప్రయాణాలు కలిసి వస్తాయి.    

 

 

మకర రాశి  :  ఈవారం మొత్తంమీద నూతన ప్రయత్నాలు మొదలు పెట్టుటకన్నా గతంలో చేపట్టిన పనులను పూర్తిచేసే ప్రయత్నం చేయుట అన్నివిధాలా మంచిది. ఆర్థికపరమైన విషయాల్లో ఖర్చులను తగ్గించుకొనే ప్రయత్నం ఉత్తమం. వ్యాపారలావాదేవీలు ఆశించిన వేగంగా ఉండకపోవచ్చును. ఉద్యోగంలో సమయపాలన పాటించుట అవసరం. దూరప్రదేశంలో ఉన్న మిత్రులనుండి ముఖ్యమైన విషయాలు తెలుస్తాయి. సోదరపరమైన విషయాల్లో సమయాన్ని గడుపుతారు. నూతన వ్యాపారవిషయాల్లో కాస్త పరిశోధన చేసే ప్రయత్నం చేయండి. మొండి నిర్ణయాలు తీసుకోవడం కొన్ని సందర్భాల్లో మంచిది. 

 

 

కుంభ రాశి : ఈ వారం మొత్తంమీద పనుల మూలాన పనిభారం కలిగి ఉంటారు. విదేశీప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది. ఆర్థికపరమైన విషయాల్లో అనుకోని ఖర్చులకు ఆస్కారం కలదు. బంధుమిత్రులతో ఊహించని వివాదాలకు అవకాశం ఉంది, సర్దుబాటు విధానం మంచిది. కుటుంబంలో పార్థి విషయాన్ని తెలియజేసే ప్రయత్నం చేయుట ఉత్తమం. ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చే అవకాశం కలదు. గతంలో మీరు సహాయపడిన మిత్రులనుండి ఊహించని విధంగా సహకారం లభిస్తుంది. దైవపరమైన విషయాలకు సమయం ఇవ్వడం సూచన. స్త్రీ పరమైన విషయాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవడం సూచన, మాటపడవలసి వస్తుంది జాగ్రత్త.       

 

 

 

మీన రాశి :   ఈవారం మొత్తంమీద చర్చాపరమైన విషయాలకు దూరంగా ఉండే ప్రయత్నం చేయుట మంచిది. ఆర్థికపరమైన విషయాల్లో మీకంటూ ఒక విధానం ఉండటం మంచిది. ఉద్యోగంలో అధికారులకు అనుగుణంగా నడుచుకోండి. ప్రయాణాలు చేయునపుడు తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. వ్యాపారపరమైన విషయాల్లో మిశ్రమఫలితాలు పొందుతారు. దూరప్రదేశంలో ఉన్న బాంధవులతో మీ ఆలోచనలు పంచుకుంటారు. రావల్సిన ధనం సమయానికి చేతికి అందుతుంది. మానసికంగా దృడంగా ఉండుట అలాగే నిర్ణయాల్లో స్పష్టత ఉంటె అనుకూలమైన ఫలితాలు పొందుటకు అవకాశం కలదు. 

మరిన్ని శీర్షికలు
viseshalu