Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
vrukshamulu - jeeva samrakshakulu

ఈ సంచికలో >> శీర్షికలు >>

సామాన్యుని అసహనం - అనంత

 

సింగపూర్ ని మొదటి ప్రధాని " లీ కున్ యూ " 25 సంవత్సరాల 111 రోజులు పరిపాలిస్తే(1923-2015) రెండో ప్రధానిగా వచ్చిన " గో చుక్ టోంగ్ " 13 సంవత్సరాల 250 రోజులు పరిపాలించాడు.

ఆ తర్వాత మొదటి ప్రధాని కొడుకు లీ హైన్ టాంగ్ ఆగస్ట్ 13, 2004 నుంచి ఇప్పటికీ ప్రధానిగా కొనసాగుతున్నాడు.

డిప్యూటీ ప్రధానిగా ( ఇండియన్ ) ధార్ మాన్ షణ్ముగ రత్నం కొనసాగుతున్నాడు.

మనదేశంలో ఎక్కువ కాలం జవహర్ లాల్ నెహ్రూ, ఆ తరువాత ఎక్కువ కాలం ఇందిరాగాంధీ కొనసాగారు.

సింగపూర్ ప్రధానుల్లాగా సమర్ధవంతంగా మన దేశాన్ని పరిపాలించలేకపోయారు.

మనదేశాన్ని 1947 నుంచి ఇప్పటిదాకా పరిపాలించిన, పరిపాలిస్తున్న ఏ ప్రధానీ సమర్ధులు కాలేకపోయారు.

కారణం తమ పార్టీయే తిరిగి గెలవాలి-తానే తిరిగి ప్రధానమంత్రి కావాలనేది ప్రధమ స్వార్థం

యాత్ర భక్తితో ప్రారంభమయితే ముక్తి లభిస్తుంది. స్వార్థంతో మొదలయితే బూడిదే. స్వార్థం, కోరికలు, అధికార మదం అబద్ధాలు, పొగరుబోతుతనం, ఇగో, ఈ అవలక్షణాలతో భారతదేశపు ప్రధాని పదవి అలంకరిస్తే దేశం ఏ రీతిన బాగుపడుతుంది?

భారతదేసపు ప్రధానుల తప్పుడు వాగ్దానాలు, అబద్ధాలు పోగేస్తే సప్త సముద్రాలు కూడా చాలవు. ఇది భారతదేశపు సామాన్యుడి నేటి నిరసన, అసహనం...ఆవేదన...ఆక్రందన...నేటి నిరసనే రేపటి నిప్పు. ఈరోజు నిప్పే వచ్చేకాలంలో సివిల్ వార్ గా మారక తప్పదు.

ఈ దర్ద్రాన్ని పక్కన పెడితే సింగపూర్ కూడా ఒకప్పుడు అనిశ్చితికి, అల్లకల్లోలానికి అల్లాడిపోయిన దేశమే.

1390 లో పరమేశ్వర అనే చోళ చక్రవర్తి (భారత దేశపు చక్రవర్తి) సింగపూర్ ని పరిపాలించాడు.

ఒకప్పుడు మలేషియా, సింగపూర్ ని కలిపి మలయా ఎంపైర్ అనేవారు.

సింగపూర్ మూడవ శతాబ్దంలో చైనా ఐలాండ్ ఎట్ ది ఎండ్ ఆఫ్ మలేషియా అనేవారు.

రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో ( 1942-1945) సింగపూర్ ని జపాన్ ఆక్రమించుకొంది.

యుద్ధం సమసిపోగానే బ్రిటిష్ ఆధీనంలోకి వెళ్ళిపోయింది.

బ్రిటిష్ క్రమంగా తన పట్టు సడలిస్తూ సెల్ఫ్ గవనమెంట్ ఏర్పాటు చేసుకొనే అవకాశం సింగపూర్ ప్రజలకి కల్పించింది. తరువాత కాలంలో మలయా ఫెడరేషన్ నుంచి విడిపోయింది.

సింగపూర్ ని పరిపాలించే పీపుల్స్ ఏక్షన్ పార్టీకి మలేషియా ఎలయన్స్ పార్టీకి ఘర్షణ ప్రారంభం కావటంతో 1963 లో సింగపూర్ పూర్తిగా మలేషియా నుంచి వేరుబడి పోయింది.

ఆగస్ట్ 9, 1965 నాడు రిపబ్లిక్ ఆఫ్ సింగపూర్ గా తెరెత్తుకుంది.

ఆ టైములో సింగపూర్ లో తీవ్రస్థాయిలో నిరుద్యోగం చోటు చేసుకునుంది. ఆకలి, పేదరికం, అసంతృప్తి, అసహనం, దేశమంతా నెన్లకొనుంది.

దేశ మొదటి ప్రధాని వెంటనే తేరుకొని మోడర్నైజేషన్ పథకాన్ని ప్రారంభించి 1970 కల్లా మాన్యుఫాక్చరింగ్ ఇండస్ట్రీతోపాటు పెద్ద స్థాయిలో ఇళ్ళ నిర్మాణం, విద్యావ్యవస్థ మీద పూర్తిగా దృష్టి కేంద్రీకరించి ..1990 కల్లా బాగా వృద్ధి చెందుతున్న దేశంగా గుర్తింపు పొందింది.

అంటే కేవలం 25 సంవత్సరాల్లోనే అత్యున్నత స్థాయికి ఎదిగిపోయి ఫ్రీ మార్కెట్ ఎకానమీగా అంతర్జాతీయంగా వ్యాపార పారిశ్రామిక అనుబంధాల్ని ఏర్పరుచుకొంది.

ఆసియాలో జపాన్ తరువాత అత్యంత సుసంపన్నమైన దేశంగా ఎదిగిపోయింది.

మనకెప్పుడు ఇండిపెండెన్స్ వచ్చింది? 1947 లో...

ఇప్పుడు మనదేశం ఎలా వుంది? అలాగే...అప్పటి లాగే..ఏ అభివృద్ధి లేదు - ఏ ప్రగతి లేదు.

భారత దేశపు రాజకీయ నాయకులందరూ ఉట్టి వెధవాయిలు అని బాగా రుజువు చేసుకొన్నారు...చేసుకుంటున్నారు.

ఇప్పటివరకు(69 సంవత్సరాలలో) భారతదేశపు సామాన్యులకు, రైతులకు రైతు కూలీలకు, కార్మికులకు ఒరిగిందేమిటి? శూన్యం..

మనదేశంలో ఉన్న రాజకీయ పార్టీల్ని, వాటి నాయకుల్ని తరిమి తరిమి కొడితే తప్ప ప్రయోజనం శూన్యం.

నదుల అనుసంధానమేమయి పోయింది? గంగా ప్రక్షాళన ఎప్పటికి? మేకిన్ ఇండియా ఏ మూలనుంది? జాతీయ ప్రాజెక్టులు ఏమైపోయాయి?

ఎవరికీ అర్థం కావటం లేదు. ప్రజలనుంచి పన్నుల రూపంలో వసూళ్ళు ఎటుపోతున్నాయి?

కబురే తప్ప కార్యాచరణ లేని దేశం మనది.

రాజకీయ నాయకులు, బడా పారిశ్రామికవేత్తలు, అత్యున్నత స్థాయి ప్రభుత్వోద్యోగులు తప్ప దేశంలో ప్రతి ఒక్కరూ ఎన్నెన్నో ఇబ్బందులకు గురవుతూనే ఉన్నారు. ఇంకా..

వీళ్ళందర్నీ సింగపూర్ కి పంపించి ఐస్ గడ్డల మీద కూర్చోబెట్టి, క్రింద భాగం మొద్దుబారాక కొరడ దెబ్బల శిక్ష విధించి, ఆ పైన అభివృద్ధి, దార్శనికత, ముందు చూపు, కఠిన శ్రమ, ప్రజాసేవ, దేశభక్తి పాఠాలు బోధిస్తే తప్ప ప్రయోజనం లేదు.

సామాన్య మానవులు ఇంకెన్ని దశాబ్దాలు తమ జీవితాలు బాగుపడడం కోసం ఎదురు చూడాలి? శతాబ్దాలు తరబడి ఓట్లేసి రాజకీయ నాయకులు ధనికులయ్యేలా చూడటమేనా సగటు భారతీయుడి దుస్థితి...?

1947 నుంచి భారతదేశపు రాజకీయ నాయకుల ఆస్థి పాస్తుల చిట్టా ఒక్కసారి చూస్తే...వారు ఇప్పటివరకూ దోచుకున్న ప్రజాధనం ఐదు కోట్ల కోట్లట...

ప్రపంచదేశాలు నవ్విపోతున్నాయి....

వచ్చేవారం

సింగపూర్ పాఠం-5

 

 

 

..

మరిన్ని శీర్షికలు
sirasri question