Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
veekshanam

ఈ సంచికలో >> శీర్షికలు >>

దొండకాయ మసాలా కూర - - పి . శ్రీనివాసు

కావలిసిన పదార్ధాలు:  దొండకాయలు,  ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, నూనె, కారం, ఉప్పు, అల్లంవెల్లుల్లి ముద్ద, పసుపు, చింతపండు రసం ( చిక్కగా ), మసాలా పొడి

తయారుచేసే విధానం:  ముందుగా బాణలిలో నూనె పోసి అది కాగాకా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి ముద్ద  వేసి బాగా వేగనివ్వాలి  తరువాత సన్నగా తరిగిన దొండకాయలను వేసి బాగా కలిపి 2 నిముషాలు మూతపెట్టాలి. తరువాత పసుపు , కారం,ఉప్పు  వేసి కలిపి చిక్కటి చింతపండు రసాన్ని పోసి 10 నిముషాలు మూతవుంచాలి. చివరగా మసాలాపొడిని వేసి కలపాలి.  అంతేనండీ....! వేడి వేడి దొండకాయ మసాలా కూర రెడీ...          

మరిన్ని శీర్షికలు
Abdominal Pain and Ayurveda Treatment in Telugu Dr. Murali Manohar Chirumamilla, M.D.