Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
janata garriage break all records

ఈ సంచికలో >> సినిమా >>

పట్టాలెక్కించేస్తున్న పవన్‌

pavan next movie ready

సందిగ్ధం తొలగింది. పవన్‌కళ్యాణ్‌ తన కొత్త సినిమాని పట్టాలెక్కించేస్తున్నాడు. 'గోపాల గోపాల' ఫేం డాలీ దర్శకత్వంలో రూపొందనున్న ఈ సినిమాకి ఇంకా టైటిల్‌ నిర్ణయించలేదు. తమిళంలో అజిత్‌ హీరోగా వచ్చిన 'వీరమ్‌' సినిమాని తెలుగులోకి రీమేక్‌ చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. అయితే ఇది రీమేక్‌ కాదు, డాలీ సొంత కథ అని కూడా టాక్‌ వినవస్తోంది. సినిమా ప్రారంభానికి ముందు చిత్ర యూనిట్‌ అన్ని విషయాలపైనా క్లారిటీ ఇస్తుందట. తొలి షెడ్యూల్‌ చాలా చిన్నదిగా ప్లాన్‌ చేశారని సమాచారం. రెండో షెడ్యూల్‌లో ఎక్కువ పార్ట్‌ షూటింగ్‌ జరుగుతుందట. విదేశాల్లో కొన్ని పాటల్ని చిత్రీకరించనున్నారని తెలియవస్తోంది.

హీరోయిన్‌ ఎవరనేదానిపై ఇంకా సస్పెన్స్‌ కొనసాగుతోంది. వాస్తవానికి ఈ సినిమా ఎస్‌జె సూర్య దర్శకత్వంలో రూపొందాల్సి ఉంది. ఎస్‌జె సూర్యతో కలిసి సినిమా ప్రారంభోత్సవం గతంలో జరిపారు. అయితే కొన్ని కారణాలతో ఎస్‌జె సూర్య ఈ సినిమా నుంచి తప్పుకున్నాడు. లేదంటే ఈ పాటికి పవన్‌ షూటింగ్‌కి హాజరవడం, కొంతవరకు షూటింగ్‌ పార్ట్‌ పూర్తవడం కూడా జరిగిపోయేదే. ఏదేమైనా తమ అభిమాన హీరో సినిమా పట్టాలెక్కుతోందనే వార్త అభిమానుల్ని ఆనందోత్సాహాల్లో ముంచెత్తుతోంది. పవన్‌కళ్యాణ్‌ స్నేహితుడు శరద్‌మరార్‌ ఈ చిత్రానికి నిర్మాత. పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి ఉంది

మరిన్ని సినిమా కబుర్లు
sekar kammula start