Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
sahiteevanam

ఈ సంచికలో >> శీర్షికలు >>

వృక్షములు - జీవ సంరక్షకులు - -హైమాశ్రీనివాస్

vrukshamu - jeeva samrakshakulu

తాళద్రుమము [తాటిచెట్టు.] 

ఆంధ్రుల కల్ప వృక్షం తాటి చెట్టు. ఇది మొదలు నుండీ తల వరకూ సంపూర్ణంగా మానవులకు ఉపయోగిస్తుంది. మాను, ఆకులు, కాయలు, పండ్లు, నార అన్ని భాగాలూ ఉపయోగకరమైనవే! త్యాగ లక్షణం తాటి చెట్టు నుంచే మనం నేర్చుకో వాల్సి ఉంది.  వేసవి వచ్చిందంటే బండ్ల మీద నగరాల్లో సైతం తాటి ముంజలు అమ్మడం మనకు కనిపిస్తుంటుంది. ఒక తాటికాయలో 2లేక 4, పెద్ద కాయలో 4 కూడా ముంజలుంటాయి. వేసవిలో తాటిముంజలు సహజమైన  జున్నులా కమ్మగా ఉంటాయి. వాటి లోని నీరు చాల చల్లదనం. తాటి చెట్టు సంపూర్ణంగా మానవులకు తన సర్వ భాగాలనూ త్యాగం చేసి ఆదర్శప్రాయమైంది.

ముందుగా  తాటి ఆకుల ఉపయోగం చెప్పుకుంటూపోతే  చాలా ఉంది. పూర్వం కాయితాలు లేనప్పుడు మహాకవులంతా తాటాకు లపై వ్రాసే వారు.  తాటాకును చక్కగా తగినంత పొడవుతో కత్తిరించి పైన ఒక రంద్రం చేసి , ఆ తాటాకు మీద కావ్యాలు వ్రాసేవారు, కాళీదాసు , నన్నయ,తిక్కనాదులే కాక , అన్నమాచార్యులు ,రామదాసు వంటి వారంతా తాళపత్రాల మీద వ్రాసినవారే. ఇవే తాళ పత్రగ్రంధాలు. ఇప్పటికీ కొన్ని  ఆ తాళపత్ర గ్రంధాలు భద్రపరచబడి ఉన్నాయి.

తాటి చెట్టు  పొడవు 30 మీటర్ల ఎత్తు వరకు పెరుగుతుంది. పొడవుగా ఉన్న వారిని తాటిలా ఎదిగాడు అంటారు. అంటే తాటిచెట్టు నేరు గా పొడవుగా, బలంగా ఎదుగుతుంది. దీనికి కొమలుండవు. తలపైభాగాన ఆకులు విస్తరించి ఉంటాయి.ఈ తాటాకులు  గ్రామాల్లో పేదలు మాత్రమే కాక చల్లదనం కోసం అంతా పాకలు, పందిళ్ళూ వేసుకుంటారు. పెళ్ళిళ్ళు, శుభకార్యాల్లో, దైవకార్యాల్లో తిరునాళ్ళలో పందిళ్ళు వేస్తారు. కమ్మని వాసనతో చల్లగా ఉంటాయి.పూర్వం  చాపలు తాటాకులతోనే అళ్ళేవారు , సామాను భద్రపరచను బుట్టలు, అందమైన సేసంచులు, రకరకాల ఆకారల్లో రంగుల విసన కర్రలు, ఎండకు టోపీలు, గొడుగులు తయారు చేయడం పెద్ద కళ మాత్రమే కాక వారికి జీవనోపాధిగా కూడా ఉండేది.

తాటిచెట్టు వలన రైతులకు బాగా ఆర్ధిక లాభం కూడా కలుగుతుంది. తాటి పట్ట నుంచీ తీసిన నార గట్టి దారంగా ఉపయోగిస్తుంది. పందిళ్ళు వేసేప్పుడు కర్రలను కట్టనూ, ఇళ్ళపై కప్పు అల్లేప్పుడూ ఈ తాటి నార  వాడుతారు. తాటిచెట్టు మొదలు అంటే స్టం కలప గా ఉపయోగిస్తుంది.ఇళ్ళు కట్టను దూలాలుగా, స్తంభాలుగా ఉపయోగిస్తారు.తాటి మానులను పిల్ల కాలువలు  ఇటు నుంచి అటు దాటను కాలువ పైన వేసి దాని పైనుంచీ నడుస్తారు.

తాటి బెల్లం చాలా మంచిది.చలవ చేస్తుంది. తాటిబెల్లం తింటే దగ్గు తగ్గుతుంది. బాగా పండిన తాటి పండ్లు లోపల ఎర్రగా ఉండి తియ్యగా ఉంటాయి. గ్రామస్తులు ఇష్టంగా తింటారు. ఇహ తాతిముంజెలగురించీ చెప్పుకున్నాంకదా! తాటిపండ్ల నుండీ తయా రు చేసే తాండ్ర కూడా తింటారు. తాటి కల్లు చలవ చేస్తుందని త్రాగుతారు. ఐతే అది మద్యం కనుక మత్తు కలిగిస్తుంది. రామాయణంలో చాకలివాడు తాటికల్లు త్రాగి రాముని గురించీ ,చెడుగా మాట్లాడి,  ఒళ్ళుతెలియక సీతమ్మ మీద నింద వేస్తాడు. ఇంకా శ్రీరామచంద్రుడు వాలిని సం హరించగల సమర్ధుడైన వీరుడా కాదా అని నిర్ణయించు కోను సుగ్రీవుడు అర్ధ చంద్రాకా రంగా ఉన్న ఏడు తాటి చెట్లను ఒకే బాణంతో కొట్ట మంటాడు. అంటే తాటి చెట్టు రామాయణ కాలం నాడే ఉందని ఈ రెండు సంఘటనల ద్వారా తెలుస్తున్నది. 

బావినుంచీ నీరు తోడు కోను పూర్వం తాటి ఆకును వంపుగా మడిచి కట్టి బొక్కెనలుగా వాడేవారు.

ఇహ పల్లెల్లో  పిల్లలు తాటాకులతో బొమ్మలు తయారు చేసుకొని ,వాటికి బొమ్మల పెళ్ళిళ్ళు కూడా చేసేవారు, తాటాకు గిల కలు పసిపిల్లలకు మంచి ఆటవస్తువులు.పల్లెల్లో ఈ నాటికీ  తాటాకు ఆట వస్తువుగా బాగా ఉపయోగిస్తూనే ఉన్నారు. చేతికి వాచీలుగానూ,  బూరలుగానూ చేసి పీపీ అని ఊదుతుంటారు బొమ్మలపెళ్ళిళ్ళలో. కొన్నాళ్ళక్రితంవరకూ దీపావళికి తాటాకు  టపాకాయలు ఉండేవి. మరి ఇన్ని విధాల ఉపయోగించే  తాటిచెట్టు  వేసవిలోనే తాటి ముంజలను ప్రసాదిస్తుంటుంది,అందుకే తాటి ముంజ వేసవి  ఫలంగా చెప్పుకోవచ్చు. 

 

మరిన్ని శీర్షికలు
samaanyuni asahanam