Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
movie review

ఈ సంచికలో >> సినిమా >>

ఆటాడుకుందామంటున్న సుశాంత్‌

.sushanth  atadukundam movie ready to relese

అక్కినేని నాగేశ్వరరావు మనవడు సుశాంత్‌ హీరోగా తెరకెక్కిన 'ఆటాడుకుందాం రా' సినిమా విడుదలకు సిద్ధమైంది. స్టడీగా సినిమాలు చేస్తూ, ఏమాత్రం తొందరపడకుండా తన బాడీ లాంగ్వేజ్‌కి సూటయ్యే సినిమాలు చేస్తున్న సుశాంత్‌, 'ఆటాడుకుందాం రా' చిత్రంపై ఎన్నో అంచనాలతో ఉన్నాడు. ఈ సినిమా కమర్షియల్‌గా తనకు మంచి విజయాన్ని ఇస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు సుశాంత్‌. ఇటీవలే ఈ చిత్ర ఆడియో విడుదల వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. ఆగస్ట్‌ 19న 'ఆటాడుకుందాం రా' చిత్రాన్ని విడుదల చేయనున్నారు.

సుశాంత్‌ సరసన సోనమ్‌ బజ్వా ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది. టైటిల్‌ సాంగ్‌ కోసం అక్కినేని అఖిల్‌ని తీసుకున్నారు. టైటిల్‌ సాంగ్‌లో అక్కినేని అఖిల్‌ అప్పీయరెన్స్‌ అద్భుతంగా ఉండబోతోంది. మంచి డాన్స్‌ మూమెంట్‌తో పాటకి కిక్‌ ఇవ్వనున్నాడు అఖిల్‌. నెలల వయసులోనే కెమెరా ముందుకు వచ్చిన 'సిసింద్రీ' అఖిల్‌. 'సిసింద్రీ' సినిమాలోని 'ఆటాడుకుందాం రా' పాటనే ఈ సినిమా టైటిల్‌గా సుశాంత్‌ సినిమాకి పెట్టడంతో, తనవంతు కంట్రిబ్యూషన్‌గా టైటిల్‌ సాంగ్‌లో డాన్స్‌ చేయడానికి ఒప్పుకున్నానని అక్కినేని అఖిల్‌ చెప్పాడు. నాగేశ్వర్‌రెడ్డి దర్శకత్వంలో కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంపై ఇండస్ట్రీలో మంచి అంచనాలే ఉన్నాయి. అఖిల్‌తోపాటు నాగచైతన్య కూడా నటిస్తున్నాడు. 'ఆటాడుకుందాం రా' మంచి విజయం సాధించాలని ఆశిద్దాం. 

మరిన్ని సినిమా కబుర్లు
hebah patel  act in in angel movie