Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
.ramcharan  responsibility double

ఈ సంచికలో >> సినిమా >>

లక్ష్మీదేవిలా మారిన కంగనా రనౌత్‌

kangana ranaut as goddess lakshmi

బాలీవుడ్‌ భామ కంగనా రనౌత్‌ ఓ మంచి ఉద్దేశ్యంతో షార్ట్‌ ఫిలింలో నటించింది. అది కూడా స్వచ్ఛ భారత్‌పై అవగాహన కల్పించడం కోసం. ఊరికే లక్ష్మీదేవి కరుణించాలంటే కరుణించదు, లక్ష్మీదేవి కరుణించాలంటే మీరు పరిశుభ్రంగా ఉండాలి, పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలనే కాన్సెప్ట్‌తో ఈ షార్ట్‌ ఫిలింని రూపొందించారు. కాన్సెప్ట్‌ చాలా బాగుంది కదా. కాన్సెప్ట్‌ అనుకున్నాక లక్ష్మీదేవి ఎవరైతే బాగుంటుంది? అనే ఆలోచన చేసిన మేకర్స్‌కి ఠక్కున కంగనా రనౌత్‌ పేరు గుర్తుకొచ్చింది. ఆమె లక్ష్మీదేవిలా బాగుంటుందా? అని ఆలోచించారుగానీ, మేకప్‌ టెస్ట్‌ చేసే సరికి ఆమే బెస్ట్‌ ఆప్షన్‌ అని తెలుసుకున్నారు. అలా 'స్వచ్ఛ భారత్‌ లక్ష్మీదేవి' షార్ట్‌ ఫిలిం పట్టాలెక్కింది. షార్ట్‌ ఫిలిం ఇంటర్నెట్‌లో విడుదలయిన కాస్సేపట్లోనే సలచంనలాలు సృష్టించింది.

సినిమాల్లో వచ్చిన పేరు కన్నా చాలా ఎక్కువ మంచి పేరు ఈ షార్ట్‌ ఫిలింతో వచ్చిందని కంగనా రనౌత్‌ చెప్పింది. తెలుగులో కంగనా రనౌత్‌ 'ఏక్‌ నిరంజన్‌' అనే సినిమాలో నటించింది. పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో ప్రభాస్‌ హీరోగా రూపొందింది ఈ సినిమా. అందులోని కంగనా రనౌత్‌కీ, లక్ష్మీదేవి గెటప్‌లో కంగనా రనౌత్‌కీ అసలు పోలికే లేదు. లక్ష్మీదేవి పాత్రలో కంగనా రనౌత్‌ న భూతో న భవిష్యతి అనడం అతిశయోక్తి కాదు. అమితాబ్‌ బచ్చన్‌ సహా కొందరు బాలీవుడ్‌ నటులు ఈ షార్ట్‌ ఫిలింలో నటించారు. 

మరిన్ని సినిమా కబుర్లు
.manchu vishnu  so lucky...