Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
kangana ranaut as goddess lakshmi

ఈ సంచికలో >> సినిమా >>

మంచు విష్ణు 'లక్కున్నోడు'

.manchu vishnu  so lucky...

మంచు వారబ్బాయి మంచు విష్ణు ఇంకో సినిమాకి కమిట్‌ అయ్యాడు. ఆ సినిమా పేరు 'లక్కున్నోడు' అట. 'స్పీడున్నోడు', 'సరైనోడు' తర్వాత 'లక్కున్నోడు' టైటిల్‌ అన్నమాట. 'స్పీడున్నోడు' సినిమాలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ హీరో. ఆ సినిమా ఓ మోస్తరుగా ఆడింది. 'సరైనోడు' సినిమాలో అల్లు అర్జున్‌ హీరో. సెన్సేషనల్‌ హిట్టయ్యిందీ సినిమా.

ఇప్పుడు ఇంకా పెద్ద విజయాన్ని అందుకోవడానికి 'లక్కున్నోడు'గా మంచు విష్ణు సమాయత్తమవుతున్నాడు. 'గీతాంజలి' ఫేం రాజ్‌కిరణ్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడని సమాచారమ్‌. ఓ ప్రముఖ హీరోయిన్‌ మంచు విష్ణు సరసన హీరోయిన్‌గా ఎంపికైందట. కామెడీ ఎంటర్‌టైనర్స్‌ చేయడంలో విష్ణు దిట్ట. 'దూసుకెళ్తా', 'ఢీ', 'దేనికైనా రెడీ' వంటి హిట్‌ చిత్రాలున్నాయి విష్ణు కెరీర్‌లో. అన్నీ కామెడీ ఎంటర్‌టైనర్లే. థ్రిల్లర్‌ సినిమాలే చేసినా, కబుపుబ్బా నవ్వించిన ఘనత రాజ్‌కిరణ్‌ది. అలా వీరిద్దరి కాంబినేషన్‌లో రానున్న సినిమా కావడంతో 'లక్కున్నోడు' సినిమా గురించి ఇండస్ట్రీలో పాజిటివ్‌ బజ్‌ నడుస్తోంది. భారీ బడ్జెట్‌తో ఈ సినిమా త్వరలో సెట్స్‌పైకి వెళ్లనుందని సమాచారమ్‌. మెయిన్‌ హీరోయిన్‌తోపాటు సెకెండ్‌ హీరోయిన్‌ కూడా ఈ సినిమాలో నటించనుందని తెలియవస్తోంది. మంచు లక్ష్మి ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించే అవకాశాలున్నాయట. మరి 'లక్కున్నోడు'కి ఆల్‌ ది బెస్ట్‌ చెప్పేద్దామా? 

మరిన్ని సినిమా కబుర్లు
cheppukondi chooddam