Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
vrukshamulu  - jeeva samrakshakulu

ఈ సంచికలో >> శీర్షికలు >>

మన ఆరోగ్యం మన చేతుల్లో - అంబటిపూడి శ్యాంసుందర రావు

 

టమోటాలు వాటి ప్రయోజనాలు

వంటలలో ఎక్కువగా కలిపి వాడేది టమోటాలు అన్ని రకాల కూరలతో రుచికి టమోటాలను కలిపి వండుతారు. మన  ప్రాంతాలలో పండే పంట టమోటాలు. టమోటాలను రుచికే కాకుండా ఆరోగ్యానికి ఎందుకు   వాడాలో తెలుసుకుందాము. వీటి రంగు  మంచి ఆకర్షిణీయముగా, అంటే మంచి ఎరుపు రంగు లో ఉంటాయి. ఇవి ఆకర్షణీయముగానే కాకుండా విటమిన్ సితో నిండి  ఉంటాయి ,తక్కువ కెలొరీలతో ,క్రొవ్వు పదార్ధము లేకుండా టమోటాలు ఉంటాయి. టమోటాలు  ఆరోగ్యానికి ఏవిధముగా ఎన్ని రకాలుగా ఉపయోగ పడతాయో తెలుసుకుందాము.



1. ఒక ఎర్రటి పండిన టమోటా విటమిన్ సి, ఏ ,కె ,ఫోలేట్  మరియు పొటాషియం తో నిండి ఉంటుంది దీనిలో చాలా  స్వల్పముగా సోడియం,సంతృప్త  క్రొవ్వు,కొలెస్ట్రాల్, కెలోరీలు ఉంటాయి. ఇంకా టమోటాలలోని పోషకాలు థయామిన్ ,నియాసిన్ ,విటమిన్ B6,మెగ్నేషియం, ఫాస్ఫరస్ మరియు రాగి (మన శరీరానికి అవసరమయిన) లాంటి పదార్ధాలు ఉంటాయి.ఒక టమోటా 2గ్రాముల పీచును మన శరీరానికి అందిస్తుంది అంటే మనకు  ఒక రోజుకు అవసరమైన పీచులో ఒక టమోటాయే  7% పీచును అందిస్తుంది.

2. క్యారెట్ ,చిలగడ దుంపల మాదిరిగా టమోటాలు బీటా కెరోటీన్ ను కలిగి ఉంటాయి ఈ బీటా కెరోటీన్ లు చర్మాన్నిసూర్య రశ్మి వలన కలిగే నష్టాన్నినివారిస్తాయి. టమోటాలలోని"  లైకొపీన్ "(ఎరుపు వర్ణ పదార్ధము)సూర్య రశ్మిలోని అతినీల లోహిత కిరణాలనుండి రక్షణ కలుగచేస్తుంది. ఈ అతి నీల లోహిత కిరణాల ప్రభావము వలననే మన ముఖముపై ముడతలు ఏర్పడతాయి టమోటా చర్మము ముఖ్యముగా ముఖంపై ముడతలు ఏర్పడకుండా  కాపాడుతుంది.

3. టమోటాలలో సమృద్ధిగా ఉండే విటమిన్ కె మరియు క్యాల్షియమ్ లు ఎముకల ఆరోగ్యానికి, గట్టిదనానికి సహాయ పడతాయి ఈ ఖనిజలవణాలు ఎముకల గట్టిదనానికే కాకుండా ఎముకల రిపేరుకు కూడా ఉపయోగ పడతాయి. టమోటాలలోని ఎర్రని వర్ణద్రవ్యము లైకొపీన్ బోన్ మాస్ ను వృద్ధి చేసి ఎముకలకు సంబంధించిన వ్యాధి "ఆస్టియో పోరోసిస్ "నుఎదుర్కోవటానికి సహజ సిద్దమైన  ఔషధముగా పనిచేస్తుంది . ఈ లైసోపీన్ టమోటాలలోనే కాకుండా క్యారెట్ పుచ్చకాయలలో కూడా ఉంటుంది.

4.టమోటాలు క్యాన్సర్ ను ఎదుర్కొనే సహజ సిద్ద కారకాలు వీటిలోని లైకోపీన్ వివిధ రకాల క్యాన్సర్ అంటే ప్రోస్ట్రేట్ ,నోటి,ఒవేరియన్ వంటి క్యాన్సర్ లను వచ్చే అవకాశమును బాగా తగ్గిస్తుంది కారణము ఏమిటి అంటే వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు (విటమిన్ ఏ మరియు సి లు) కణాలు పాడవకుండా రక్షిస్తాయి.

5. టమోటాలలోని క్రోమియమ్ ధాతువు రక్తము లోని చక్కర నిల్వలను నియంత్రిస్తుంది  కాబట్టి టమోటాలు  తింటే రక్తములో చక్కర నిల్వలు అదుపులో ఉంటాయి.

6.టమోటాలలోని విటమిన్ ఏ కంటి చూపుకు అమోఘముగా పనిచేస్తుంది కంటికి సంబంధించిన " మాక్యులార్ డిజెనరేషన్  ను టమోటాలు  నిరోధిస్తాయి అని తాజా పరిశోధనలు తెలియజేస్తున్నాయి.

7. కంటికే  కాకుండా జుట్టు ఆరోగ్యము బాగా ఉండటానికి టమోటాలు ఉపయోగిస్తాయి .జుట్టు పలచబడటాన్ని పూర్తిగా నివారించలేకపోయినా వెంట్రుకల కుదుళ్ళు గట్టిపడి జుట్టు నల్లగా నిగనిగలాడే చేస్తుంది.

8.ప్రస్తుతము చాలా మంది ఎదుర్కొనే ఆరోగ్య సమస్య మూత్రపిండాలు ,పిత్తాశయములో రాళ్లు టమోటాలు తినటము వల్ల వీటిని నివారించవచ్చు అని శాస్త్రవేత్తలు చెపుతున్నారు. ముఖ్యముగా టమోటాలను విత్తనాలు లేకుండా తినటం వలన ఈ సమస్యలు వచ్చే అవకాశాలు తగ్గుతాయి.

9. నొప్పిని ఎదుర్కోవటము లో టమోటాలు బాగా పనిచేస్తాయి. ఆర్థరైటిస్ ,వెన్ను నొప్పి వంటివ్యాధుల వల్ల ఒక మోస్తరు నొప్పినుండి లేదా మొండి నొప్పులను తగ్గించుకోవటానికి టమోటాలు సహజ సిద్దమైన ముందుగా పనిచేస్తాయి. వీటిలోని బయోఫ్లవానాయిడ్స్ ,కెరోటినాయిడ్స్ (యాంటీ ఇన్ఫలమేటరీ ఏజెంట్లు) నొప్పిని తగ్గించటంలో ముఖ్య పాత్ర వహిస్తాయి .

మరిన్ని శీర్షికలు
veekshanam