Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
megastar 15oth movie shooting speed up

ఈ సంచికలో >> సినిమా >>

కళ్యాణ్‌ రామ్‌ 'దంచవే మేనత్తు కూతురా'

kalyan ram new movie start

'పటాస్‌' సినిమాతో జోరందుకున్న కళ్యాణ్‌రామ్‌, 'షేర్‌'తో చతికిలబడ్డాడు. ఇప్పుడు పూరీ జగన్నాధ్‌ డైరెక్షన్‌లో 'ఇజం' సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో నటిస్తూ, స్వీయ దర్శకత్వం వహిస్తున్నాడు కళ్యాణ్‌రామ్‌. ఈ సినిమాపై చాలా అంచనాలున్నాయి. ముద్దుగుమ్మ అదితి ఆర్య ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రం నిర్మాణ దశలో ఉండంగానే మరో సినిమాకి సైన్‌ చేశాడు ఈ నందమూరి యంగ్‌ హీరో. 'దంచవే మేనత్త కూతురా' అనే టైటిల్‌తో ఈ సినిమా తెరకెక్కబోతోంది.

బాబాయ్‌ బాలకృష్ణ సక్సెస్‌ ఫుల్‌ మూవీస్‌లో ఒకటయిన 'మంగమ్మగారి మనవడు' సినిమాలోని పాపులర్‌ సాంగ్‌ అయిన దంచవే మేనత్త కూతురా.. పాటలోని ఫస్ట్‌లైన్‌ని ఈ సినిమాకి టైటిల్‌గా ఎంచుకోవడం వెనుక విశేషమే ఉందట. కామెడీ ఎంటర్‌టైనర్స్‌ స్పెషలిస్ట్‌ అయిన జి.నాగేశ్వర్‌రెడ్డి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కబోతోందట. ఆల్రెడీ కళ్యాణ్‌రామ్‌ సాయిధరమ్‌ తేజ్‌తో ఒక మల్టీస్టారర్‌ మూవీకి కమిట్‌ అయ్యాడు. 'ఇజం' షూటింగ్‌ పూర్తయిన వెంటనే ఈ నందమూరి హీరో ఎట్‌ ఏ టైమ్‌ ఈ రెండు సినిమాలను పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు వచ్చే యోచనలో ఉన్నాడట. ప్రస్తుతం 'ఇజం' షూటింగ్‌ చివరి దశకు చేరుకుంది. అతి త్వరలోనే కళ్యాణ్‌రామ్‌, నాగేశ్వర్‌ రెడ్డి సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడి చేయనున్నారట. 
 

మరిన్ని సినిమా కబుర్లు
cheppukondi chooddam