Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
sahiteevanam

ఈ సంచికలో >> శీర్షికలు >>

26-8-2016 నుండి 1-9-2016 వరకు వారఫలాలు - శ్రీకాంత్

మేష రాశి : ఈ వారం మొత్తంమీద ముఖ్యంగా ఆర్థికపరమైన విషయాల్లో చాలా జాగ్రత్తగా వ్యవహరించుట వలన ఖర్చులను అదుపులో పెట్టుకొనే అవకాశం ఉంది. తలపెట్టిన పనుల విషయంలో స్పష్టమైన అవగాహన కలిగి ఉండుట ముఖ్యం. ఉద్యోగంలో మరింత ఉన్నతంగా వ్యవహరించుట వలన నలుగురిలో మంచి గుర్తింపును పొందుతారు లేకపోతే అపహాస్యం పాలయ్యే అవకాశం ఉంది జాగ్రత్త. గత కొంత కాలంగా పెండింగ్ లో ఉన్నటువంటి పనులను విజయవంతంగా పూర్తిచేస్తారు. దైవసంభందమైన కార్యక్రమాలకు సమయం కేటాయిస్తారు, దగ్గరి బంధువుల నుండి విలువైన సమాచారం తెలుస్తుంది. మిత్రులను కలుస్తారు వారితో కలిసి వినోదాల్లో పాల్గొంటారు. జీవితభాగస్వామితో విభేదాలు రాకుండా చుసుకొనే ప్రయత్నం చేయుట అవసరం. వారి నిర్ణయాలను గౌరవించుట అవసరం.  
 

 

వృషభ రాశి : ఈ వారం మొత్తంమీద అధికారులతో మంచి సంభందాలు కలిగి ఉండే ఆక్సరం కలదు వారికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవడం మంచిది. నూతన ప్రయత్నాల విషయంలో మాకంటూ ఒక విధానం కలిగి ఉండుట మంచి ఫలితాలనే కల్గజేస్తుంది. బంధువుర్గం ఉంది నూతన విషయాలను తెలుసుకుంటారు. ఆర్థికపరమైన విషయాల్లో ఊహించని విధంగా సహకారం లభించుట వలన సంతోషానికి లోనవుతారు. పూజలలో పాల్గొంటారు కుటుంబసభ్యులతో కలిసి పాల్గొనే ప్రయత్నం చేయండి మంచిది. చిననాటి మిత్రులను కలుస్తారు వారితో చర్చలు జేరుపుతారు. ప్రయాణాలు చేయునపుడు కాస్త ఇబ్బందులు పొందుటకు అవకాశం ఉంది కావున వాటిని వాయిదా వేయుట వలన మేలుజరుగుతుంది. సంతానం విషయంలో స్పష్టమైన ఆలోచనలు కలిగి ఉండి వాటికి సమయం ఇవ్వడం ఉత్తమం.        

 

 

 

మిథున రాశి :  ఈవారం మొత్తంమీద సంతానపరమైన విషయాల్లో స్వల్ప ఒత్తిడిని పొందుతారు అనుభవజ్ఞుల సూచనల మేర నడుచుకోండి. తలపెట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేస్తారు . వ్యతిరేక వర్గం నుండి స్వల్ప ఇబ్బందులు పెరుగుతాయి వాటి విషయంలో నిదానంగా జాగ్రత్తగా వ్యవహరించుట మంచిది. ధనమునకు స్మభంధించిన విషయాల్లో మంచి అవకశాలు లభిస్తాయి లాభంను పొందుతారు. ఉద్యోగంలో బాగుంటుంది నూతన ఆలోచనలను అమలుచేసే ప్రయత్నంలో ఆశించిన ఫలితాలు వస్తాయి. ప్రయాణాలు చేయుటకు అవకాశం కలదు చిన్న చిన్న జాగ్రత్తలు పాటించుట వలన మేలుజరుగుతుంది. దైవసంభందమైన కార్యక్రమాలకు సమయం ఇస్తారు వాటిలో పాల్గొనే అవకాశం ఉంది. నూతన నిర్ణయాలు తీసుకొని అందరిని ఆశ్చర్యానికి లోను చేస్తారు. 
 

కర్కాటక రాశి : ఈవారం మొత్తంమీద చేపట్టిన పనులలో ఉన్నతమైన ఫలితాలు పొందుతారు కాకపోతే అనవసరమైన ప్రేస్టీజ్లకు పోవడం పనిభారం ఎక్కువఅయ్యి మొదటికే మోసం వచ్చే అవకాశం కలదు జాగ్రత్త. బంధువులతో సమయాన్ని సరదాగా గడుపుటకు అవకాశం ఉంది వారినుండి మంచి సహకారం లభిస్తుంది. నూతన ప్రయత్నాలు మొదలు పెట్టెముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించి ముందుకు వెళ్ళుట అనేది సూచన. మానసికంగా కొంత ఒత్తిడిని చిన్న చిన్న కారనాలకే పొందుతారు ముఖ్యంగా అరోగ్యం విషయంలో మాత్రం స్పష్టమైన ప్రణాళిక కలిగి ఉండుట అవసరం. ఉద్యోగంలో మిశ్రమఫలితాలు ఉంటవి అధికారులకు అనుగుణంగా నడుచుకొనుట మేలు. కుటుంబసభ్యులతో కలిసి ప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది వారి మాటలను వినడం మేలు దానిమూలాన లబ్దిని పొందుతారు.   

 

           
సింహ రాశి : ఈ వారం మొత్తంమీద ఫలితాలు మీకు అనుకూలంగా వచ్చే అవకాశం ఉంది. చేపట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేసే అవకాశం కలదు. ఆర్థికపరమైన విషయాల్లో సంతృప్తికరమైన ఫలితాలు వస్తాయి,వ్యాపారపరమైన విషయాల్లో పెట్టుబడులకు ఆస్కారం కలదు. మీయొక్క మాటతీరు మూలాన ఇతరులు ఇబ్బందిపడకుండా చూసుకోండి. ఉద్యోగంలో లేక వృత్తిలో సమయపాలన అవసరం. అధికారులతో అలాగే తోటివారితో విభేదాలు రాకుండా చూసుకోవడం ఉత్తమం. కుటుంబసభ్యుల నుండి ఆశించిన సహకారం అందుటకు అవకాశం కలదు అలాగే చాలాముఖ్యమైన నిర్ణయాలు వారితో కలిసి చర్చలు చేసి తెసుకొనే ఆస్కారం కలదు. ప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది వాటికి సమయం ఇస్తారు. కొన్ని విషయాలు మిమ్మల్ని నిరాశకు గురిచేస్తాయి. 

 

కన్యా రాశి : ఈవారం మొత్తంమీద ఉత్సాహంతో మీరు చేపట్టిన పనులు మిమల్ని నలుగురిలో ఉన్నతంగా నిలబెడుతాయి. ఆర్థికపరమైన విషయాల్లో మంచి లబాహాలు పొందుతారు. వ్యాపారపరమైన విషయాల్లో ఊహించని అవకశాలు ఉంటవి వాటిని స్పస్తామైన ఆలోచన,ప్రణాళికతో సద్వినియోగం చేసుకోండి. ఉద్యోగంలో బాగుంటుంది స్వల్ప పనిభారం ఉన్నను అధికారుల నుండి ఆశించిన విధంగా సహకారం లభిస్తుంది. కుటుంబస్బహ్యులతో చేపట్టే చర్చల విషయంలో ఎంత నిదానంగా వ్యవహరిస్తే అంత అనుకూలమైన ఫలితాలను పొందుటకు అవకాశం ఉంది. దూరప్రదేశ ప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది కలిసి వస్తాయి కూడా. మిత్రుల నుండి విలువైన సమాచారం తెలుసుకొనే అవకాశం ఉంది చిన్నర్తి మిత్రులను కలుస్తారు వారితో కలిసి విందులలో పాల్గొంటారు.  

 

   

తులా రాశి : ఈవారం మొత్తంమీద ఆరంభంలో అనవసరమైన విషయాల్లో తలదూర్చుట వలన మాటలు పడవలసి వస్తుంది. నూతన పరిచయాలు కలుగుతాయి వారితో కలిసి కొత్త కొత్త ఆలోచనలు చేస్తారు. ఆర్థికపరమైన విషయాల్లో మీరు సంతృప్తికరమైన ఫలితాలను పొందుతారు. కుటుంబసభ్యులతో సత్సంభందాలు కలిగి ఉండుట మీకు చాలావిషయాల్లో అనుకూలిస్తుంది. అధికారులతో కలిసి చర్చాసంభందమైన విషయాల్లో పాల్గొంటారు అదేవిధంగా వారినుండి ప్రశంశలు పొందుతారు. దూరప్రదేశ ప్రయాణాలు చేయాలనే మీ ఆలోచనలు కార్యరూపం దాల్చుటకు అవకాశం కలదు. వ్యాపారపరమైన విషయాల్లో మాత్రం మిశ్రమఫలితాలు పొందుతారు కావున అనుభవం కీలకమైన పాత్రను కలిగి ఉంటుంది. స్త్రీ సంభందమైన విషయాల్లో జాగ్రత్తలు అవసరం ఇబ్బందులు కలుగుతాయి.    

 

    

వృశ్చిక రాశి  : ఈవారం మొత్తంమీద చేపట్టు పనుల విషయంలో  అనుభవజ్ఞుల సూచనల మేర నడుచుకోండి. ఇష్టమైన వ్యక్తుల నుండి నూతన విషయాలను తెలుసుకొనే అవకాశం ఉంది. ధనమునకు సంభందించిన విషయాలలో మార్పులకు ఆస్కారం కలదు,అనవసరమైన ఖర్చులకు ఆస్కారం కలదు వాటిని అదుపులో ఉంచుకొనే ప్రయత్నం చేయుట సూచన. సంతానపరమైన విషయాలలో ఒత్తిడి ఉంటుంది బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది. మీరు గతకొంతకాలంగా ఎదురుచూస్తున్న ఫలితాలు రావడం అనేది కొంత ఊరట చెందు విషయం. వ్యాపారపరమైన విషయాల్లో నూతన ప్రయత్నాలు మొదలుపెడతారు ఫలితాలు కూడా కొంత ఆలోచించే విధంగా ఉండుట అనేది కొంత ఆలోచించాల్సిన విషయం. స్వల్పఅనారోగ్య సమస్యలు పొందుతారు తగిన జాగ్రత్తలు తీసుకోండి. 

 

 

ధనస్సు రాశి  :  ఈవారం మొత్తంమీద ఆశించిన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది నూతన ఆలోచనలు కలిగి ఉండి వాటికి సమయం ఇస్తారు. తలపెట్టిన పనులను కాస్త నిదానంగా పూర్తిచేసే అవకాశం ఉంది కాకపోతే ఫలితాలు మాత్రం ఆశించిన విధంగా రావడం అనేది ఊరట. ప్రయాణాలు చేయుటకు ఆస్కారం కలదు స్వల్పదూరప్రయాణాలు అనుకూలిస్తాయి. కుటుంబసభ్యులతో కలిసి చేసిన పనులు కార్యరూపం దాల్చుటకు అవకాశం కలదు. మీయొక్క మాటతీరు మిత్రులను అలాగే ఆప్తులను కొంత భాధకు గురిచేసే విధంగా ఉండే అవకాశం ఉంది కావున ఈ విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధను కలిగి ఉండుట మంచిది. వ్యతిరేకవర్గం విషయంలో నిదానంగా వ్యవహరించుట సూచన. అనవసరమైన విషయాలకు ధనంను ఖర్చు పెడతారు కావున ఖర్చులను అదుపులో ఉంచుకొనే ప్రయత్నం చేయుట మంచిది.  

 

మకర రాశి  :  ఈవారం మొత్తంమీద మీయొక్క మాటతీరును పరిశీలించుకోవడం వలన మేలుజరుగుతుంది నలుగురి సూచనలు పాటించుట ఉత్తమం. తలపెట్టిన పనులను విజయవంతంగా పూర్తిచేస్తారు కాకపోతే కాస్త ఊహించిన దానికన్నా అధికమైన శ్రమను పొందుతారు. వివాదాస్పదవ్యాఖ్యలకు దూరంగా ఉండుట సూచన. కొన్ని కొన్ని విషయాల్లో నిర్ణయాలు తీసుకొనే ముందు తడబాటు ఉండే అవకాశం కలదు ఈ విషయంలో అనుభవజ్ఞుల సూచనలు పాటించుట ఉత్తమం. ముఖ్యంగా ఆర్థికపరమైన విషయాల్లో మిశ్రమఫలితాలు పొందుతారు. ఉద్యోగంలో అధికారులతో సత్సంభందాలు కలిగి ఉండుట సూచన వారి సూచనలు అలాగే  అబిప్రాయాలను పరిగణలోకి తీసుకోవడం మేలు. నూతన ప్రయత్నాలు మొదలు పెట్టుటకు అవకాశం కలదు వాటికి సమయం ఇస్తారు.

 

 

 

కుంభ రాశి : ఈవారం మొత్తంమీద నలుగురిలో అవసరమయ్యే ఆలోచనలు చేయుట మీకు కలిసి వచ్చే ఆశం. ఉద్యోగంలో పనిఒత్తిడి ఉన్నను నలుగురిని కలుపుకోనివెళ్ళుట వలన అలాగే మీ మొఖంలో చిరునవ్వును కలిగి ఉండుట వలన చక్కటి సహకారాన్ని పొందగలుగుతారు. ఆరోగ్యపరమైన విషయాల్లో అదేవిధంగా భోజనం విషయంలో అశ్రద్ద వద్దు సమయపాలన తీసుకొనే జాగ్రత్తలు తీసుకోవడం ఉత్తమం. మీయొక్క ఆత్మీయుల నుండి సూచనలు పొందుతారు వాటి గురుంచి ఆలోచించుట మంచిది. ధనమునకు సంభందించిన విషయాల్లో ఖర్చులు కలిగినను నూతన ప్రయత్నాలు కలిసి వస్తాయి. సోదర సంభందమైన విషయాల్లో వారితో చర్చలు జరిగే సమయంలో వారియొక్క ఆలోచనలకు ప్రాధాన్యం ఇవ్వడం మీయొక్క నిర్ణయాలను స్పష్టంగా తెలియజేయడం వలన మేలుజరుగుతుంది.   

 

 

 

మీన రాశి :  ఈవారం మొత్తంమీద ఉద్యోగంలో మంచిపేరును సంపాదించుకుంటారు అలాగే తలపెట్టిన పనులను విజయవంతంగా పూర్తిచేస్తారు. ఆర్థికపరమైన విషయాలలో నూతన ప్రయత్నాలు కలిసి వస్తాయి ఆలాగే ఖర్చులు కూడా పెరుగుతాయి. కుటుంబసభ్యులతో కలిసి సమయాన్ని సరదాగా గడుపుతారు అదేవిధంగా విందుల్లో పాల్గొంటారు. సోదరసంభందమైన విషయాల్లో నూతన ప్రయత్నాలు మొదలుపెట్టుటకు అవకాశం ఉంది. మానసికంగా ఇబ్బందులు పొందుతారు దైవసంభందమైన పనులకు సమయం ఇవ్వడం సూచన. విదేశీప్రయత్నాలు కలిసి వస్తాయి మిత్రులతో కలిసి వ్యాపారపరమైన విషయాలకు సమయం ఇస్తారు నూతన పెట్టుబడులకు అవకాశం కలదు. వాహనముల విషయంలో నిదానంగా వ్యవహరించుట సూచన లేకపోతే చిన్న చిన్న ఇబ్బందులు తప్పక పోవచ్చును జాగ్రత్త. 

మరిన్ని శీర్షికలు
mprove Your Eye Sight |  | Dr. Murali Manohar M.D. (Ayurveda)