Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
sravana sri

ఈ సంచికలో >> శీర్షికలు >>

మన ఆరోగ్యం మన చేతుల్లో - అంబడిపూడి శ్యాంసుందర రావు

 

 యాపిల్ వల్ల అమోఘమైన ఉపయోగాలు
 

 

 
ప్రతివాళ్ళకు తెలిసినది అందరు చెప్పేది ప్రతి రోజు ఒక యాపిల్ తింటే అది డాక్టర్ ను దూరముగా ఉంచుతుంది అంటే యాపిల్ తినే వాళ్ళు జబ్బులకు దూరముగా ఉంటారని అర్ధము. మరి యాపిల్ జబ్బులను దూరముగా ఉంచి మన ఆరోగ్యాన్ని ఎలా కాపాడుతుందో తెలుసుకుందాము .

2004లో అమెరికాలోని పోషకాహార సంస్థ (USDA)దాదాపు వంద ఆహారపదార్ధాలు వాటిలోని యాంటీ ఆక్సిడెంట్ ల ఘాడతలను పరిశీలించారు వారు రెండు రకాల యాపిల్స్ 12 మరియు 13 స్థానాలలో నిలిచాయి. రోగాలను ఎదుర్కొనే  శక్తి కలిగిన ఈ యాంటీ ఆక్సిడెంట్లు సాదరణ కణ  కృత్యాలలో జరిగే నష్టాన్ని బాగుచేయటానికి ఉపయోగపడతాయి. ఇంతేకాకుండా యాపిల్స్ లో కరిగే పెక్టిన్  అనే పీచు పదార్ధము అధికముగా ఉంటుంది ఒక సాధారణ సైజు గల యాపిల్ లో సుమారు 4 గ్రాముల ఈ రకము పీచు ఉంటుంది .
వ్యాధులు రాకుండా కాపాడటానికి శరీర బరువు తగ్గటానికి యాపిల్ ఏవిధముగా సహాయ  పడుతుందో తెలుసుకుందాము.
యాపిల్ ను కొరకటము నమలటం వల్ల నోటిలోని లాలాజల గ్రంధులు యాక్టివేట్ అయి లాలాజలాన్ని ఎక్కువగా ఉత్పత్తి చేస్తాయి.ఫలితముగా నోటిలోని బ్యాక్ట్ రియా పరిమాణము తగ్గుతుంది

ఈ విధముగా యాపిల్  దంత సంరక్షణకు ఉపయోగపడుతుంది . సామాన్యముగా వయసు మీరిన పెద్దవారిలో అల్జీమర్స్ వ్యాధి లక్షణాలు కనిపిస్తాయి. ఎలుకల మీద చేసిన పరిశోధనల వల్ల యాపిల్ జ్యుస్ నిత్యమూ త్రాగుతూ ఉంటె అల్జీమర్స్ వ్యాధిని దూరముగా ఉంచుతుంది అని గుర్తించారు. యాపిల్స్ వయస్సు ప్రభావాన్ని మెదడు పై పడనివ్వదు. యాపిల్స్ ను ఆహారముగా తీసుకొన్న ఎలుకల లో న్యూరోట్రాన్స్ మీటర్  ఎసిటైల్ కోలైన్ నిల్వలు అధికమూగా ఉండటాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు ఎందుకంటేయాపిల్ లో ఉండే  క్యూర్ సెటైన్ అనే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ మెదడులోని కణాలను క్షీణించకుండా కాపాడుతుంది. యాపిల్ వల్ల ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలు పొందాలంటే యాపిల్ ను తొక్కతో సహా తినాలని శాస్త్రవేత్తలు సలహా ఇస్తారు .

పార్కిన్సన్ వ్యాధి రాకుండా నిరోధించటము లో యాపిల్ పాత్ర గురించి స్పష్టమైన ఆధారాలు లేకపోయినప్పటికి శాస్త్రవేత్తల ఉద్దేశ్యము ప్రకారము యాపిల్ లోని పెక్టిన్ అనే పీచు మెదడులోని కణాలు విచ్చినమవటానికి కారణమైనా డోపామైన్  ఉత్పత్తిని తగ్గిస్తుంది .
రోజుకు ఒక యాపిల్ చొప్పున తినే ఆడవారిలో టైప్ 2 డయాబిటీస్ వచ్చే అవకాశాలు  28% తక్కువ, అని శాస్త్రవేత్తలు కనుగొన్నారు .యాపిల్స్ లో ఉండే  పీచుజీర్ణక్రియను  జరిగేటట్లు చూసిరక్తములోకి గ్లూకోజ్ ప్రవేశాన్ని ఆలస్యము చేస్తుంది ఫలితముగా మధుమేహ వ్యాధి వచ్చే అవకాశాలు తక్కువ అవుతాయి . ఈ విషయాన్ని ప్రపంచ వ్యాప్తముగా అంగీకరించారు. యాపిల్ లోని పెక్టిన్ అనే పీచు LDL (చెడు) కొలెస్ట్రాల్  స్థాయిలను నియంత్రిస్తుంది ఈ పీచు శరీరములోని అనారోగ్య క్రొవ్వులను బంధించి ఇవి బయటకు పోవటానికి దోహదపడుతుంది. 

యాపిల్ తొక్కలో ఫెనోలోక్ అనే పదార్ధము కొలెస్ట్రాల్ ను ధమనులగోడలపై చేరనివ్వదు తొక్కలోని  ఫ్లేవనాయిడ్స్ యాంటీ ఆక్సిడెంట్లు గుండె జబ్బులు రాకుండా కాపాడుతాయ యాపిల్ లోని కరిగే పీచు కొలెస్ట్రాల్ ను రక్త నాలాల గోడలపై పేరుకోనివ్వదు . ఈ విధముగా యాపిల్ గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

జీర్ణ వ్యవస్థ  లోని  పిత్తాశయము (గాల్ బ్లాడర్)లో రాళ్లు ఏర్పడకుండా యాపిల్ కాపాడుతుంది. బైల్ జ్యుస్ లో అధికముగా ఉన్న కొలెస్ట్రాల్ రాళ్లు గా ఏర్పడే అవకాశము ఉంది .  యాపిల్ లోని  అధిక పీచు  ఈ విధమైన రాళ్లను  నివారించే మంచి మందు . యాపిల్స్ మలబద్దకము , విరేచనాలు వంటి జీర్ణ వ్యవస్థకు సంబంధించిన రుగ్మతలను తగ్గిస్తుంది. యాపిల్స్ లోని పీచు పురీషనాళము (కోలన్ )అధికముగా ఉన్న నీటిని తొలగించి సాఫీగా వ్యర్ధ పదార్ధాలు బయటకు   పోవటానికి తోడ్పడుతుంది ఈ విధముగా విరేచనాలను  నివారిస్తుంది. ఇదే పీచు మలము లోని నీటిని పీల్చిమలము సులభముగా బయటకు పోవటానికి సహాయపడుతుంది ఈ విధముగా మలబద్దకాన్ని నివారిస్తుంది . యాపిల్ లోని పీచు  ఇరిటబుల్ బవుల్ సిండ్రోమ్ ను తటస్తీకరించటంలో సహాయపడుతుంది .
శరీరము బరువు పెరగటము వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి గుండె జబ్బులు,అధిక రక్త పీడనం, టైప్ 2 డయాబిటీస్ లాంటి వ్యాధులు శరీరము బరువు పెరగటంవల్లే వస్తాయి శరీరము బరువును నియంత్రించటానికి పీచు అధికముగా కలిగిన యాపిల్  లాంటివి ఉపయోగిస్తాయి.

 యాపిల్ లోని పీచు కడుపు నిండినట్లు భావనను కలుగచేస్తుంది కానీ తక్కువ కెలోరీలను ఇస్తుంది వాషింగ్ టన్ , బ్రెజిల్ ప్రాంతాలలో నిర్వహించిన పరిశోధనలవల్ల శాస్త్రవేత్తలు , రోజుకు  తక్కువ కాకుండా యాపిల్స్ ను తిన్నవారు అధిక బరువును కోల్పోయారు అని గ్రహించారు కాబట్టి బరువు తగ్గాలనుకున్న వాళ్ళు చాకోలెట్లు పీజ్జాలు తినకుండా యాపిల్స్ తినండి బరువును తగ్గించుకోండి . మన శరీరములోని కాలేయము పని శరీరములోని విష లేదా హానికరమైన పదార్ధాలను తొలగించటము కాలేయము బాగా సమర్ధవంతముగా పనిచేయాలి అంటే దానిలో చేరిన హానికరమైన వ్యర్ధ పదార్ధాలను  తొలగించాలి ఈ పనిని పండ్లు కూరగాయలు చేస్తాయి అందులో యాపిల్ ఈ పనిని సమర్ధవంతముగా చేస్తుంది అని శాస్త్రవేత్తలు తెలిపారు అందువల్ల పండ్లు ముఖ్యముగా యాపిల్ తింటాము అలవాటు చేసుకొని పెద్దలు చెప్పినట్లుగా డాక్టర్ కు దూరముగా ఉండటానికి ప్రయత్నించి చూడండి 
మరిన్ని శీర్షికలు