Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
druva is comming

ఈ సంచికలో >> సినిమా >>

మహేష్‌ - మురుగదాస్‌ స్పీడ్‌ పెంచేశారు

mahesh speed increase

కొంచెం ఆలస్యంగా సినిమా ప్రారంభమయినా, ఆ ఆలస్యాన్ని తమ స్పీడ్‌తో కవర్‌ చేసేస్తున్నారు మహేష్‌, మురుగదాస్‌. వీరిద్దరి కాంబినేషన్‌లో పట్టాలెక్కిన సినిమా శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటోంది. ముందుగా హీరోయిన్‌ లేని సన్నివేశాల్ని చిత్రీకరించేశారు. తాజాగా సినిమా షూటింగ్‌కి హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ కూడా హాజరయ్యింది. దాంతో సినిమా షూటింగ్‌ వేగం ఇంకా పెరిగిందట. విలక్షణ చిత్రాలను తెరకెక్కించడంలో దర్శకుడు మురుగదాస్‌ ప్రత్యేకత వేరు. ఇంకెవరికీ సాధ్యం కాని సినిమాలు ఆయన్నుంచి వస్తుంటాయి. 'గజిని' సినిమాని తెరకెక్కించి, దేశవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు సంపాదించాడు మురుగదాస్‌. అలాంటి మురుగదాస్‌తో మహేష్‌ చేస్తున్న సినిమా పట్ల అంచనాలు ఎలా ఉంటాయో ఊహించుకోవడమే కష్టం.

మహేష్‌ కెరీర్‌లోనే భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న చిత్రమిది. ఇందులో మహేష్‌ అండర్‌ కవర్‌ 'కాప్‌'లా కనిపించనున్నాడని సమాచారమ్‌. ఏ సినిమా తీసినా సమాజానికి ఉపయోగపడే మంచి మెసేజ్‌ని ఖచ్చితంగా పొందుపరుస్తాడు మురుగదాస్‌. ఈ చిత్రంలో కూడా మహేష్‌ ద్వారా సొసైటీకి ఆయన మంచి మెసేజ్‌ ఇవ్వబోతున్నాడట. తెలుగుతోపాటు సైమల్‌టేనియస్‌గా తమిళంలోనూ ఈ చిత్రం విడుదల కానుంది. బాలీవుడ్‌లోకి రీమేక్‌ చేయాలనే ఆలోచన ఉండడంతో డబ్బింగ్‌ విషయంలో కొంత సందిగ్ధత ఉంది. తెలుగు సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌, ఆలిండియా గ్రేట్‌ డైరెక్టర్స్‌లో ఒకడైన మురుగదాస్‌ కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమా సృష్టించబోయే రికార్డుల కోసం వేచిచూడాలిక. 

మరిన్ని సినిమా కబుర్లు
what will be kings second room