Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
navvunaaluguyugalu

ఈ సంచికలో >> శీర్షికలు >>

కథాసమీక్షలు - .

 

కథ :  అత్యాశ!
రచయిత    :  చెన్నూరి సుదర్శన్
 సమీక్ష : ప్రతాప వెంకట సుబ్బారాయుడు
గోతెలుగు 155వ సంచిక!

పిల్లల కథలకు పెద్ద పీటవేస్తూ చిన్నరి లోకాన్ని గోతెలుగు అద్భుతంగా అలరిస్తోందని పాఠకులకు తెలిసిందే! 

తల్లిదండ్రులు అలవోకగా చెప్పే మాటల్ని పిల్లలు ఎలా గ్రహించి ఆచరిస్తారు? వాటివల్ల ఎదురయ్యే ఉపద్రవాలను బాలకథగా మలచడంలో మంచిమార్కులు సాధించారు చెన్నూరి సుదర్శన్!

కథాగమనాన్ననుసరిస్తే-


నాలుగుచోట్ల తిరుగుతూ బేరమాడగలిగితే తక్కువ ఖరీదుకు ఎక్కువ పండ్లను కొనుక్కోవచ్చని తండ్రి ఒకనాడు నిఖిల్ కు మార్కెట్లో చెప్పడంతో..అదే ప్రయోగాన్ని జామకాయలు కొనడంలో తాను చేసి, డబ్బు మిగుల్చుకుని, ఆ డబ్బుతో చాక్లెట్లు కొనుక్కోవచ్చని..ఒక్కొక్క జామకాయల బండీ దగ్గరకూ వెళ్లి బేరమాడుతూంటే అతణ్ని చూసి ముచ్చటపడిన రైతు..తోటలోకెళ్లి తన తండ్రిని కలిస్తే తక్కువ ఖరీదుకు కావలసినన్ని జామకాయలు తీసుకోవచ్చని చెప్పడంతో తోటకెళతాడు. అక్కడున్న తాత నిఖిల్ ను చూసి ముచ్చటపడి ‘నీకెన్ని కాయలు కావాలిస్తే, అన్ని తీసుకోవచ్చని’ చెప్పడంతో ఆశ..అత్యాశై..దురాశై..చివరికి నిఖిల్ కు దుఃఖాన్ని మిగులుస్తుంది. తండ్రి పశ్చాత్తాపానికి కారణమవుతుంది. 

కథ మొదట్నుంచి చివరివరకూ పట్టుతో సాగుతుంది. పిల్లల కథగా మలచినా ఇది పెద్దలకూ సందేశాత్మక కథే!

కథకు పాఠకుల నుంచి కామెంట్లు, లైక్ల రూపంలో బోలెడన్ని ‘భేష్’ లు వచ్చాయి. కథకి చక్కటి బొమ్మ అమరిందన్నది షరామామూలే!

కథ చెఱువులో ‘కలం’కమలాలు-

నడుం వయ్యారంగా తిప్పుతూ కాళ్ళకు నృత్య భంగిమలు అప్పగించాడు. 

కుడి చేతిలో వున్న చిన్న చేసంచిని విష్ణు చక్రంలా తిప్పాసాగాడు.

నీతి: అత్యాశ  అనర్థానికి మూలం.



ఈ కథను ఈ క్రింది లింక్ లో చదవచ్చు..... http://www.gotelugu.com/issue155/3969/telugu-stories/atyasa/ -

 

మరిన్ని శీర్షికలు
vrukshamulu  - jeeva samrakshakulu