Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
kathasameekshalu

ఈ సంచికలో >> శీర్షికలు >>

వృక్షములు - జీవ సంరక్షకులు - -హైమాశ్రీనివాస్

vrukshamulu  - jeeva samrakshakulu

అశ్వత్థ వృక్షము. రావిచెట్టు  

ఊర్ధ్వమూలమధశ్శాఖమ్ అశ్వత్థం ప్రాహురవ్యయమ్ !
ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేద స వేదనిత్ !!   


ఇది భగవద్గీతలోని 15వ అధ్యాయంలోని  శ్లోకం. రావిచెట్టును భగవంతుని ప్రతిరూపంగా భావిస్తారు హిందువులు, ఎందుకంటే భగవద్గీత లో శ్రీ కృష్ణ భగవా నుడు ' వృక్షలలో కెల్ల ప్రశస్తమైన అశ్వర్ధ వృక్షంబు అర్జునా నేను ' అని చెప్పారు.

ఆంగ్లంలో సేక్రేడ్ ఫిగ్ అనీ , పీపల్ అనీ, ఇంకా అశ్వత్థ వృక్షము అనీ, హిందీలో దీన్ని ‘పిప్లీ’ అనీ కూడా అంటారు.ఇది మర్రి జాతికి చెందిన ఒక వృక్షం. మన గ్రామప్రాంతల్లో వీధుల్లో , ఆలయాల ముందూ  రావి మొక్కల్ని నాటి, శ్రద్ధగా పెంచుతారు. హృదయాకారంలో దీని ఆకులు ఉంటాయి   . రావి ఆకులు లేతగా ఉన్నప్పుడు నున్నగా మెరుస్తూ, ఎర్రగా ఉంటాయి. ముదిరే కొద్దీ అవి ఆకుపచ్చగా మారుతాయి.
రావిచెట్టును ఎంతో పవిత్రంగా భావిస్తారు. దేవతలకు ప్రభువైన ఇంద్రుని వైభవానికి ప్రతిరూపంగా "అశ్వత్థం" అని ఈ రావిచెట్టును పురాణాలు వర్ణిస్తాయి.

రావి చెట్లు కొమ్మలతో ఆకులతో విస్తరించి  మానవులకు, జంతుజాలానికీ కూడా ఆరోగ్యకరమైన గాలిని అందించి మేలు చేస్తున్నాయి. పచ్చని నిండైన ఆకులతో గాలికి కదులుతూ, ఆక్సిజన్ వదులుతూ  ఈ రావి చెట్లు మనుషులకే కాక జంతువులకూ పక్షులకూ సైతం  తన నీడ లో సేద తీర్చు కోను కమ్మని నీడ నేకాక  పక్షులకు తనకొమ్మలపై గూళ్ళుకట్టుకుని నివసించనూ అవకాశం కల్పిస్తు న్నాయి.

రావి కొమ్మలు  చిత్రకారులు, శిల్పులు గ్రాఫిక్ డిజైన్స్  తయారుచేసేవారూ  శిల్పాలను చిత్రిం చనూ   ఉపయో గిస్తున్నారు. జీవితానికి ప్రతీకలుగా వినియోగిస్తున్నారు. యజ్ఞయాగాదులలో ఉప యోగించే పాత్రలను మునులు రావిచెక్కతో తయారుచేసేవారు. రావి ఆకులు, చిగుళ్ళను యజ్ఞా గ్ని లో వ్రేల్చడం ద్వారా దుష్టశక్తులను పారద్రోలవచ్చునని పండితుల ఉవాచ.

ఈ వృక్షఛాయలో దేవతలు విందులు వినోదాలు చేసుకునేవారని పురాణ కధలద్వారా తెలుస్తున్నది. దీని ద్వారా ఈ వృక్ష విశిష్టత  తెలుస్తున్నది. అడవుల్లో రావిచెట్టు కిందే మహర్షులు ఆత్మ సాక్షాత్కా రాన్ని పొందే వారని పురాణాలు చెబుతున్నాయి. యువరాజుగా ఉన్న సిద్ధార్థుడు , రావి వృక్షం క్రిందనే తప మాచరించి  మోక్ష మార్గాన్ని కనుగొని జ్ఞానోదయం పొంది బుద్ధునిగా పిలువబడ్డాడు.దాంతో  దీనికి  అశ్వత్థ వృక్షం మనే పేరు రావటమేకాక  బౌద్ధంలో కూడా ఈ వృక్షానికి పవిత్ర స్థానం ఉంది.బౌధ్ధులకు ఇది పవిత్ర వృక్షంగా మారి ‘బోధి వృక్షం’ గా పిలువబడసాగింది.     ఈ రావి వృక్షం హిందువులకేకాక , ఇటు బౌద్ధులకు, అటు జైనులకు పవిత్ర వృక్షం. ఈ వృక్షం దేవతల నివాస స్థానమని కూడా అంటారు.అశ్వత్థ వృక్షం వందలాది సంవత్సరాలు జీవిస్తుంది. ఇది సంపూర్ణ జీవి తానికి కావల్సిన శక్తిని అంది స్తుంది. దీనికి అలౌకిక శక్తులున్నాయని హిందు వుల విశ్వాసం.

ఈ చెట్టు ఫలాలలకు దివ్య ఔషధ గుణాలు న్నాయి.సంతానం కోరే దంపతులు ఈ మానుకు తెలుపు, ఎరుపు, పసుపు దారాలు చుట్టి ప్రార్థనలు చేస్తుంటారు.అలా దీనిచుట్టూ తిరిగిఈ గాలి పీల్చ డం ద్వారా గర్భకోశ సం బంధిత వ్యాధులు నయమై సంతానప్రాప్తికలుగుతుందనీ చెప్పవచ్చు.

వినాయక చతుర్ధి రోజు చేసుకునే వరసిద్ధివినాయక వ్రతంలో ఏకవింశతి పత్రి పూజా క్రమములో ఈ రావి ఆకు 19 వది.‘ఓం వినాయకాయ నమః అశ్వత్ధపత్రం పూజయామి ‘అంటూ ఈ పత్రిని వినాయక స్వామికి అర్పిస్తాం. రావిచెట్టుని పూజిస్తే లక్ష్మీకటాక్షం లభ్య మవుతుందని నమ్మిక. దీనికి అద్భుతమైన ఔషధ గుణాలు న్నాయి.

రావి మండలను ఎండబెట్టి ఎండిన పుల్లలను నేతితో కాల్చి భస్మం చేసి ఆ భస్మాన్ని తేనెతో కలిపి రోజూ సేవిస్తే శ్వాసకోశ వ్యాధులు నయమవుతాయి. పక్షులు రావి పండ్లుతిని విసర్జించ డం ద్వారా గోడల చీలి కల్లో కూడా ఇది పెరుగుతుంది. పద్మపురాణం ఆధారంగా రావిచెట్టు విష్ణుస్వరూపం అని తెలుస్తున్నది. తైత్తరీయ సంహిత రావిచెట్టును అతిపవిత్రమైన చెట్టుగా చెప్పుతుంది. బ్రహ్మవైవర్తపురాణంలో కూడా రావిచెట్టు ప్రస్తావన ఉంది.   రావిచెట్టు మొదట్లో విష్ణువు, బోదెఅంటే ట్రంక్ లో కేశవుడు, కొమ్మల్లో నారా యణుడు, ఆకుల్లో హరి, పండ్లలో అచ్యుతుడు ఉంటారని పురాణాల ద్వారా తెలుస్తోంది. రావిచెట్టు నుంచి ప్రసరించే గాలి వాతావరణ కాలుష్యా న్ని పారద్రోలుతుంది. రావి చెట్టు మొదట్లో నీళ్ళు పోసి, చెట్టు చుట్టుతా ప్రదక్షణం చేసి నమస్కరించడంల్ల భగ వంతుని సేవించిన పుణ్యంలభిస్తుంది. ఆయష్షు పెరుగు తుంది. పాపాలన్నీ తొలగిపోతాయి.స్వర్గలోక ప్రాప్తి, మోక్షం కలుగు తుందనీ నమ్మిక. రావిచెట్టు భగవంతు డుండే చోటే కాక పితృదేవతల నివాసంగా కూడా.

రావిచెట్టును శనిపరిహారం చేసే వృక్షంగా కూడా నమ్ముతారు. ఈ చెట్టు చుట్టుతా శని వారంనాడు తొమ్మిది కాని, పదకొండు కానీ ప్రదిక్షణలు చేసిన వారికి శని ప్రభావం కొంత తగ్గుతుందన్న భావన . అది ఎందు కంటే అశ్వత్ధ వృక్షం  గురించీ ఒక కధ పురాణాల ఆధారంగా  తెలుస్తున్నది. అశ్వత్ధ , పీపాల అనే ఇద్దరు రాక్షస సోదరులు ఉండేవారు. వారు ప్రజలను అనేక విధాలుగా వేధించేవారు. అశ్వత్ధుడు చెట్టురూపంలో కి మారితే , పీపాలుడు బ్రాహ్మణ రూపంలో దారినపోయే వారిని పిలుస్తూ “ ఈపవిత్రమైన చెట్టును స్పర్శించి పుణ్యం పొం దండి “అని ఎంతో నమ్మకంగా చెప్పగానే జనం ఆమాయమాటలు నమ్మి  చెట్టుక్రిందకెళ్ళి చెట్టుమానును తాక గానే అశ్వత్ధుడు తన నిజరూపం దాల్చి ఆమనుషులను తినేసేవాడు.ఇలా ప్రజలను వేధిస్తూ సంహరిస్తున్న ఆరాక్షసులను శనేశ్వరస్వామి వచ్చి సంహరించి జనులకు రక్షణ కల్పించాడుట. ఆరాక్షస జంట సంహారం శని వారం జరిగినందున ప్రజలు రావిచెట్టును తాకి శనివారం నాడు పూజించి శనిదేవుని కృపకు పాత్రులవు తుం టారు.ఐతే ఆరాక్షసునికి గుర్తుగా దీనికి అశ్వత్ధ వృక్షమనే పేరు వచ్చింది.

ఆకులు కిందికి వేళ్ళాడుతూ కొద్దిపాటి గాలికి కూడా అటూ ఇటూ కదులుతూ సన్నని శబ్దం చేస్తాయి. ఆకుల కుండే ఈ ప్రత్యేకమైన కదలికల కారణంగానే రావి చెట్టుకి సంస్కృతంలో ‘చలపత్ర వృక్షమ్’ అనే పేరుకూడా ఏర్పడింది. ఆకులు – ముఖ్యంగా ఎండిన చొక్కాకులు అంటే ఎండిన ఆకులు  చటచటమంటూ చేసే ఈ మర్మర ధ్వని  రావి చెట్టుకు మాత్రమే ప్రత్యేకం. రోజంతా కాయకష్టం చేసిన కర్షకులు సాయం సమయాల్లో రావి చెట్ల కింద పడుకుని ఈ మర్మర ధ్వని జోలపాడగా, ఆదమరచి నిదురించడం మనం పల్లె ప్రాంతల్లో చూడవచ్చు. రావి ఆకుల కదలిక ఒకరకమైన జోలపాటవలే కమ్మగా ఉండటాన రావి చెట్టుక్రింద అలసిన వారు విశ్రమిస్తే మంచి నిద్రపట్టి సేదతీరుతారు.   ఉపనయన సమయంలో రావిమండ భుజంపై ఉంచుకుని భటువు భిక్షకు బయల్దేరుతాడు.

రవి అంటే సూర్యుడు జీవరాసు లన్నింటికీ ప్రాణశక్తి. సూర్యుని కిరణాలలో మానవాళిని కాపాడే మహోన్నత జీవ శక్తి ఎలా దాగి వుంటుందో అలాగే  రవికి ప్రతిరూపంగా భూమిపై ఆవి ర్భవించిన రావిచెట్టులో అదేశక్తి నిండి వుంటుందని నమ్మకం .ఇది రా త్రింబవళ్ళు ఒకవైపు నుండి మానవు లు జంతువులు మొదలైన జీవులు విడిచిపెట్టే బొగ్గు పులుసు వాయువు అనే కార్భన్ డయాక్సైడ్ ను స్వీకరించి  ఆహారంగా తయారు చేసుకుంటూ   జీవ కోటి కంతా ప్రాణవాయువును నిరంతరం అందిస్తూ వుంటుంది.అందువల్లఈ చెట్టును సూర్యాత్మ అని, దైవాత్మ అని ,దైవ భవనం అని ,అశ్వత్ఠవృక్షము అని బోధివృక్షము అని ,జ్ణాన వృక్షము అని  ,ధర్మ వృక్షము అని ,సంతాన వృక్షము అని ఇలా అనేక రకాల  పేర్లతో గౌరవిస్తారు. రావి కాయలు పండే కొద్దీ ఎర్రగా రక్తవర్ణానికి మారి ఎర్రగా ఆకర్షణీయంగా, రుచిగా ఉండ టాన ఈ రావి పళ్ళు చూసి పక్షుల్ని బాగా ఆక ర్షిం పబడి ఈపళ్ళను  తిని, రావి  విత్తులను మాత్రం జీర్ణం చేసుకోలేక యథాతథంగా విసస్తా యి.

అలా పక్షుల రెట్టల ద్వారా విత్తన వ్యాప్తి జరిగి, తగిన తేమ లభించ గానే అవి మొలకెత్తడం వల్ల రావిచెట్టు పునరుత్పత్తి చేసుకుంటుంది. రావి చెట్టును’అవ్యయ వృక్షం’ అనికూడా అంటారు.ఇక్కడ ‘అవ్యయ వృక్షం’ అంటే అసలు నశించని దని కాక, మిగిలిన సామాన్య వృక్షాలతో పోల్చు కుంటే చాలా దీర్ఘకాలం జీవించే వృక్షం అంటారు

కరవు రోజుల్లో రావి కాయల్నీ, లేత చిగురుటాకుల్నీ ప్రజలు తినేవారట!. రావి ఆకులు చాలా బలవర్ధకమైన ఆహారం. వీటిలో 14 శాతం వరకూ ప్రోటీన్లు (మాంసకృత్తులు)ఉన్నాయి. రావి ఆకుల్లో గడ్డిజాతి మేతలలో కంటే మూడురెట్లు ఎక్కువ మాంసకృత్తులు ఉన్నాయి. పశువులకు, ప్రత్యేకించి ఏనుగులకు రావి ఆకులు అతి ఇష్టమైన మేత. నైట్రోజెన్, కాల్షియం, ఫాస్ఫరస్ అధికంగా ఉన్న కారణంగా గొర్రెలకు, మేకలకూ, పశు వులకు రావి ఆకులు అత్యంత శ్రేష్ఠమైన మేతగా శాస్త్ర పరిశోధకులు నిర్ధారించారు. రావిచెట్టు కాండం నుంచి స్రవించే జిగురును రబ్బర్ టైర్లకు పంక్చర్లు వేసేందుకు ఉపయోగిస్తారు. గట్టిపడిన ఈ జిగురును సీలింగ్ వాక్స్ గానూ ఉపయోగిస్తారు. ఈ స్రావం బాగా జిగురుగా ఉండే కారణంగా, చెట్ల కొమ్మలకు రాసి పిట్టల్ని పట్టుకునే బర్డ్ లైమ్ గా కూడా ఈ జిగురును ఉపయోగిస్తారు. రావి కలప అంతగా శ్రేష్ఠమైనది కాదు. దానిని ప్యాకింగు బాక్సులు, అగ్గి పెట్టెల తయారీలో మాత్రం ఉపయోగిస్తారు. బండి చక్రాల, కొయ్య గిన్నెల, స్పూన్ల తయారీ లోనూ రావి కలపను వినియోగిస్తారు. రావి చెట్ల మీద షెల్లాక్ కీటకం  పెరుగుతుంది. ఈ కీటకం ఉత్పత్తిచేసే రెసిన్ నే షెల్లాక్ అంటారు. షెల్లాక్ విద్యుత్ పరిశ్రమలలో ఇన్సులేటర్ గానూ, సీలింగు మైనం, డ్రాయింగు ఇంకులు, వాటర్ కలర్స్ మొదలైన వాటి తయారీలోనూ వాడతారు.
రావిచెట్టు కాండం పై బెరడు కషాయం కడుపులోని అల్సర్లు, చర్మరోగాలకు మంచి మందు. ఈ కషాయం పొట్టలోని క్రిముల్ని కూడా నశింపజేస్తుంది.. లేత రావి ఆకుల పసరు చర్మరోగాలకు పైపూతగా వాడతారు. లేత ఆకుల్ని మెత్తగా నూరి, గోధుమ పిండి లేక సిందూరంతో కలిపి రాస్తే వాపులూ, చర్మం పగుళ్ళూ నయమౌతాయి.

రావి చెట్టు ఆకుల్లోని విద్దుదయస్కాంత  శక్తి  ప్రదక్షణసమయం లో స్త్రీ గర్భం లోకీ ప్రవేస్తుంది. రావి చెట్టు కు ప్రదక్షణం చేయటం ద్వారా సంతానోత్పత్తికి దోహదం చేసే శక్తీ స్త్రీ అండం లోకి ప్రవేసేస్తుంది .ఈ శాస్త్రీయ అంశా న్నీ మన ఋషులు గ్రహించారు .పర్యావరన పరిరక్షణ , చెట్లను పూజించడం అనే ప్రక్రియ ద్వారా అనాదిగా భారతీయుల ఆచారం గా వస్తున్నది. చెట్లలో భగవంతుని చూడటం మన సంప్రదాయం .ఎందు కంటే చెట్ల వల్లనే ప్రాణికోటి ప్రాణ వాయువును పొంది జీవిస్తున్నది అలా చెట్లు మనకు ప్రాణదాతలు. 

మరిన్ని శీర్షికలు
sahiteevanam