Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
jyo achyutananda movie ready to release

ఈ సంచికలో >> సినిమా >>

విక్టరీ వెంకటేష్‌ జోరు పెంచేశాడు

venkatesh speed increase

వెంకటేష్‌ 'బాబు బంగారం' సినిమా సక్సెస్‌ఫుల్‌గా ధియేటర్లో సందడి చేస్తోంది. ఈ లోగా వెంకీ చాలా కథలే లైన్‌లో పెట్టేశాడు. ఒకే తరహా కథలనే కాకుండా డిఫరెంట్‌ డిఫరెంట్‌ స్టోరీలను ఓకే చేశాడు వెంకీ. వాటిలో ప్రయోగాత్మక ప్రాజెక్టులు కూడా ఉన్నాయి. 'బాబు బంగారం' సినిమా తర్వాత బాలీవుడ్‌ రీమేక్‌ 'సాలా ఖదూస్‌' చిత్రంలో నటిస్తున్నాడు వెంకటేష్‌. ఫ్యామిలీ హీరోగా పేరు తెచ్చుకున్న వెంకటేష్‌కి ఈ చిత్రం ఒక సవాల్‌ అనే చెప్పొచ్చు. ఈ చిత్రంలో వెంకీ బాక్సింగ్‌ కోచ్‌ పాత్రలో నటిస్తున్నాడు వెంకీ. సూపర్బ్‌ యాక్షన్‌ సన్నివేశాల్లో నటించనున్నాడట వెంకీ ఈ సినిమాలో. ఇది కాక రానాతో కలిసి మల్టీస్టారర్‌ మూవీలో నటించనున్నాడని సమాచారమ్‌. ఫ్యామిలీ ఎంటర్‌టైనింగ్‌తో ఆకట్టుకునే వెంకటేష్‌ హారర్‌ మూవీలో కూడా నటించడానికి రెడీగా ఉన్నాడట.

అది కూడా ఓంకార్‌ డైరెక్షన్‌లో వచ్చి, చిన్న సినిమాల్లో పెద్ద సినిమాగా హిట్‌ కొట్టేసిన హారర్‌ మూవీ 'రాజుగారి గది'కి సీక్వెల్‌లో వెంకటేష్‌ హీరోగా నటిస్తాడని వినికిడి. ఇదే కాక 'దృశ్యం' సినిమాకి సీక్వెల్‌ ప్లాన్‌ చేస్తున్నట్లు సమాచారమ్‌. ఈ సినిమాకి 'నేను శైలజ' డైరెక్టర్‌ కిషోర్‌ తిరుమల డైరెక్షన్‌ చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఇలా వెంకీ చేతిలో ఇప్పుడు నాలుగైదు సినిమాల వరకూ రెడీగా ఉన్నాయి. 'గోపాల గోపాల' సినిమా తర్వాత కొంచెం గ్యాప్‌ తీసుకున్న వెంకీ ఇప్పుడు జోరు పెంచాడు. ఏడాదికి ఒకటి కన్నా ఎక్కువ సినిమాలు వెంకీ నుండి వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

మరిన్ని సినిమా కబుర్లు
cheppukondi chooddam