Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
kathasameekshalu

ఈ సంచికలో >> శీర్షికలు >>

మర్రిచెట్టుకి ఏమేం మహిమలున్నాయో చూడండి... - ..

mahima gala marrichettu

మర్రిచెట్టుకి ఏమేం మహిమలున్నాయో చూడండి...

సర్వ లోకాలకూ గురువైన  జ్ఞాన స్వరూపుడైన గురు దక్షిణామూర్తి నివాసం మర్రి వృక్ష ఛాయలో నేట!. భగవంతునికి ఆది మధ్య అంతం లేవుకదా!  అలాగే , మైళ్ళకొద్దీ వ్యాపించిన మర్రిచెట్టుకు కూడా మొదలు, చివర  మధ్య ఎక్కడో కనుక్కోలేము దీని కొమ్మలు, ఊడలు క్రిందికిదిగి పెద్దకొమ్మలుగా, మొదళ్ళుగా మారి పోయి మహావృక్షంగాఉండటాన దీని ఆదిమధ్యాలు తెలుసుకోడం కష్టం. మహా విష్ణువు బాలకృష్ణుడు  వటపత్ర సాయి గా  మర్రి ఆకు మీద పవళించినట్లు మనకు తెల్సు.

మర్రివృక్ష భాగాలు సంపూ ర్ణంగా ,పచ్చి గా, ఎండినవి లేక ,పండ్లు గాని అపారమైన ఔషధ లుకలిగి ఉన్నాయి. దీనివల్ల  ఈ చెట్లను ఎంతోమంది భక్తజనం సంచరించే ఆలయాల్లో పెంచాలని పండితులు చెప్తారు.

మర్రి ని ఆంగ్లంలో బానియన్ ట్రీ అంటారు. ఇది ఫైకస్ జాతికి చెందిన ఒక చెట్టు. ఇది బాగా పెద్దగా విస్త రించిన కొమ్మలతో వాటికి దీటైన  ఊడలతో పెరిగే అతిపెద్ద వృక్షం. అందుకే దీన్నీ వటవృక్షం అంటారు. ఇది బంగ్లాదేశ్,భారతదేశం, శ్రీలంక దేశాలలో విరివిగా పెరుగుతుంది.
ఈ చెట్ల విస్తరణ చాలా చిత్రంగా పక్షుల ద్వారా జరుగుతుంది.లక్షులనోటికి కమ్మగా ఉండటమో ఏమో దీని పండ్లను భుజించి వేరే దూర ప్రాంతల్లో గింజలను విసర్జించడం ద్వారా ఈ చెట్ల సంతతి విస్తరిస్తుం టుంది.   వేరే చెట్టు పగుళ్ళలో  ,గోడలమీదా, పెద్ద భవనాలు, భవంతులమీదా ,వంతెనలసందుల్లోనూ , రాళ్ళ సందు ల్లోనూ ఈ పక్షులు విసర్జనాలలోని గింజలు పడి తగు సమయం రాగానే మొక్కలు మొలిచి చిగురించి కాల క్రమాన విస్తరి స్తాయి. ఇలా "మర్రి" చెట్టు విత్తనాలు ఈ పళ్లు తినే పక్షుల చేత ఇతర ప్రదేశాలకు విస్తరించ బడతాయి. వేరే చెట్టుమీద పడి, దాని పగుళ్ళలో మొలకెత్తిన మొక్కల వేళ్లు క్రమంగా భూమికి ప్రాకు తాయి. కొమ్మలు ఆకాశంవైపు విస్తరిస్తాయి. పండిన మర్రిపండ్లు తిని కాకులు ఎంతోకాలం  ఆయువు తో  వర్ధిల్లుతాయి. 

భారతదేశంలో "బనియాలు అంటే'వణికులు' లేదా 'వ్యాపారులు' తమ ప్రయాణాలలో బండ్లమీదా, గుఱ్ఱా లమీదా , కొందరుకాలినడకనా వ్యాపారాలమీద ఇతరప్రాంతాలకు వెళుతూ తరచూ ఈ చెట్ల నీడలో విశ్రాంతి తీసుకొనేవారని విదేశీ పరిశీలకులు గమనించినందువల్ల, వారు ఈ చెట్టును దీనికి "బనియన్ ట్రీ" అనే వారు ,కాలక్రమంలో ఈపేరు బానియన్ ట్రీగా మారింది. 

త్రిమూర్తులు మర్రిచెట్టు మీద ఉంటారని హిందువుల నమ్మకం. మహా విష్ణువు స్వరూపం అయిన మర్రి చెట్టు ఆకులతో అన్నం తింటే, క్రిమిరోగ నివారిణిగా పనిచేస్తుంది. కంటికి సంబంధించిన దోషాలను తొలగి స్తుంది.మర్రిచెట్టునీడ ఏసీని తలపిస్తుంది. ఎంతమందికైనా నీడనిచ్చి హాయినందించే మర్రి చెట్టు , కొమ్మలు ఎన్నో పక్షులకు గూళ్ళుకట్టుకుని నివసించే అవకాశాని అందించి అమ్మలా ఆదుకుంటుంది. 

మర్రిచెట్టు  క్రింద చిక్కని నీడ ఉంటుందికనుక ఏచెట్టూ మొలవదు. అందుకే ‘మర్రి చెట్టుక్రింద మొక్క మొల వదు’అనే సామెత వచ్చింది,దీన్ని బలవంతులున్నచోట చిన్నవారికి అవకాశం రాదనే అర్ధంలోవాడు తారు.  

మర్రిని చెట్టు వివిధభాగాలను ఆయుర్వేదం లో మందుగా వాడుతారు. దీని బెరడు, లేత ఆకులు, మొగ్గలు, పాలు, పళ్ళు అన్నిటినీ ఆయుర్వేదంలో ఎన్నో వ్యాధుల్లో మందుగా వడి నయం చేసినట్లు దాఖలాలు న్నాయి  ముఖ్యంగా చర్మ సౌందర్యం కోసం మర్రి ఉపకరిస్తుంది.  

శ్రీరాముడు వనవాసానికిబయల్దేరేప్పుడు మర్రి పాలు  జుట్టుకురచుకుని జుట్టును మౌనిలా అట్ట కట్టించు కున్నాడు . మర్రి చెట్టు ఆకులు ఇంకా విచ్చుకోక చివుళ్ళుగా ఉన్నపుడు ముందు ఎర్రగా మొగ్గల్లా ఉంటా యి. వాటిని రాత్రంతా నీటిలో నాన బెట్టి ఉదయాన్నే ఆ నీటిని త్రాగితే తరచు విరేచనాలతో బాధపడేవారికి ఉపసమనం కలుగు తుంది.  మర్రిపాలు 5 చుక్కల్ని 1 గ్లాసుడు పాలలో కలిపి త్రాగితే బ్లీడింగ్ పైల్స్ కి మంచి మందుగా పనిచే స్తుం ది. ఇక ఊడల నుంచి జాలువారే లేత వేళ్ళు స్త్రీల సంతాన సాఫల్యతను పెంచుతాయి. మర్రి వేళ్ళను  ఎండించి, దంచి, పొడి  చేసి పాలలో కలిపి ఋతుస్నానం అయిన తర్వాత వరుసగా 3 రాత్రు ల పాటు తాగితే సంతానం కలుగుతుందని ఆయుర్వేదం ఖచ్చితంగా చెప్తుంది. మర్రి ఊడలతో పళ్ళు తోము కుంటే దంత సమస్యలు రావు. మర్రి పాలు కీళ్ళ నొప్పులున్న చోట రాస్తే నొప్పులు తగ్గు తాయి. గిరిజ నులు ఇలా వైద్యం చేసుకుని వ్యా ధులను నయం చేసుకుంటారు.మర్రి ఆకులు కోయగా వచ్చిన పాల ను పులిపిర్లమీద  ఉంచితే అవి తగ్గిపోతాయి. పాదాలు పగిలిపోతే మర్రి చెట్టు కాండం నుంచి వచ్చిన రసాన్ని ఆ పగుళ్ళకి రోజూ రాస్తే ఉపసమనం కలుగుతుంది. 

మర్రి ఆకులు కోయగా వచ్చిన పాలను పులిపిరులమీద ఉంచితే అవి తగ్గిపోతాయి. పాదాలు పగిలిపోతే మర్రి చెట్టు కాండం నుంచి వచ్చిన రసాన్ని ఆ పగుళ్ళకి రోజూ రాస్తే ఉపయోగం ఉంటుంది. మర్రిపండ్లలోని విత్తనాలు  కంటి నలుసంత  చిన్న గింజలు, వాటి నుండి మరణమేలేనట్లూ పెరిగే వట వృక్షమైన  మర్రి వృక్షం పుడుతు న్నదంటే సృష్టి రహస్యం వింతగా అనిపిస్తుందికదా! ఆ విత్తనంతో మొలిచి పెరిగే మర్రి వృక్షం  కాండం వ్యాసం 3 మీటర్ల వరకు ఉంటుంది. 

మర్రి చెట్టును గురించి ఒక చిన్న కధ కూడా ఉంది. ఒక నవనాగరిక యువకుడు ఒక మారు తన తాతగారి పల్లెటూరికి సెలవుల్లో వస్తూ బస్ దిగి నడుచుకుంటూ ఊర్లోకి రావడంలో కూరపాదులు పెంచే తోటల పక్క నుంచీ వస్తుండగా అతడికి పెద్ద గుమ్మడి పండ్లను రైతులు గుమ్మడి తీగలనుంచీ కోసి బస్తాల్లో ఉంచి బండ్ల కెక్కించడం చూస్తాడు.ఇంతపెద్ద కాయలు అంతచిన్న పాదుకు కాయడం చిత్రం అనిపిస్తుంది అతడికి.  ఆ తర్వాత ఎండ ఎక్కువగా ఉండటాన దార్లోఉన్న వట వృక్షం అంటే మర్రి చెట్టు క్రింద కాస్తసేపు విశ్రమిస్తాడు. పైచూస్తూ పడుకున్న అతడికి ఎర్ర్గా పండిన మర్రికాయలు కనిపిస్తాయి, ధృఢంగా పెద్ద కొమలతో బలంగా ఉన్న మరి చెట్టుకు ఇంతచిన్న ద్రాక్షపండ్లంత కాయలూ, నేలమీద పారాడే సన్నగా ఉండే పదుకు అంత పెద్ద గుమ్మ డి  పండ్లూ  వీటిని సృష్టించిన బ్రహ్మకు నిజంగా తెలివుందా!పాపం ముసలడైపోయి ఉంటాడు, అందుకే ఈ తిక మక ' అనుకుంటూ నిద్రలోకి జారుకుంటాడు.నిద్రలేచేసరికి తన వంటిమిదంతా మర్రిపండ్లు రాలి ఉండటం చూసుకుంటాడు.

అంతకు ముందు బ్రహ్మ సృష్టి గురించీ వచ్చిన తన ఆలోచన గుర్తొచ్చి గాభరాపడతాడు. నిజంగా గుమ్మడి పండ్లు ఈమర్రి చెట్టుకు కాస్తే తనక్రింద విశ్రమించే మనుషులేకాక జంతుజాలాలు సైతం ఇలా పండ్లు రాలితె ఐహ బ్రతకడ మన్ని ఉండదుకదా! అనుకుని లెంపలేసుకుని వెళ్ళాడుట. పెద్ద చెట్టుకు చిన్న కాయలు భగవంతుడు ఎందుకు సృష్టించాడో స్పష్ట మవుతున్నది కదా!
మర్రి  వృక్షాన్ని గిచ్చితే పాలుకారుతాయి.దీనికొమ్మలనుండీ ఊడలు వచ్చి భూమిని తాకగానే వేళ్ళు తన్ని బోదెలా అవుతాయి. కొత్త కొమ్మలు వస్తాయి.అందువల్లే ఏది చెట్టో ఏది ఊడో తెలీదు. ఇలా పెరిగిపెరిగీ కొన్ని హెక్టార్లభూమిని ఆక్రమిస్తాయి.వీటి పండ్లు గుండ్రంగా పెద్ద ద్రాక్షల్లా ఎర్రగా ఉంటాయి. మర్రికాయలు ఏప్రిల్ సెప్టెంబర్ మాసాల్లో కాస్తాయి.మర్రిని మాను బెరడు రక్త పిత్తాలను హరిస్తాయి. అనేక వ్యాధులతోపాటుగా నోటి పూతనూ తగ్గిస్తాయి.ఆయుర్వేద , సిధ్ధ, యునానీ వైద్యాలలో మర్రి చెట్టు వివిధ భాగాలను వాడు తారు. మర్రి  విత్తనాలు పక్షుల వలన వివిధప్రాతాల్లో పడ్డప్పుడు కొన్నిమార్లు ఇళ్ళ మీదనే కాక తాటి వంటి చెట్లమీదకూడా పెరిగిపరాన్న జీవులవలె ఆధారపడి పెద్దవిగా పెరిగి వాటిని ఆక్రమించడంకూడా కద్దు. ‘ఎంత చెట్టుకు అంత గాలి ‘అంటామా! మర్రి చెట్టు ఎంతగాలి వచ్చిన తనక్రింద ఉన్న వారికి మాత్రం తనవిస్తరించిన కొమ్మలక్రింద కమ్మని ఆశ్రయం ఇస్తుంది. వట వృక్షానికి మనః పూర్వకంగా నమస్కరిద్దాం.    

 

-హైమాశ్రీనివాస్ .                                                        .                                

మరిన్ని శీర్షికలు
sahiteevanam