Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Capsicum Masala

ఈ సంచికలో >> శీర్షికలు >>

సిరాశ్రీ ప్రశ్న - సిరాశ్రీ

 

1. రాజకీయ నాయకులు అవినీతిపరులు. వచ్చే జీతంతో బతక్క లాబీయింగులు చేసో, లంచాలు పుచ్చుకునో ఆస్తులు పెంచుకుంటారు. ప్రజాసేవ పేరుతో కోట్లు వెనకేసుకుంటారు. అలా కాకుండా నిస్వార్థంగా సేవ చేస్తే ప్రజలు వాళ్లని దైవంలా చూస్తారు. అప్పుడే మన దేశం పురోగతి చెందుతుంది. రాజకీయనాయకులు పై సంపాదనల మీద దృష్టి పెట్టకూడదు. 

 

2. జీతంతో బతికే రాజకీయ నాయకులు పదవి లేనప్పుడు ఎలా బతుకుతారు? డబ్బు లేదంటే వాళ్లకి కేడర్ ఎలా పెరుగుతుంది? దగ్గర పనిచేసే డ్రైవర్లకి, పనివాళ్లకి కూడా లోకువైపోరు? సంపాదన మీద ఆసక్తి ప్రజలకే తప్ప నాయకులకి ఉండకూడదంటే ఎలా? డబ్బులేని నాయకుడంటే జనానికి క్రేజ్ ఉంటుందా? డబ్బులేని నాయకుడ్ని చూసి డబ్బున్న జనం భయపడతారా? డబ్బున్న నాయకుడికే పరిపాలన అనే కళ్ళెం చేతిలో ఉంటుంది. కనుక రాజకీయ నాయకులు పదికాలాల పాటు రాజకీయంలో ఉండాలంటే పై సంపాదన ఉండి తీరాలి. 

 

పై రెండిట్లో ఏది కరెక్ట్?

..

మరిన్ని శీర్షికలు
weekly horoscope 9th september to 15th september