Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
mega ricords hangama started

ఈ సంచికలో >> సినిమా >>

'పెళ్ళి కబురు' చెప్పేసిన అక్కినేని

akkineni nag anounced nag marriage...

ఒకే ఒక్క సినిమాతో పెళ్ళి కబురు చెప్పేస్తున్నాడు అక్కినేని సిసింద్రీ అఖిల్‌. హీరోగా చేసింది ఒక్క సినిమానే అయినా, బాల నటుడిగా 'సిసింద్రీ' సినిమా కూడా అతని ఖాతాలోనే ఉంది. అదే కాకుండా 'మనం', 'ఆటాడుకుందాం రా' సినిమాల్లోని గెస్ట్‌ రోల్స్‌ని కూడా కౌంట్‌ చెయ్యాలేమో. డిసెంబర్‌ 9న అక్కినేని అఖిల్‌ నిశ్చితార్థం, అతని గర్ల్‌ఫ్రెండ్‌ శ్రియా భూపాల్‌తో హైద్రాబాద్‌లో అంగరంగ వైభవంగా జరగనుంది. కుమారుడి నిశ్చితార్థం తేదీని స్వయంగా అక్కినేని నాగార్జున ప్రకటించారు. అలాగే, పెద్ద కుమారుడు నాగచైతన్య వివాహంపైనా క్లారిటీ ఇచ్చారాయన.

గత కొంతకాలంగా నాగచైతన్య, సమంతల మధ్య ప్రేమ గురించి ప్రచారం జరుగుతోంది. దాన్ని ధృవీకరించిన నాగార్జున, సమంతతో నాగచైతన్య వివాహం జరుగుతుందని ప్రకటించారు. అఖిల్‌ వివాహం వచ్చే ఏడాది జరుగుతుందనీ, నాగచైతన్య వివాహంపై నిర్ణయం పూర్తిగా అతనికే వదిలేస్తున్నట్లు చెప్పారు నాగార్జున. అతి త్వరలోనే నాగచైతన్య - సమంత, నిశ్చితార్థం, ఆ వెంటనే వివాహం.. రెండూ జరుగుతాయని సినీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. మొత్తానికి ఇన్ని రోజులుగా సస్పెన్స్‌గా నడుస్తున్న అక్కినేని వారింటి పెళ్లి పిలుపు వచ్చేసినట్లే. అటు అక్కినేని ఫ్యాన్స్‌కీ, ఇటు సమంత ఫ్యాన్స్‌కీ ఇది సంతోషించదగ్గ విషయమే. 

మరిన్ని సినిమా కబుర్లు
nitin re entry