Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
akkineni nag anounced nag marriage...

ఈ సంచికలో >> సినిమా >>

పట్టాలెక్కిన నితిన్‌ - హను సినిమా

nitin re entry

నితిన్‌ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందనున్న సినిమా లాంఛనంగా ప్రారంభమయ్యింది. 'అందాల రాక్షసి', 'కృష్ణ గాడి వీర ప్రేమగాధ' వంటి డిఫరెంట్‌ లవ్‌ స్టోరీస్‌ని తెరకెక్కించిన హను, 'అఆ' సినిమాతో ఇటీవల మంచి విజయాన్ని అందుకున్న నితిన్‌తో చేస్తున్న సినిమా కావడతో ఈ సినిమాపై అప్పుడే భారీ అంచనాలు నెలకొన్నాయి. తన గత చిత్రాల్లానే ఇది కూడా ఓ డిఫరెంట్‌ లవ్‌ స్టోరీ అనీ, నితిన్‌ ఇమేజ్‌కీ, నితిన్‌ బాడీ లాంగ్వేజ్‌కీ సరిగ్గా సూటయ్యే కథను ఎంచుకున్నామని అంటున్నాడు హను రాఘవపూడి. హను చెప్పిన కథ తనకు బాగా నచ్చిందన్న నితిన్‌, 'అఆ' తర్వాత తనకు ఈ చిత్రం ఆ స్థాయి విజయం అందిస్తుందనే ధీమా వ్యక్తం చేశాడు.

ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉంటారని సమాచారమ్‌. హీరోయిన్ల ఎంపిక ఇంకా ఓ కొలిక్కి రాలేదు. నేచురల్‌ బ్యూటీ నిత్యామీనన్‌ని ఒక హీరోయిన్‌గా పరిశీలిస్తున్నట్లు సమాచారమ్‌. మరో హీరోయిన్‌గా కొత్త అమ్మాయి కోసం వెతుకుతున్నారట. 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై ఈ చిత్రం అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందనుంది. అంతేకాదు ఈ సినిమాలో నితిన్‌ న్యూలుక్‌లో వెరీ వెరీ హ్యాండ్‌సమ్‌గా కనిపించనున్నాడట. నవంబర్‌లో ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభం కానుంది. వేసవి కానుకగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేలా దర్శక నిర్మాతలు స్కెచ్‌ ప్రిపేర్‌ చేశారు. 

మరిన్ని సినిమా కబుర్లు
janata garriage 100 crores