Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
katha sameeksha

ఈ సంచికలో >> శీర్షికలు >>

మధురంగా.... ఆరోగ్యంగా.. - .అంబడిపూడి శ్యాం సుందర రావు

madhurangaa ..aarogyangaa
సామాన్యముగా చాలా చోట్ల దొరికే దుంపలు ఇవి వీటిని ఉడక బెట్టుకొని లేదా కూరలతో కలిపి వండుకొని లేదా పులుసులో ముక్కలుగా వేసుకొని తినటము మనకు అలవాటు. కాని మనము వాటి పోషక విలువల గురించి పూర్తిగా తెలుసుకోము తెలుసుకుంటే వాటి ఫలితాలను పూర్తిగా పొందవచ్చు అవి ఆరోగ్యానికి చేసే మేలునుకుడా మనము తెలుసుకోవాలి. రక్తములోని గ్లూకోజ్ నిల్వలను నియంత్రించి ఆహార పదార్ధముగా గుర్తించబడింది కాబట్టి మధుమేహానికి మంచి ఆహారము .చిలగడ దుంపలను ఇంగ్లీష్ లో "స్వీట్ పొటాటో"అంటారు ఎందుచేతనంటే ఏ కూరలకు లేని తియ్యటి వాసన,రుచి వీటికి ఉంటుంది కాబట్టి. 

చిలగడదుంపలను ఎంచుకొని నిల్వచేయటము:-  
చిలగడ దుంపల లో చాలా రకాలు రంగుల తేడాతో ఉన్నాయి కాబట్టి మంచివి ఏవో తీసుకోవటానికి కొన్ని సూచనలు

1. వీలైనంతవరకు కూరగాయల దుకాణములో బాగా ముదురు రంగు ఉండే చిలగడ దుంపలను ఎంచుకోవాలి ముదురు రంగు దుంపలలో విటమిన్ ఏ ఉత్పత్తికి అవసరమయిన కెరోటిన్ అధికముగా ఉంటుంది ఉదా రంగులో ఉండే దుంపలు ఆసియాలోని చాలా ప్రాంతాలలో దొరుకుతాయి.ఇవి మంచి పోషకాలను కలిగి ఉంటాయి. రంగు తక్కువ దుంపలు ఆరోగ్యానికి మంచివి అయినప్పటికీ ముదురు రంగు దుంపలు అంతా ఉపయోగము కాదు.

2. దుంపలు పైన ముడతలు ఎక్కువగా ఉన్నవి తీసుకోకండి అంతే  దుంపల పై  ఆకుపచ్చని రంగు మచ్చలు ఉంటే తీసుకోకండి

3.  దుంపలను చల్లటి ప్రదేశములో గాలి తగిలే చోట ఉంచండి అంతే గాని పాలిథీన్ కవర్లలో ఉంచి ఫ్రిజ్  నిల్వ చేయ వద్దు వీలైనంతవరకు  దుంపలను  వారములోపు వినియోగించండి.

4. మాములు బంగాళా దుంపలను ఉడికించినట్లే వీటిని ఉడికించాలి కానీ వీటిని తొక్కతో తినాలి తొక్కలో ఎక్కువ పోషకాలు ఉంటాయి మరి ఎక్కువగా ఉడికించకూడదు.

చిలగడ దుంపల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు:-

1.వీటిలోని B6 విటమిన్ ,పొటాషియం గుండెకు చాలా మంచి చేస్తాయి. B6 విటమిన్ రక్తనాళాలు గట్టిపడటానికి కారణమైన హోమోసిస్టైన్ అనే పదార్ధాన్ని విచ్చిన్నము చేస్తుంది. పొటాషియం ద్రవాలకు బ్లడ్ ప్రెజరు కు మధ్య సమతుల్యతను కాపాడుతుంది . ఫలితముగా శరీరములోని కణాలకు ఎలక్ట్రాలైట్లు అంది గుండె కొట్టుకోవటం క్రమపద్ధతిలో ఉంటుంది.

2. వీటిలో బీటా కెరోటీన్ అధికముగా ఉంటుంది ఇది విటమిన్ A ఉత్పత్తికి దోహదపడుతుంది. విటమిన్ A క్యాన్సరును నివారిస్తుంది కంటిచూపును బాగా ఉండేటట్లు చూస్తుంది ఒక పెద్ద చిలగడదుంప రోజుకు ఒకటి తింటే మన శరీరానికి అవసరమైన విటమిన్ A లభ్యమవుతుంది అని అమెరికా ఫుడ్ మరియు డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ వారు తెలిపారు .

3.ఇవి తియ్యగా ఉన్నప్పటికీ వీటిలో గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువ కాబట్టి  మాదిరి బ్లడ్ షుగర్ శాతాన్ని పెంచవు ఇవి రక్తములోకి గ్లూకోజ్ ను చాలా నెమ్మదిగా విడుదల చేస్తాయి కాబట్టి మధుమేహ వ్యాధిగ్రస్తులు వీటిని తినవచ్చు

4. చర్మ పోషణలో ఇవి బాగా ఉపయోగపడతాయి వీటిలోని విటమిన్ C మరియు E లు సూర్యరశ్మి లోని అతినీల లోహితకిరణాలనుండి చర్మాన్ని కాపాడుతాయి చర్మము ఆరోగ్యవంతముగా ఉండటానికి అవసరమైన కొలాజిన్ ఉత్పత్తికి సహాయపడతాయి. దుంపలుమాత్రమే కాకుండా వాటిని ఉడికించిన నీరుకూడా చర్మానికి ఉపయోగ పడుతుంది. ఆ నీటిని నెమ్మదిగా మొహము పై రుద్దిన చర్మము పై గల సూక్ష్మరంధ్రాలలో ఉన్న మురికి తొలగించ బడుతుంది. కాళ్లక్రింద ఏర్పడే నల్లటి వలయాలను కూడా ఈ నీటితో తొలగించుకోవచ్చు .

5.వీటిలోని పీచు పదార్ధము జీర్ణక్రియకు ఉపయోగిస్తుంది తక్కువ కెలోరీలను ఇస్తుంది ఈ పీచు ఆహార నాళము లోని వ్యర్ధ పదార్ధాలను హానికరమైన పదార్ధాలను బయటకు పంపటానికి ఉపయోగపడుతుంది ఫలితము గా మలబద్దకము,పొట్ట ఉబ్బరముగా ఉండటం ఉండవు .

6.వీటిలో విటమిన్ C,E,B5,B 6,రిబోఫ్లవిన్ ,కాపర్ వంటి పోషకాలు వివరివిగా ఉంటాయి. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి ఎర్ర రక్త కణాలఉత్పత్తిని పెంచుతాయి గాయాలు నయము అవటములోను రోగాలను నిరోధించటము లోను, కండరాల దృఢత్వాన్ని పెంచటములోను తోడ్పడుతుంది.

7. వీటిలోని మెగ్నీషియం ఆందోళనగా ఉన్నప్పుడు స్ట్రెస్ ను తగ్గించటానికి రిలాక్స్ అవటానికి ఉపయోగ పడుతుంది. మనము ఇంతకు మునుపు చెప్పుకున్నట్లుగా వీటిలోని పొటాషియం గుండె కొట్టుకోవటాన్ని అదుపుచేసి స్ట్రెస్ ను తగ్గిస్తుంది .

8. ఎంఫైసిమా అనే వ్యాధిలో ఊపిరితిత్తులలో గాలి సంచులు క్రమముగా నశించిపోతాయి ఫలితముగా స్వాస కష్టము అవుతుంది. ఈ వ్యాధి సామాన్యముగా ధూమపానం చేసేవారిలోను ధూమపానం చేసే వారి మధ్య ఎక్కువ కాలము గడిపే వారిలోను కనిపిస్తుంది ధూమపానము విటమిన్ A స్థాయిలను తగ్గిస్తుంది ఫలితముగా ఊపిరితిత్తులలో దెబ్బతిన్నకణములు పునరుత్పత్తి చెందవు, చిలగడ దుంపలలో బీటా కెరోటిన్ విటమిన్ A ఉత్పత్తికి తోడ్పడి ఊపిరితిత్తులను ఎంఫైసీమా వ్యాధి నుండి రక్షణ కలుగజేస్తుంది

తెలుసుకున్నారుగా చిలగడ దుంపల ప్రయోజనాలు కాబట్టి వీటిని తింటాము అలవాటుచేసుకొని మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి.   

- అంబడిపూడి శ్యామసుందర  రావు 
మరిన్ని శీర్షికలు
beauty of himalayas