Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
bunny act tamil industry

ఈ సంచికలో >> సినిమా >>

చెన్నయ్‌ చందమామ రాశి ఖన్నా

chennai moon rashikhanna

తమిళంలో అడుగు పెడుతోంది బబ్లీ బ్యూటీ రాశి ఖన్నా. సిద్దార్ధ హీరోగా కార్తీక్‌ అనే కొత్త దర్శకుడు రూపొందిస్తున్న సినిమాలో రాశి ఖన్నా హీరోయిన్‌గా ఎంపికైంది. ఈ సినిమా కోసం రాశి ఖన్నాని తనే ఎంచుకున్నాడట హీరో సిద్దార్ధ. తెలుగులో రాశి ఖన్నాకి ఉన్న ఫాలోయింగ్‌తో పాటుగా తన సినిమాలోని బబ్లీ క్యారెక్టర్‌కి రాశి ఖన్నా అయితే యాప్ట్‌గా ఉంటుందని సిద్దూ ఆమెను హీరోయిన్‌గా తీసుకున్నాడని తెలియవస్తోంది. రాశి ఖన్నాకి తమిళంలో ఇదే తొలి సినిమా కానుంది.

'ఊహలు గుసగుసలాడే' సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలోకి వచ్చిన ఈ బ్యూటీ తెలుగులో పలు విజయాల్ని అందుకుంది. 'జిల్‌', 'సుప్రీం' వంటి హిట్స్‌ రాశి ఖన్నాకి ఉన్నాయి. సిద్దార్ధతో రాశీఖన్నా తొలిసారిగా నటిస్తోంది. ఇప్పటికే తెలుగులో ముద్దుగుమ్మ రాశీ చేతిలో చాలా సినిమాలే ఉన్నాయి. రవితేజతో 'ఆక్సిజన్‌' సినిమాలో రాశీఖన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. యంగ్‌ అండ్‌ ఎనర్జిటిక్‌ హీరో రామ్‌తో నటిస్తోన్న 'హైపర్‌' సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. జయాపజయాలతో సంబంధం లేకుండా ఈ ముద్దుగుమ్మకి తెలుగులో అవకాశాలు బాగానే వరిస్తున్నాయి. ఇక తమిళంలో కూడా అడుగుపెట్టింది ఇప్పుడు. సో రాశీ ఇకపై సో బిజీ కానుందేమో అంటున్నాయి టాలీవుడ్‌ వర్గాలు. ఈ ముద్దుగుమ్మ కోలీవుడ్‌లో ఇలా అడుగుపెట్టిందో లేదో అక్కడ అవకాశాలు వెల్లువలా వచ్చేస్తున్నాయట. మరో ప్రముఖ హీరోతో రాశీ ఖన్నాకి తమిళంలో ఛాన్స్‌ వచ్చిందని గాసిప్స్‌ వినవస్తున్నాయి.

మరిన్ని సినిమా కబుర్లు
cheppukondi chooddam