Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
chnadighar

ఈ సంచికలో >> శీర్షికలు >>

నిద్ర లేమి - .

isnomiaa

"మన ఆరోగ్యము మన చేతుల్లోనే" అనే శీర్షిక క్రింద ఇప్పటివరకు మనము తినే పండ్లు ,కూరగాయలగురించి వాటి పోషక విలువల  గురించి అవి మన ఆరోగ్యానికి ఏ విధముగా దోహద పడతాయి అన్న విషయాలను కొన్ని తెలియజేశాను ప్రకృతి మనకు ఎన్నో ఇచ్చింది అన్ని అన్ని రకాలుగా ఉపయోగపడేవే.  అన్నింటిని తెలుసుకోవాలంటే కొద్దిగా కష్టమైనా పని. మనము ఆహారము విషయములో ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నా మంచి ఆహారము(అని మనము అనుకునేది) తీసుకున్నా మనము చాలా సందర్భాలలో చాలా మంది అనారోగ్యాల పాలు అవుతుంటాము.వాటిని నయము చేసుకోవటానికి డాక్టర్లను దర్శించాల్సి వస్తుంది. మన అనారోగ్యాలకు కారణము మనము మన చుట్టూ ఉండే కాలుష్యము, గాలి కాలుష్యము, నీరు కాలుష్యము ఆహారము కాలుష్యము అనారోగ్యానికి  వాడే మందులు కల్తీ ఈవిధముగా ప్రస్తుతము మనము మన ఆరోగ్యాన్ని కాపాడుకోవటం కొద్దిగా కష్టమే అయినా అసాధ్యము కాదు . 

మనకు సాధారణముగా వచ్చే జలుబు, జ్వరము లాంటి చిన్న రోగాల దగ్గరనుంచి  ప్రాణాంతకమైన గుండె జబ్బుల వరకు అవి రావటానికి గల కారణాలు ప్రాధమిక దశలో వాటిని ఎలా ఎదుర్కోవచ్చు, మన శరీరములోని అవయాలు వాటి పట్ల మనము తీసుకోవలసిన జాగ్రత్తలు అనే అంశల మీద, అటువంటి వ్యాధులకు మన పెద్దలు ఆచరించిన , ప్రస్తుతము మన వైద్యులు చెప్పే సూచనలను పాఠకులకు అందజేయాలని నా ఉద్దేశ్యము . మన జీవన విధానము మన పరిసరాలు మన ఆహారము మన ఆరోగ్యము పై ప్రభావాన్ని చూపుతాయి కాబట్టే మన ఆరోగ్యము మం చేతుల్లోనే అని చెప్పాను. 
 
 నిద్ర లేమి (ఇన్ సోమనియా):-  

ఇప్పటివరకు ప్రపంచములో పూర్తిగా చికిత్సకు లొంగని జబ్బుల్లో నిద్రలేమి ఒకటి ఇది నిద్రకు సంబంధించింది అంటే నిద్ర పట్టక పోవటం మనిషికి తిండి ఎంత అవసరమో నిద్రకూడా అంత అవసరమే. నిద్ర లేమి వల్ల ఇతరత్రా జబ్బులు అధికమవుతాయి ఉన్న జబ్బులు నయము అవటానికి కష్టము అవుతుంది అంటే అనేక చిక్కులను తెచ్చిపెట్టే జబ్బు నిద్రలేమి. ముందు నిద్రలేమి(ఇన్ సోమానియా) జబ్బు రావటానికి గల కారణాలను తెలుసుకుందాము .

మొదట్లో నిద్రలేమి భయం వల్ల, ఆందోళన వల్ల,మానసిక ఒత్తిడి వల్ల,పని భారము వల్ల, పరీక్షకో ఇంటర్వూ కో హాజరు అయే ముందు కలిగే ఆందోళన లేదా ఇష్టమైన వాళ్ళు చనిపోవటం లేదా దూరము అవటము లాంటి కారణాలవల్ల తక్కువ కాల పరిమితితో ఏర్పడుతుంది కానీ నిద్రలేమి తాత్కాలిగాముగా ఏర్పడి కొన్ని సందర్భాలలో హార్మోనుల స్రావము ఎక్కువ లేదా తక్కువ అవటం వల్ల,శారీరక భాధలు తగ్గకపోవటంవల్ల అంటే దీర్ఘ కాళికా వ్యాధుల వల్ల ముఖ్యముగా అల్జీమర్స్ వ్యాధిలో నిద్రలేమి శాశ్వత జబ్బుగా మారుతుంది అంటే మొండి వ్యాధిగా మందులకు లొంగని వ్యాధిగా మారుతుంది. సాధారణముగా వయస్సు పై బడినవారిలో అంటే వృద్దులలో ఈ జబ్బు సాధారణమైనది ఇవి కాకుండా కాఫీ,సిగరెట్లు సారాయి వంటి వాటికి బానిసలు అయినవారికి ఈ జబ్బు సర్వ సాధారణము . షిఫ్ట్ లలో పనిచేసేవారిలో,తరచుగా ప్రదేశాలు మారేవారిలో,ఎక్కువగా దూర ప్రయాణాలు చేసేవారిలో,నిద్ర పోయేటప్పుడు అనుకూల పరిస్తుతులు లేనివారిలో ఎక్కువగా టివి ల్యాప్ టాప్,మొబైల్ ఉపయోగించేవారిలో కూడా ఈ వ్యాధి కనిపిస్తుంది రాత్రి ఎక్కువగా ఆహారము తీసుకోవటం,లేదా రాత్రి పాడుకోబోయే ముందు ఎక్కువ శారీరక ఎక్సర్సైజులు చేయటంకూడా నిద్రలేమికి కారణాలు.

నిద్రసరిగా పట్టకపోవటంవల్ల కలిగే ఇబ్బందులు ఏమిటో చూద్దాము. మొదటిది బాగా అలసిపోవటం,పొద్దునే లేచినవెంటనే తాజాగా ఉండలేకపోవటం,చికాకుగా ఉండటము ఏ పనిమీద ఏకాగ్రత పెట్టలేకపోవటం,తలనొప్పి, మలబద్దకం, జీర్ణ శక్తి మందగించటం వంటి లక్షణాలు కనిపిస్తాయి ఇబ్బంది పెడతాయి .ప్రారంభములో నిద్రలేమిని గుర్తించి తగు జాగ్రత్తలు లేదా చిన్న చిన్న గృహ వైద్య చిట్కాలతో నిద్ర లేమిని ఎదుర్కొని ఉపశమనము పొందవచ్చు అవి ఏమిటో తెలుసుకుందాము

1. చిన్న ఉల్లిపాయల్ని(ఎర్రగా ఉండేవి) రెంటిని నిద్రపోయేముందు నమలాలి

2. పడుకోబోయే ముందు ఒక అర  గ్లాసు గోరువెచ్చని గేదె పాలు త్రాగాలి.

3. పొడిగా వుండే వేయించిన జీలకర్రను మెత్తగా పొడిచేసి దానికి యాస్తిమధు చూర్ణాన్ని సమపాళ్లలో కలిపి ఒక గ్లాసు వేడిపాలలో అ చుర్నాన్ని కలిపి రోజుకు ఒకసారి త్రాగాలి

4. ఒకచెంచా మెంతులను నీటిలో మరిగించి ఆ నీటిని రోజు త్రాగాలి.

5.బూడిద గుమ్మడికాయ రసాన్ని ఒక గ్లాసు రోజు రాత్రి పడుకోబోయే ముందు త్రాగితే మంచి ఫలితము ఉంటుంది 6.ప్రాణాయామము యోగాలను నిత్యము చేయాలి

7.శిరోధార అనే  ఆయుర్వేద తైలాన్ని తలకు మర్దనా చేయాలి పడుకోబోయే ఒక అర గంట  ముందు ఇలా తైలముతో  మర్దన చేస్తే బాగా నిద్ర పడుతుంది .

ప్రారంభములో నిద్రలేమితో భాధ పడేవారు నిద్ర మాత్రలను అలవాటుచేసుకుంటారు. వాటికి అలవాటు పడితే ఫలితము లేకపోగా ఇతర ఆరోగ్య సమస్యలు ప్రారంభమై తీవ్రమైన అనారోగ్యానికి పాలయి క్రమముగా  డోస్ పెంచుకుంటూ పోయి శాశ్వత నిద్రకు దగ్గర అవుతారు. ఆయుర్వేదములో నిద్ర లేమికి కొన్ని మందులున్నాయని అవి బాగా పనిచేస్తాయని ఆయుర్వేద వైద్యులు చెపుతారు అవి ఏమిటో తెలుసుకుందాము . మంచి నిద్ర పట్టటానికి తుంగద్రుమాది నూనె లేదా క్షీరబాల నూనెను రెండు లేదా మూడు చుక్కలను తలపై మర్దన చేయాలి రాత్రి భోజనము తరువాత సౌయు అనే మాత్రలను రోజుకు ఒకటి చొప్పున తీసుకుంటే మంచి ఫలితము ఉంటుంది అని ఆయుర్వేద వైద్యులు చెపుతున్నారు. భోజనంలో మాంసకృత్తులు అధికముగా ఉండే బాదము పప్పు,ఆక్రోట్ కాయలు,నువ్వు గింజలు,గుమ్మడి గింజలను ఆహారములో ఉండేటట్లు చూసుకోవాలి సారాయి సిగరెట్ వంటి వ్యసనాలకు దూరముగా ఉండాలి రాత్రులందు టివి చూడటము తగ్గించాలి

ఈ విధమైన జాగ్రత్తలతో నిద్రలేమిని తగ్గించుకోవచ్చు ప్రారంభములోనే నిద్రలేమికి గల కారణాలను మానసిక వైద్యుడి ద్వారా తెలుసుకొని చికిత్స ప్రారంభిస్తే ఫలితము ఉంటుంది .

మరిన్ని శీర్షికలు
sarasadarahaasam