Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
cine churaka

ఈ సంచికలో >> సినిమా >>

హైపర్ చిత్రసమీక్ష

hipar movie review

చిత్రం: హైపర్‌ 
తారాగణం: రామ్‌, రాశి ఖన్నా, సత్యరాజ్‌, తులసి, రావు రమేష్‌, మురళీ శర్మ తదితరులు. 
సినిమాటోగ్రఫీ: సమీర్‌రెడ్డి 
నిర్మాణం : 14 రీల్స్‌ 
నిర్మాతలు: రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట 
దర్శకత్వం: సంతోష్‌ శ్రీనివాస్‌ 
సంగీతం: జిబ్రాన్‌ 
విడుదల తేదీ: 30 సెప్టెంబర్‌ 2016

క్లుప్తంగా చెప్పాలంటే

ఎప్పుడూ హైపర్‌ ఎనర్జీతో ఉండే కుర్రాడు సూర్య అలియాస్‌ సూరి (రామ్‌). సరదా సరదాగా లైఫ్‌ని ఎంజాయ్‌ చేసేస్తుంటాడు సూరి. అతనికో తండ్రి (సత్యరాజ్‌). తండ్రి నారాయణమూర్తి అంటే, సూరికి అమితమైన ప్రేమ. ఎంత ప్రేమ అంటే, తండ్రి కోసం ఏం చేయడానికైనా, ఎవరితోనైనా గొడవపడటానికైనా, ఈ క్రమంలో ఎంతకు తెగించడానికైనా సిద్ధపడతాడు సూరి. అలాంటి సూరికి, మంత్రి రాజప్పతో తండ్రి కారణంగా గొడవ మొదలవుతుంది. అసలు ఆ గొడవ ఏంటి? మినిస్టర్‌ నుంచి తండ్రిని ఎలా కాపాడుకున్నాడు? అన్నవి తెరపైనే చూడాల్సిన అంశాలు.

మొత్తంగా చెప్పాలంటే

రామ్‌ అంటే ఎనర్జీకి కేరాఫ్‌ అడ్రస్‌. రవితేజ తర్వాత ఆ స్థాయిలో కంప్లీట్‌ ఎనర్జీతో చెలరేగిపోతాడు రామ్‌. డాన్సుల్లో రామ్‌ గురించి కొత్తగా చెప్పేదేముంది? ఓవరాల్‌గా రామ్‌ ఈ సినిమాకి హైపర్‌ ఎనర్జీ ఇచ్చాడు. ఎక్కడా జోరు తగ్గకుండా సినిమా సాగుతుందంటే అందులో రామ్‌ ఎఫర్ట్స్‌ చాలానే ఉన్నాయి హీరోగా. రాశి ఖన్నా గ్లామర్‌కే పరిమితమైంది. నటన పరంగా బాగానే చేసింది. ఆమె గురించి అంతకన్నా ఎక్కువ చెప్పుకోడానికేమీ లేదు. గ్లామర్‌ విషయంలో ఇంకాస్త హద్దులు దాటేసింది రాశి ఖన్నా.

సత్యరాజ్‌ తన నటనతో మరోసారి సత్తా చాటాడు. సత్యరాజ్‌ హుందాతనం అందరికీ నచ్చుతుంది. మినిస్టర్‌ పాత్రలో రావు రమేష్‌, రామ్‌ ఎనర్జీకి ధీటుగా పవర్‌ఫుల్‌గా కనిపించాడు. మురళీ శర్మ బాగా చేశాడు. మిగతా పాత్రధారులంతా తమ పాత్రల పరిధి మేర బాగానే చేశారు. 
కథ కొత్తదేమీ కాదుగానీ, సినిమాని ఎంటర్‌టైనింగ్‌ వేలో చెప్పడంలో దర్శకుడు సక్సెస్‌ అయ్యాడు. స్క్రీన్‌ప్లే పరంగా చాలానే జాగ్రత్తలు తీసుకున్నాడు. కొత్తగా లేకపోయినా, సినిమా బోర్‌ కొట్టకుండా సాగుతుందనంటే స్క్రీన్‌ప్లే విషయంలోనూ సక్సెస్‌ అయినట్లే. డైలాగ్స్‌ బాగున్నాయి, రామ్‌ ఎనర్జీకి తగ్గ డైలాగులతోపాటు, కామెడీ, సెంటిమెంట్‌ విషయంలోనూ డైలాగులు బాగా పేలాయి. సంగీతం ఆకట్టుకుంటుంది. బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ బాగుంది. పాటలు వినడానికీ, తెరపై చూడ్డానికీ బాగున్నాయి. ఎడిటింగ్‌ బాగుంది. సినిమాటోగ్రఫీ సినిమాకి పెద్ద ప్లస్‌ పాయింట్‌. సినిమా చాలా రిచ్‌గా కనిపించిందంటే సినిమాటోగ్రఫీ కారణంగానే. ఆర్ట్‌, కాస్ట్యూమ్స్‌ సినిమాకి అవసరమైన బాగా వర్క్‌ చేశాయి. నిర్మాణపు విలువలు చాలా చాలా బాగున్నాయి.

సాధారణ కమర్షియల్‌ సినిమాని ఎంటర్‌టైనింగ్‌గా, గ్రిప్పింగ్‌ యాక్షన్‌ సీన్స్‌తో తెరకెక్కించడం సంతోష్‌ శ్రీనివాస్‌ స్టయిల్‌. గతంలో రామ్‌తో చేసిన 'కందిరీగ' సినిమా తరహాలోనే ఎక్కడా కామెడీని మిస్‌ అవలేదు, యాక్షన్‌ని మిస్‌ అవలేదు. ఫస్టాఫ్‌ నెరేషన్‌ బాగుంది. సెకెండాఫ్‌లోనూ వేగం తగ్గకుండా జాగ్రత్తలు తీసుకున్నాడు. పాత కథ అనిపించినాసరే, సినిమాని ఎనర్జిటిక్‌గా మూవ్‌ చేయడం దర్శకుడి ప్రతిభకు నిదర్శనం. మాస్‌ని మెప్పించే అన్ని అంశాల్నీ జొప్పించి, కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు దర్శకుడు సంతోష్‌ శ్రీనివాస్‌, హీరో రామ్‌. ఎనర్జిటిక్‌ హీరోని దర్శకుడు వాడుకున్న విధానం బాగుందనిపిస్తుంది. ఓవరాల్‌గా టార్గెట్‌ ఆడియన్స్‌ని మెప్పించే చిత్రమే. పబ్లిసిటీ బాగా చేయడం ఈ సినిమాకి మరో ప్లస్‌ పాయింట్‌.

ఒక్క మాటలో చెప్పాలంటే
హైపర్‌ ఎనర్జీ బాగానే ఉంది

అంకెల్లో చెప్పాలంటే: 3.25/5

మరిన్ని సినిమా కబుర్లు
nandiniki mahesh power