Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
nandiniki mahesh power

ఈ సంచికలో >> సినిమా >>

సినిమాటోగ్రఫీ నుంచి మెగాఫోన్‌ వరకూ!

cinima autography to mega phone

'బాహుబలి' సినిమా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుందంటే అందులో డైరెక్టర్‌గా రాజమౌళి హ్యాండ్‌ ఎంతుందో, తెర మీద అద్భుతం వెనకు మరో హ్యాండ్‌ కూడా ఉంది. అదే కెమెరామెన్‌ సెంథిల్‌ కుమార్‌. విజువల్‌గా అద్భుతం సృష్టించిన ఘనత సెంథిల్‌ది. 'మగధీర' సినిమాకీ సెంథిల్‌ సినిమాటోగ్రఫీ పెద్ద ప్లస్‌ పాయింట్‌. 'ఐతే' సినిమాతో సెంథిల్‌కుమార్‌ సినిమూటోగ్రాఫర్‌గా ఎంట్రీ ఇచ్చి, తొలి సినిమాతోనే భళా అనిపించాడు. సినిమాటోగ్రఫీ అంటే, దానికి దర్శకత్వంపైనా అవగాహన ఉండాలంటాడు సెంథిల్‌. తనలోనూ దర్శకుడు ఉన్నాడని, అయితే సమయం వచ్చినప్పుడు ఆ డైరెక్టర్‌ బయటికి వచ్చి అద్భుతాన్ని సృష్టించడానికి రెడీగా ఉన్నాడంటున్నాడు సెంథిల్‌. మంచి కథ దొరికితే తాను కూడా దర్శకుడినవుతానని అంటున్నాడు. అంతేకాదు సొంత కథతోనే దర్శకుడినవ్వాలని అనుకుంటున్నాడట. ప్రస్తుతం 'బాహుబలి ది కన్‌క్లూజన్‌' సినిమాకి పని చేస్తున్నాడు. ఈ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా పూర్తవ్వగానే తన డైరెక్షన్‌ వివరాలు వెల్లడి చేస్తానని అంటున్నాడు. తాను చేయబోయే సినిమా ఇప్పుడొస్తున్న సినిమాలన్నింటికీ పూర్తి భిన్నమైనదై కావాలని తాను ఆశిస్తున్నాడట. అందుకే లేటయినా, డిఫరెంట్‌ కాన్సెప్ట్‌ ఉన్న కథతోనే మెగా ఫోన్‌ పడతానని చెబుతున్నాడు. అంతేకాదు డైరెక్టర్‌గా తన తొలి సినిమా ఒక ప్రముఖ యంగ్‌హీరోతో ఉండబోతోందని చెబుతున్నాడు. వచ్చే ఏడాదికల్లా ఈ సినిమాపై ఒక క్లారిటీ ఇవ్వనున్నానని సెంథిల్‌ చెబుతున్నారు. ఇంతవరకూ తెరపై సినిమాటోగ్రాఫర్‌గా అద్భుతాలు సృష్టించిన ది గ్రేట్‌ కెమెరామెన్‌ సెంథిల్‌ ఇకపై డైరెక్షన్‌తో కూడా అద్భుతాలు సృష్టిస్తాడేమో చూడాలిక. 

మరిన్ని సినిమా కబుర్లు
bahubali2 extrodnary