Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
chandighar

ఈ సంచికలో >> శీర్షికలు >>

అందోళన ,ఒత్తిడిని తగ్గించుకోవటానికి మార్గాలు: - అంబడిపూడి శ్యామసుందర రావు.

stress reliefment tips
 నేటి ,యాంత్రిక, స్పీడ్ యుగములో ప్రతివారు ఎదుర్కొనే సమస్య మానసిక ఆందోళన ,మానసిక ఒత్తిడి ఈ రెంటిని  అధిగమించలేక ఆరోగ్యము పాడై అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఈ రెండు అనేక  వ్యాధులకు మూల కరణాలు అవుతున్నాయి ముఖ్యముగా హృదయ మానసిక రోగాలకు కారణభూతాలు అవుతున్నాయి ఈ రెండు మనిషి జీవితాన్ని దుర్భరము చేస్తున్నాయి కాబట్టి ఎలాగైనా ఏ మార్గాన్నిఅనుసరించి అయిన ఆందోళన, ఒత్తిడిలను దూరము చేసుకోవాలని ఆధునిక మానవుడు శత విధాలుగా ప్రయత్నిస్తున్నాడు.ఈ ఆందోళన ఒత్తిడిలను తగ్గించుకోవటానికి  సులభమైన కొన్ని మార్గాలను చెపుతాను వాటిలో  అనువైనది ఎన్నుకొని మీ ఒత్తిడి ఆందోళనలను తగ్గించుకోవటానికి ప్రయత్నించి ఫలితము పొందండి .ప్రయత్నిస్తే పోయేది ఏమిలేదుకదా ? ఫలితము ఉంటే ఉపయోగమే కదా

1. గట్టిగా గాలి పీల్చి వదలండి అ విధముగా కొన్ని సార్లు చేయటమువల్ల కార్టిసాల్ హార్మోన్ ను తగ్గించి ఆందోళన,ఒత్తిడి ల నుంచి విడుదల
చేస్తుంది .

2. టీ త్రాగండి. టీ త్రాగటము వల్ల ఆందోళన ఒత్తిడి వల్ల విడుదలఅయిన కార్టిసాల్ హార్మోన్ ను సమతుల్యము చేసి అ వ్యక్తీ రిలాక్స్ అయేటట్లు సహాయపడుతుంది అందుకే బ్రిటిష్ వారు టీ ని ఎక్కువ ఇష్ట పడతారు.

3. ఆందోళన, ఒత్తిడి ఏర్పడినప్పుడు  పూర్తిగా కళ్ళు మూసుకొని చిన్నగా మంచి సంగీతాన్ని వింటూ మనస్సులో మీకు ఆనందాన్ని ఇచ్చే సన్నివేశాన్నిఉహించు  కొండి  జీవితములోని ఆనందకరమైన సన్నివేశాలను గుర్తుకు తెచ్చుకోండి ఫలితము మీకే తెలుస్తుంది.

4.  చిన్న ఎక్సర్ సైజులు చేయండి దీనివల్ల కోపము విసుగు నిరాశ వంటి లక్షణాలనుండి ఉపశమనము పొందుతారు.ఎక్సర్ సైజ్  వల్ల ఎండార్ఫిన్ అనే హార్మోన్  విడుదల అయి అందోళనను తగ్గిస్తుంది మన శరీరము మన అదుపులో ఉంటుంది

5. కుటుంబ సభ్యుల మధ్య సత్ సంబంధాలను కలిగి ఉండండి  కుటుంబ సభ్యుల మధ్య మంచి ప్రేమాను రాగాలు ఉన్నప్పుడు కుటుంబములోని ఒక వ్యక్తీ ఆందోళన ఒత్తిడులకు గురి అయినప్పుడు ఇతర కుటుంబ సభ్యులు అతనికి అండ గా ఉండి అతని ఆందోళన ఒత్తిడులు తగ్గటానికి సహాయము చేస్తారు

6. మంచి సంగీతము వినటము వాళ్ళ మానసిక ఒత్తిడి, ఆందోళనలను దూరము చేసుకోవచ్చు అని పరిశొధనలు తెలుపుతున్నాయి కాబట్టి మనస్సును ఆహ్లాదపరిచే సంగీతాన్ని మంద స్వరములో వినాలి .

7.ఈ ఒత్తిళ్ళకు ఆందోళనలకు యోగా అబ్దుతమైన సాధనము అని అందరు ఉప్పుకోనెది యోగా అంటే శ్వాస క్రియ లోని మెలుకువలు,శారీరక శ్రమ కలిపి చేసేవి,యోగా వాళ్ళ చాలా మంది ఈ విషయములో ఫలితాలను పొందారు 8.నడక రాత్రులందు
ప్రశాంతమైన నడక ఒత్తిడి విషయములో అభ్డుతముగా పనిచేస్తుంది మంచి ఫలితలాను ఇస్తుంది .నడస్తు చేసే ఎక్సర్సైజ్ లు చాలా రకాలు అంటే సులభము నుండిక్లిష్ట మైనవి ఉన్నాయి అందులో మనకు అనువైనవి ఎన్నుకొని చేసు కోవచ్చు.

9.ప్రేమించే వారితో మాట్లాడండి. మనస్సులో భాదను చెప్పుకోవటానికి ప్రతివారికి ఒక మనిషి కావాలి అ వ్యక్తీ భార్య కావచ్చు  స్నేహితులు
కావచ్చులేదా చుట్టము కావచ్చు అటువంటి సన్నిహితులతో  భాదను పంచుకుంటే చాలా రిలీఫ్ పొందవచ్చు .

10. మానసిక ఆందోళన లేదా ఒత్తిడి ఎదురైనప్పుడు అ పరిస్తితిని పొడిగించవద్దు అపరిస్తితి నుండి  కొంచము విరామము పొందండి అ విరామము సమయములో మీరు మళ్లి సమస్యలను ఎదుర్కొనే శక్తిని పొందగలరు మీరు  మనిషే గాని యంత్రము కాదుగా కాబట్టి మీకు విశ్రాంతి కావాలి

11.పరిశొధనల వల్ల శాస్త్రవేత్తలు "అరోమతెరపి" వల్ల ఒత్తిడిని తగ్గించవచ్చని తెలుసుకున్నారు అత్తర్లు లావెండర్,సెంట్లు వంటి సుగంధ
ద్రవ్యాలు ఒత్తిడిని తగ్గించటములో  ఉపయోగిస్తాయి .

12 ఒక అనునయించే, లేదా ఓదార్పు సందేశము అందుకుంటే ఒత్తిడికి లోనయినవారు చాలా మటుకు రిలీఫ్ పొందుతారు అందుచేత మనము ఒత్తిడి లేదా ఆందోళనకు వారు పంపే సందేశము చాలా ఉపయోగకారిగా ఉంటుంది .

13. ఎవరైతే కుక్కలు పిల్లులు వంటి పెంపుడు జంతువులను పెంచుతుంటారొ వారు చాలా తక్కువ శాతము ఆందోళనకు లోనవుతారు అని పరిశోధనలలో తెలిసింది పెంపుడు జంతువులతో సాన్నిహిత్యము మానసిక ఆందోళనను ఒత్తిడిని దూరము చేస్తాయి కుక్కలుతో సాన్నిహిత్యము వల్ల జీవిత కాలము పెరగటముకూదా గమనించారు .

14. రోజు మొత్తములో ఏదో ఒక టైములో ఒక చోట ప్రశాంతముగా కూర్చుని ఆ రోజు జరిగినవిశేషాలను వాటి   పట్ల మన స్పందనలను డైరీలో వ్రాసుకుంటే ఫలితము ఉంటుంది మనస్సులోని ఆందోళన ఒత్తిడులు కలము ద్వారా బయటికి పోతాయి మనస్సుకు
ప్రశాంతత లభిస్తుంది.

15. పగటిపూట  ముఖ్యముగా మధ్యాహాన్నము నిద్ర మంచి  ఫలితాలను ఇస్తుంది ఈ నిద్ర వల్ల హార్మోన్ల సమతుల్యత ఏర్పడి ఒత్తిడి తగ్గుతుంది .

16.ధ్యానము వల్ల మెదడు రిలాక్స్ అవుతుంది.  ధ్యానము మెదడును అధికముగా అలోచించటాన్ని తగ్గించి ఒత్తిడి ఆందోళనలను దూరము చేస్తుంది .ధ్యానము మెదడుకు కావలిసిన బ్రేక్ ను ఇచ్చి ఒత్తిడి,ఆందోళనలను తగ్గిస్తుంది

17.చూయింగ్ గమ్ కూడా టీ ఇచ్చే ఫలితాన్ని ఇస్తుంది .చూయింగ్ గమ్ నమలటము అనే యాక్టివిటీ వల్ల ఆందోళన ఒత్తిడికి విరామము కలుగుతుంది

18. నవ్వు,ఆందోళన,ఒత్తిడులకు దివ్య ఔషదముగా పనిచేస్తుంది  నవ్వేటప్పుడు ఎండోర్ఫిన్స్ అనే హార్మోనులు విడుదల అయి ఒత్తిడిని తగ్గిస్తాయి కాబట్టి ఆందోళన ఒత్తిడులు ఎదురైనప్పుడు టి.వి లో కామెడి చానళ్ళు లేదా మంచి జోక్స్ చదవండి,హాయిగా బిగ్గరగా నవ్వండి  స్నేహితులతో జోక్స్ పంచుకొని హాయిగా నవ్వుకోండి.

19.మనస్సును ఆందోళనపరిచే ఆలోచనలనుండి దూరము కండి, కొంత ఏకాంతము అవసరము, అ ఏకాంతము లో మంచి నిర్మాణాత్మకమైన అలోచనలను చేయండి ఫలితము కనిపిస్తుంది సమస్యలు ఎదురైనప్పుడు ఆందోళన చెంది పారిపోవటానికి ప్రయత్నించకండి. సమస్యలను ధైర్యముగా ఎదుర్కోండి అప్పుడే ఆందోళన ఒత్తిడులు దూదిపింజలల్లే ఎగిరిపోతాయి .

20. నిన్ను నీవు నమ్ము నీమీద నమ్మకము పెంచుకో " ఎటువంటి సమస్య నైనా నేను ఎదుర్కోగలను, అధిగమించ గలను,"అన్న ఆత్మ విశ్వాసము ఎటువంటి ఆందోళన ఒత్తిడులనైన దూరము చేస్తుంది ధైర్యముగా నిర్ణయాలు తీసుకోవచ్చు సమస్యలను
అధిగమించవచ్చు కాబట్టి పైన చెప్పిన పద్దతులలో మీకు అనువైన దానిని అవలంబించి ఫలితాన్ని పొందండి .
మరిన్ని శీర్షికలు
sarasadarahaasam