Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
velaga tree

ఈ సంచికలో >> శీర్షికలు >>

రవ్వ పులిహొర - పి. పద్మావతి

ఎటు చూసిన పండుగ వాతావరణంతో కళకళలాడుతోంది. ప్రతీ ఇల్లు పండుగ పిండి వంటలతో ఘుమఘుమలాడుతోంది. ప్రతి రోజూ ప్రత్యేక అలంకారాలతో పూజలందుకునే అమ్మవారి ప్రసాదాల్లో పులిహోర అత్యంత ప్రీతి పాత్రమైనది.గోతెలుగు పాఠకుల కోసం పులిహోర ప్రసాదం ఈ వారం వంటకం. 

 

కావలిసిన పదార్ధాలు:

బియ్యపురవ్వ, ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఆవాలు, జీలకర్ర, పసుపు, నూనె, శనగపప్పు, మినపగుండ్లు, ఉప్పు, నిమ్మకాయ


తయారుచేసే విధానం:
ముందుగా గిన్నెలో ఒకగ్లాసు బియ్యపు రవ్వకు రెండు గ్లాసుల నీళ్ళు పోసి అందులో తగినంత ఉప్పు వేసి బాగా మరగనివ్వాలి. మరుగుతున్న ఈ నీళ్ళల్లో బియ్యపు  రవ్వను నెమ్మదిగా పోసి కలపి మూతపెట్టాలి. 5 నిముషాల తరువాత ఉడుకుతున్న ఈ రవ్వలో కొద్దిగా పసుపు వేసి, రవ్వ పొడి పొడి గా  అయ్యేవరకూ వుంచాలి. తరువాత ఈ మిశ్రమాన్ని ఒక పళ్ళెంలో చల్లార్చాలి. తరువాత   బాణలిలో నూనె వేసి తగినంత నూనె వేసి ఆవాలు, జీలకర్ర, మినపగుండ్లు, శనగపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి ఈ పోపు మిశ్రమాన్ని రవ్వలో వేసి కలపాలి. చివరగా నిమ్మకాయ రసాన్ని వేసి కలపాలి. వేడి వేడి రవ్వ పులిహోర రెడీ!......

మరిన్ని శీర్షికలు
shistla stories review