Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
ravva pulihora

ఈ సంచికలో >> శీర్షికలు >>

శిష్ ట్లా కథాసమీక్షలు - అంబడిపూడి శ్యామసుందర రావు

shistla stories review
గ్రామీణులైన సిపాయిల జీవనవిధానాన్ని ఇతివృత్తముగా తీసుకొని వారి నోటి నుండి వచ్చిన మాటలను తడారకుండా కధలలో చొప్పించిన రచయిత శ్రీ శిష్ ట్లా ఉమామహేశ్వరరావుగారు, కాబట్టి వాళ్ళ మాటలుమొరటువి,జోకులు నేలబారువి, చేష్టలు కొంటేవి. కదలగురించి తెలుసుకోబోయే ముందు ముఖ్యముగా ప్రస్తుత తెలుగు పాఠకులకు అంతగా పరిచయములేని ఉమామహేశ్వరరావు గురించి ముందు  తెలుసుకుంటే ఆ కథలలోని సారాన్ని, విషయాన్ని పూర్తిగా ఆస్వాదించవచ్చు. 

ఈయన బ్రతికింది కొద్దికాలమే (1909-1953).పుట్టింది గుంటూరు జిల్లా మంచాళ గ్రామములో సనాతన బ్రాహ్మణ  వైదిక కుటుంబములో.  ఆందువల్లే తన్నుతాను "అగ్రహారపు బడితే" గా చెప్పుకున్నాడు.  కవితా రంగములో ఈయనది రౌడీ వేషము. స్థిరమైన ఉద్యోగము ,క్రమమైన జీవితము లేకుండా ఎత్తుడి సంసారిగా బ్రతికిన అనార్కిస్టు - సుడోమిస్టు . "అతి నవీనుల్లో కడు ప్రాచీనుడు "అని శ్రీ రంగము నారాయణబాబు గారి చేత, "వచన కవిత్వము ఆదిమ దశ  కవి" గా శ్రీశ్రీ చేత పొగిడించుకొని తను మాత్రము ఎవరికీ పూర్తిగా అర్ధము కాకుండా నిష్క్రమించిన తోలి తెలుగు వచన కవన రచయిత ఉమామహేశ్వరరావు గారు .శిష్ ట్లా మేధావుల దృష్టిలో జీనియస్ గాని వారన్నట్లు "ఎర్రటిక్ జీనియస్ "అంటే ఎన్నో దారులు తొక్కాడు ,మరెన్నో పోకడలు పోయినాడు ఏ ఒక్కటి స్థిరము  లేకపోవటమే అయన విశేషము.  ఆంగ్ల సామెత "  a rolling stone gathers no mass"  ఈయన జీవితానికి పూర్తిగా వర్తిస్తుంది. ఏకాగ్రత ఒక్కటే శిష్ ట్లా లోపము.ఎందుకంటే సాహిత్యములో కథలు,గేయాలు ,నాటికలు బాలల సాహిత్యము,వ్యాసాలు మొదలైనవి అన్ని ప్రక్రియలో చేయి పెట్టాడు, ప్రతి ప్రక్రియలో విభిన్నముగా కనిపిస్తాడు మూడు ముక్కల్లో చెప్పలాంటే శిష్ ట్లా ఏ సాహితి ప్రక్రియలోనయినా స్వతంత్ర ప్రతిభావంతుడు . శ్రీశ్రీకి  సహచరుడే గాక కొన్ని ముఖ్యాంశాల్లో మార్గదర్శకుడు ,ఉత్తేజకర్త 

సిపాయి కథలు తెలుగు సాహిత్యానికి ఒక నూతన అలంకారము అని భారతి పత్రికలో శ్రీ రంగము నారాయణ బాబు గారు ప్రశంసించారు . వస్తువులోను,కధనములోను,ఈ సిపాయి కథలు నవ్య మార్గానికి చెందినవై ఆంధ్ర కథానికా సాహిత్య విచార సందర్భాన మంచి స్థానము గడించి పెట్టేవిగా ఉన్నాయని శ్రీ కురుగంటి సీతారామభట్టాచార్యులు, శ్రీ  పిల్లలమఱ్ఱి  వెంకట హనుమంతరావు గారుఉమ్మడిగా వ్యాఖ్యానించారు .ఏదేశానికైనా యుద్ధము వస్తే ఆ యుద్ధము నుంచి సాహిత్యము లో కొన్ని నూతన మార్గాలు రావటము యుద్దానికి ఉండే ఒక ప్రత్యేకత ఆ విధముగా వచ్చినవే ఈ సిపాయి కథలు. మన దేశము ప్రత్యక్షంగా ప్రపంచ యుద్దానికి సంబంధములేకపోయిన బ్రిటిష్ పాలకుల పుణ్యామా అని మన సిపాయిలు బ్రిటిష్ వారి  తరుఫున పోరాడవలసి వచ్చింది. 

తెలుగువాడు ప్రధానముగా "ఇంటి పట్టు మనిషి "అని పేరున్న రోజుల్లో అది నిజముకాదు అని ఈ కథలు నిరూపిస్తాయి. రెండవ ప్రపంచ యుద్ధము వల్ల ఏర్పడ్డ ఆర్ధిక మాంద్యము వల్ల బ్రతుకుల నడ్డి విరిగిన మధ్యతరగతి విద్యావంతులు సైతము ఉదార పోషణార్ధము సైన్యములో నానా  నౌకరీలకు ఎగబడవలసి వచ్చింది అటువంటి వేలాది మందిలో శిష్ ట్లా కూడా ఒకడు ఆవిధముగా సైన్యములో చేరిన  తెలుగువాళ్లు నేపాల్, చైనా,బర్మా, చివరకు ప్రాన్స్, మధ్య ప్రాచ్యము వంటి ప్రాంతాలకు వెళ్లి అక్కడి మట్టిలో కలిసిపోయారు ప్రాన్స్ దేశపు బయళ్లన్నీ  మన సైనికుల ఎముకలతో తెలుపెక్కాయని శ్రీమతి సరోజినీ నాయుడు గారు ఒక గీతములో వర్ణించారు. ఏ  యుద్దములోనైనా ఎక్కువగా చనిపోయేది సాదా సిపాయిలే  అందుకనే వాళ్ళను "ఫిరంగుల దాణా" అని అంటారు.భారతీయ సైనికులు దాడులను తిప్పికొట్టే సన్నాహాలలో భాగముగా  శిబిరాలను ఏర్పరచుకొని కాలక్షేపము చేసే సమయములో సిపాయిల మధ్య జరిగిన సంభాషణలు వాళ్ళు వేసుకొనే ముతక జోకులే ఈ కధలకు మూలము.  శిష్ ట్లా ఈ కథల్లో ప్రధానముగా వర్ణించిన ప్రాంతము ఇండో-బర్మా సరిహద్దు .ఈ కథలలో "క్యాప్టె న్ తులసి" తప్ప మిగిలిన సిపాయి కథలన్నీ  భాషలో రాయబడ్డాయి. ఇరకము భాష రాయడము కష్టము చదివి అర్ధము చేసుకోవటం కూడా  బహు కష్టమే. ఈ కథలలో పాత్రల పేర్లు కూడా తమాషాగా ఉంటాయి.గురకానందము,మూడు మొగాల నరసి గాడు,పెద బొండాము గాడు  నక్కాయి గాడు ,గుబాగోపాయిగాడు ,గన్నరు గురుమూర్తి,గుంయి గుంయి గురివి మొదలైన తమాషా పేర్లు  
సిపాయి కథల్లో మచ్చుకు ఒక కథ గురించి మీకు చెపుతాను ఆ కథ పేరు "సిపాయి పెళ్ళాము" ఈ కథలో రచయిత  భర్త మిలటరీలో ఉండి భార్య , పల్లెటూళ్ళో ఊరిచివర తాటి చెట్ల తోపులో గుడిసెలో ఉంటూ కష్టపడి సంసారం ఈడుస్తున్న రోసి కథను వివరిస్తాడు. రోసి అందము గలది,విరబోసిన జుట్టుగలదైనా అందం గలదే రోసి నీటూ  గలది, స్నానమాడని ఒళ్ళు గలదైనా నీటు గలది, రోసి గుట్టు గలది, చిరుగుల మధ్య తొడలు పిక్కలు కనపడుతున్నా రోసి గుట్టుగలదే .గుడిసేటిదే రోసి, కానీ  రోషము కలదే అని ముఖమే చెబుతుంది. ఎదవ సోమాయి గాడు రోసి మరిది. పనిపాట లేక ఉరు అంతా బలాదూరుగా తిరుగుతూ  తాగుతూ వాగుతాడు అప్పుచేస్తాడు దొరకనప్పుడు అడుక్కుతింటాడు వాడికి తోడు ఒక కుక్క.  వాడు చేసే అప్పు కాబూలీ వాడి దగ్గర . కాబూలీవాడేమో కనబడ్డ చోటల్లా సోమయాయి గాడిని దబాయిస్తాడు . వాడేమో డబ్బులకోసము రోసి ని పీడిస్తాడు.  పనీపాటా చేసుకొని సంపాదించే నాలుగు డబ్బులు తిండికే సరిపోతుంది. మిలటరీనుంచి మొగుడు పంపించే కాస్తా మరిది అప్పులకు సరిపోతుంది.ఇది రోసి సంసార పరిస్థితి 

"వదినా పటానోడికి మనము డబ్బులియ్యగా వాడు నా దుంపతెంచుతున్నాడు "అని సోమాయిగాడు వదిన రోసితో తనభాధను చెప్పుకున్నాడు,

"మనము అనమాక అప్పు చేసింది నీవు ",అని రోసి అంటే ,"నేనెలేయే నువ్వికపోతే నేనిట్టిట్టనే?" అని వదిన ముందు  ప్రాధేయపడ్డాడు. 
"ఏంతా ?"  అని అడిగితె " పద్దాలుగున్నరా "అని జవాబు చెప్పాడు. "ఓలమ్మో అంతే జన్మ అంతా కష్టపడ్డా అంతరాదే ?ఏం సేయ్యాల్రో బాబో?'అని రోసి తన భాధను నిస్సహాయతను చెప్పింది. 

"పటానోడు నిన్ను సుశాట్ట నువ్వందము గలదానివంట  ఇంకేందో సెప్పాడు, పోతావా?"అని  నసిగాడు 

"యాడికి " అని ఎదురు ప్రశ్న వేసింది ," యాడి కంటే నేనేం సెప్పేది నీ సిగ్గోయ్"

"ఏంరోయ్  నీ అన్న లేడనా ?నువ్వు సెప్పేది ఇదా?మొగాన నెత్తురు లేదేంరా నీకు?ఏం లావు మడిసివిరా పొతాలే " అని రోసి రోషముగా పోయింది పోయింది పోయింది పఠాన్ కొట్టు దగ్గరకు. 

సరాసరి పఠాను కొట్టులోపలికి పోయింది పఠాను గాడు పరుపు మీద హుక్కాతాగుతున్నాడు 

"యామండీ మా వోడు మీకు బాకీ అంటగా ?"అని రోసి అడిగింది 

"బాకీకేంగాని  నువ్వు వచ్చావుగా ఫరవాలేదులే బాకీ వద్దు నాకు నువ్వే కావాలి సూడు నా మీసము ,నా కండలు "అని వాడి ఉద్దేశ్యాన్ని నేరుగా రోసి తో చెప్పాడు. 

"ఏందిరా సూసేది మా వాడితో అక్కడే చెప్పా అడి కన్నా తాడి సెట్టు మేలని నీతో సెప్పేదినీతో సెప్పాలని ఈడ కు వచ్చా మా అసలోడు లేడుగందా అని నువ్వేసుకుంటే,నీ తర్వాత ఆడేసుకుందాం అని ఆ  సోమిగాడి పన్నాగము యదవల్లారా కారం లేని కండలు ఎం కండలురా నీయీ అప్పిచ్చి ఆడాళ్ళ యెంట పట్టం ఏం మగసిరి రానీది? దగ్గరకు రాబోకు లమ్ డీ కొడకా సెప్పుతో కొట్టానంటే కాలికొద్దీ కాబులు లగెత్తాలి జాగ్రత్త " అని నాలుగు దులిపి వాడు తనను అందుకోకుండానే రోసి పరుగెత్తి రోడ్డు మీదకి చేరిన రోసి ఇంటి కెళ్ళకుండా 
ఇంకో ఊరు పోయి మొగుడుకోసము ఎదురు చూస్తోంది.  మరి ఆ ఊరు ఏమి చేస్తుందో?. బీదది, మొగుడు అండ లేనిది పైపెచ్చు అందమైనది కాబట్టి పరాయి మొగాళ్ళ క ళ్ళని రోసి లాంటి ఆడదాని పైనే. కానీ మన రోసి రోషము కల ఆడది కాబట్టి   ధైర్యముగా ఎదుర్కోగలదని ఆశిద్దాము .
మరిన్ని శీర్షికలు
story review