Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
apartment problems

ఈ సంచికలో >> శీర్షికలు >>

కాలేయాన్ని కాపాడుకోవటము ఎలా? - అంబడిపూడి శ్యాం సుందర రావు

liver protection

మన జీర్ణ వ్యవస్తలోని ఒక ముఖ్యమైన భాగము కాలేయము ఇది శరీరములో చాలా ముఖ్యమైన పనులను నిర్వహిస్తుంది . దీని స్తానము ఊపిరితిత్తుల చుట్టు ఉండే ఎముకల గూడు దిగువన కుడివైపున ఉంటుంది. కాలేయము ప్రధానముగా మన శరీరములోని క్రొవ్వును తగ్గించే పైత్యరసము(బైల్ జ్యూస్) ను ఉత్పత్తి చేస్తుంది ఇది శరీరములోని ఐరన్,చక్కర నిల్వల స్తాయిని అదుపుచేస్తుంది  కాకుండా ప్రోటీనుల తయారిలో ప్రముఖ పాత్ర వహిస్తుంది కాలేయానికి సంబందించిన జబ్బులు కాలేయ కణాలను పాడుచేసి కాలేయము సక్రమముగా పని చేయనివ్వవు చివరకు కాలేయము పూర్తిగా చెడిపోయి మృత్యువుకు దగ్గర చేస్తాయి.

సాధరణముగా కాలేయాని సంబందించిన రోగ లక్షణాలు :-చర్మము పసుపు పచ్చగా మారి జ్వరము ఉదరభాగాన కుడి పైపు పై భాగాన నొప్పి(ఇవన్ని కామెర్ల వ్యాధి లక్షణాలు),   నోరుపొడిబారిపోవటము,మూత్రము పచ్చగా రావటము,ఆకలి మందగించటము,రక్తాన్ని  వాంతి చెసుకోవటము,బరువు తగ్గటము కాలేయ పరిమాణము పెరగటము వంటి లక్షణాలు కనిపిస్తాయి 

కాలేయ సంబంధిత రోగాలకు ప్రధాన కారణాలను తెలుసు కుందాము :-

1. పగలు ఎక్కువ నిద్రపోయి రాత్రులందు నిద్ర తక్కువగా పోవటము

2.  ఒకేసారి ఎక్కువ ఆహారాన్ని తీసుకోవటము ఉదయాన్నే మూత్ర విసర్జన ఇబ్బంది పడుతుండటము

3.ఆహారములో కృత్రిమ తీపి పదార్ధాలు,ప్రిజర్ వేటివెస్ ఎక్కువగా తీసుకోవటము .

4.వేపుడు పదార్ధాలను ఎక్కువగా తినటము .

5. హెపటైటిస్ A ,B ,లేదా E సంక్రమణము .

6. మద్యపానము నేరుగా కాలేయాన్ని చెడగోడుతుంది

కాలేయ సంబంధిత వ్యాధులకు గృహా వైద్యాలు :-1. డాన్ డిలియాన్(ఒక రకము అడవిపూల చెట్టు) వేర్లతో చేసిన తీ లాంటి పానీయము కాలేయ వ్యాధులను నయము చేయటానికి బాగా పనిచేస్తుంది. ఈ డాన్ దిలియాన్ చెట్టు ఆకులను లేద వ్రేళ్ళను నీటిలో మరగించి రోజుకు రెండు సార్లుత్రాగితే మంచి ఫలితము కనిపిస్తుంది

2.కుసుమ చెట్టు పాలను రోజుకు రెండు సార్లుగా ఆహారముతో పాటు తీసుకుంటే కాలేయ సంబంధిత వ్యాధులను నయము చేయటములో మంచి ఫలితాన్ని ఇస్తుంది ముఖ్యముగా సిరోసిస్ వ్యాధికి హెపటైటిస్(వైరల్ ) బాగా పనిచేస్తుంది .

3.ఇండియన్ గూస్ బెర్రీ (సీమలో బుడ్డ బూసరి పండు అంటారు) లో విటమిన్ సి బాగా ఉండటము వల్ల కాలేయాన్ని ఆరోగ్యవంతముగా ఉంచుతుంది రోజు ఐడి లేదా ఆరు పళ్ళు తింటే మంచిది లేదా సాలడ్ గా   తినవచ్చు దీనివల్ల ఎలనైన్ ట్రాన్స్ మైనెజ్ అనే ఎంజైము శరీరానికి లభ్యమవుతుంది.

4.పసుపు లోని రసాయనము "కర్క్యుమిన్" యాంటి ఆక్సిడెంట్ మరియు యాంటి సెప్టిక్ లక్షణాలు కలిగి ఉండటము వల్ల ఆహారముతో తీసుకున్నప్పుడు కాలేయాన్ని మంచి స్తితిలో ఉంచటానికి దోహద పడుతుంది వైరస్ వాళ్ళ కలిగే హెపటైటిస్ వ్యాదులనుండి రక్షణ కలుగ జేస్తుంది. ఆహారముతో కాకపోయినా రోజు విడిగా ఒక లేదా అర చెంచా పసుపును నేరుగా లేదా తేనెతో కలిపి  తీసుకున్న మంచి ఫలితము ఉంటుంది .

5.బొప్పాయి పండు :-కాలేయనికి వచ్చే జబ్బులను నయము చెయటములో బొప్పాయి పండు చాలా ఉపయోగిస్తుంది ముఖ్యముగా సిరోసిస్ (జలోదరము) వ్యాధికి ఒక చెంచా నిమ్మ రసము మూడు చెంచాల బొప్పాయి రసము రోజుకు ఒకసారి ఆరు వారాల పాటు తీసుకుంటే మంచి ఫలితము కనిపిస్తుంది .6.యాపిల్ పండ్ల నుండి తయారైన పుల్లటి పానీయం(సిడర్ వెనిగర్) :-ఈ పానీయము కాలేయములోని హానికరమైన విషాలను తొలగించటానికి సహాయ పడుతుంది. భోజనానికి ముందు ఈ పానీయాన్ని తీసుకుంటే శరీరములోని క్రొవ్వు పదార్ధాలు సమపాళ్ళలో ఉండేటట్లు చేస్తుంది. ఒక చెంచా సిడర్ పానీయాన్ని ఒక గ్లాసు నీళ్ళలో కలిపి దానికి ఒక చెంచా తేనె కలిపి రోజుకు మూడు సార్లు తీసుకుంటే కాలేయము శుభ్ర పడుతుంది.

ఇవి కాకుండా కాలేయానికి సంబంధించి మరికొన్ని చిట్కాలు :-

1 రోజు గ్రీన్ టీ త్రాగండి దీనిలొని కెటాచిన్స్ కాలేయము సంర్ధవంతముగా పనిచేయటానికి దోహదపడతాయి.

2.రోజు ఎంతో కొంత శారీరక శ్రమ అవసరము దీనివల్ల శరీరములోని విషాలు చెమట రూపములో బయటికి పోతాయి.

3 .మంచి నీళ్ళు బాగా త్రాగాలి నీళ్ళు శరీరములోని విషాలను బయటికి నెట్టి వేస్తుంది

4.ఆహారములో ఆకూ కూరలు ఎక్కువ గా తీసుకోవాలి. రోజుకు ఒక యాపిల్ తినాలి

5. మద్యపానాన్ని పూర్తిగా మానివేయాలి.

మరిన్ని శీర్షికలు
sarasadarahaasam