Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
navvunaaluguyugaalu

ఈ సంచికలో >> శీర్షికలు >>

14-10 -2016 నుండి 20-10--2016 వరకు వారఫలాలు - - శ్రీకాంత్

మేష రాశి :   వారం మొత్తం మీద మీరు తలపెట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేయుటకు అవకాశం ఉంది. ఆర్థికపరమైన విషయాల్లో సంతృప్తికరమైన ఫలితాలు పొందుటకు అవకాశం కలదు. మిత్రులతో సమయాన్ని గడుపుతారు వారితో కలిసి నూతన ప్రయత్నాలకు కేటయించే అవకాశం కలదు. ఉద్యోగంలో అధికారులతో స్వల్ప మనస్పర్థలు కలుగుటకు అవకాశం కలదు. ఉద్యోగంలో ఏవైనా నిర్ణయాలు తీసుకొనే ముందు తొందరపాటు వద్దు అలాగే వివాదములకు దూరంగా ఉండే ప్రయత్నం చేయుట మంచిది. ప్రయాణాలు చేయునపుడు కొంత జాగురుకత అవసరం అలాగే ఖర్చులు పెరుగుటకు అవకాశం ఉంది. అనారోగ్యం విషయంలో అశ్రద్ద వద్దు సమయానికి భోజనం చేయండి.          

 

వృషభ రాశి : వారం మొత్తం మీద మీరు ఇష్టమైన వ్యక్తులను కలుస్తారు వారితో సమయాన్ని గడుపుటకు అవకాశం కలదు. బంధువుల నుండి విలువైన సమాచరం అందుతుంది. ఉద్యోగంలో శ్రమను పొందుతారు ప్రణాళికతో ముందుకు వెళ్ళుట వలన మేలుజరుగుతుంది. అనారోగ్యం మూలాన ఇబ్బందులు కలుగుటకు అవకాశం ఉంది తగిన జాగ్రత్తలు తీసుకోండి. ప్రయాణాల వలన సమయాన్ని నష్టపోయే అవకాశం ఉంది వీలయితే వాయిదా వేయుట సూచన.  పనులను చేయునపుడు జాగ్రత్తగా లేకపోతే విలువైన వస్తువులకు ప్రమాదం చోటుచేసుకొనే అవకాశం ఉంది జాగ్రత్త. చేపట్టిన పనులలో ఊహించని ఖర్చులు కలుగుటకు అవకాశం ఉంది,అనవసరమైన ఖర్చులకు దూరంగా ఉండుట వలన మేలుజరుగుతుంది.   

 

 

మిథున రాశి : వారం మొత్తం మీద మీరు కుటుంభంలో నూతన నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉంది,కుటుంభసభ్యుల సూచనలు సలహాలను పరిగణలోకి తీసుకోవడం వలన మరింత మంచి ఫలితాలు వస్తాయి. తలపెట్టిన పనులను కాస్త ఆలస్యంగా పూర్తిచేయుటకు అవకాశం కలదు నలుగురిని కలుపుకొని వెళ్ళండి దానివలన మేలుజరుగుతుంది. గతంలో చేపట్టిన పనులను పూర్తిచేసే ఆస్కారం కలదు వాటికి ప్రాముక్యత ఇవ్వడం సూచన. మాటపట్టింపులకు పోకపోవడం మంచిది వివాదములకు దూరంగా ఉండుట సూచన. ఉద్యోగప్రయత్నాలు కలిసి వస్తాయి కొంత ప్రణాళిక అవసరం. ప్రయాణాలు చేయకండి సమయాన్ని విలువైన విషయాలకు ఇవ్వడం మూలాన మేలుజరుగుతుంది. ఒకవార్త కొంత నిరుత్సాహంను కలుగజేస్తుంది.       
 

కర్కాటక రాశి :  వారం మొత్తంమీద మొదట్లో చిన్న చిన్న సమస్యలు ఎదురైనా వాటిని విజయవంతంగా పూర్తిచేసే అవకాశం కలదు. బందుమిత్రులతో సమయాన్ని సరదాగా గడుపుటకు ఆస్కారం ఉంది అలాగే వారితో కలిసి నూతన నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థికపరమైన విషయాల్లో బాగానే ఉంటుంది పెట్టుబడుల విషయంలో అనుభవజ్ఞుల సూచనలతో ముందుకు వెళితే లబ్దిని పొందుతారు. కొన్ని కొన్ని విషయాల్లో స్థిరమైన ఆలోచనలు చేయుట వలన మేలుజరుగుతుంది. కుటుంభంలో అందరిని కలుపుకొని వెళ్ళండి మాటపట్టింపులకు వెళ్లకపోవడం మంచిది. ఉద్యోగంలో బాగుంటుంది మీ ఆలోచనలు అధికారులకు తెలియజేయుట వలన ఆశించిన విధంగా గుర్తింపును పొందుటకు అవకాశం కలదు.
 

         
సింహ రాశి : వారం మొత్తంమీద తలపెట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేయుటకు ఆస్కారం ఉంది. బంధుమిత్రులతో కలిసి సమయాన్ని సంతోషంగా గడుపుటకు అవకాశం ఉంది. నూతన పరిచయాలు కలుగుటకు అవకాశం ఉంది వారితో సమయాన్ని గడుపుతారు. అధికారులకు అనుగుణంగా నడుచుకొనుట వలన మేలుజరుగుతుంది వారికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకోండి. సోదరవర్గం నుండి మాటపడవలసి రావోచ్చును సర్దుబాటువిధానం మంచిది. ప్రయాణాలు చేయుటకు ప్రయత్నం చేయకపోవడం మంచిది బాగాఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఆరోగ్యం విషయంలో చిన్న చిన్న సమస్యలు కలుగుతాయి,తగిన జాగ్రత్తలు పాటించుట వలన ఇబ్బందులు తగ్గుతాయి. 

 

కన్యా రాశి : వారం మొత్తంమీద మిశ్రమఫలితాలు పొందుటకు అవకాశం ఉంది. ఏదైనా పనులను చేపట్టుటకు ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించుట వలన మేలుజరుగుతుంది. అధికారులకు అనుగుణంగా నడుచుకొనుట వలన మేలుజరుగుతుంది. ప్రయాణాలు చేయుట వలన చిన్న చిన్న సమస్యలు కలుగుటకు అవకాశం ఉంది. నూతన ప్రయత్నాలు మొదలు పెట్టాలనే తలంపును కలిగి ఉంటారు పెద్దల సూచనలు పాటించుట ఉత్తమం. ఉన్నతవిద్యాఅవకాశాలు కలిసి వస్తాయి. కుటుంభంలో సభ్యులతో కలిసి శుభకార్యక్రమాలలో పాల్గొనే అవకాశం ఉంది. వ్యాపారపరమైన విషయాల్లో మాత్రం సంప్రదాయ విధానం మేలుచేస్తుంది.    

 

 

 

   తులా రాశి : .వారం మొత్తంమీద బంధుమిత్రులతో కలిసి సమయాన్ని సరదాగా గడుపుటకు అవకాశం ఉంది. తలపెట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేస్తారు కాకపోతే సరైన ప్రణాళిక లేకపోతే నూతన సమస్యలు వచ్చే ఆస్కారం కలదు జాగ్రత్త. ఆర్థికపరమైన విషయాల్లో బాగానే ఉంటుంది నూతన ఖర్చులను పొందుతారు. ఉద్యోగంలో మిశ్రమఫలితాలు పొందుతారు అధికారులకు అనుగుణంగా నడుచుకొనుట వలన మేలుజరుగుతుంది. మీయొక్క మాటతీరు మూలాన కొన్ని కొన్ని విషయాల్లో ఇబ్బందులు పొందుతారు,సర్దుబాటు విధానం మంచిది. ప్రయాణాలు చేయకండి ఒకవేళ చేయవలసి వస్తే తగిన జాగ్రత్తలు తీసుకోవడం ఉత్తమం. భోజనం విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధను కలిగి ఉంటారు.         

 

    

వృశ్చిక రాశి  : వారం మొత్తంమీద చర్చాసంభందమైన విషయాలకు సమయం ఇస్తారు. మిత్రుల సహాకారంతో చాలావరకు పనులను పూర్తిచేసే అవకాశం ఉంది. నూతన నిర్ణయాల విషయంలో మాత్రం నిదానం అసవరం అనుభవజ్ఞుల సూచనల మేర నడుచుకోండి. తలపెట్టిన పనులను కాస్త ఆలస్యంగా విజయవంతంగా పూర్తిచేసే అవకాశం ఉంది. అధికారుల నుండి చక్కటి గుర్తింపును పొందుతారు. ప్రయాణాలు కలిసి వస్తాయి తల్లితరుపు బంధువుల నుండి సంతోషించే వార్తను వింటారు, బంధుమిత్రులతో కలిసి శుభకార్యక్రమాలలో పాల్గొనే అవకాశం కలదు. దైవసంభందమైన విషయాలకు సమయం ఇవ్వడం వలన మేలుజరుగుతుంది. ఇష్టమైన పనులకు సమయం కేటాయిస్తారు నచ్చిన వారినుండి ప్రశంశలు పొందుతారు.

 

 

ధనస్సు రాశి  :  వారం మొత్తంమీద స్త్రీ సంభందమైన విషయాలలో నూతన నిర్ణయాలు తీసుకొనే అవకాశం కలదు. కుటుంబంలో సభ్యుల నుండి ఊహించని విధంగా సహకారం లభిస్తుంది. తలపెట్టిన పనులను కాస్త ఆలస్యంగా నైనా పూర్తిచేసే అవకాశం ఉంది. ప్రయాణాలు చేయుటకు అవకాశం కలదు వాటికి సమయం ఇస్తారు. దూరప్రదేశం నుండి సంతోషించే వార్తలను వినే అవకాశం కలదు.  ఆర్థికపరమైన విషయంలో మిశ్రమఫలితాలు పొందుటకు అవకాశం కలదు నిదానం అవసరం. వ్యాపారం బాగానే ఉంటుంది. ఇష్టమైన వ్యక్తులను కలుస్తారు వారితో సమయం గడుపుటకు అవకాశం కలదు. అనారోగ్యం వలన సమస్యలు తప్పక పోవచ్చును సరైన జాగ్రత్తలు చేపట్టుట మంచిది. అనుకోని ఖర్చులు కలుగుటకు ఆస్కారం కలదు. 

 

 

 

మకర రాశి  :  వారం మొత్తంమీద బంధుమిత్రుల నుండి ఆశిచిన సహకారం రావడం మూలన సంతోషాన్ని కలిగి ఉంటారు. నూతన ప్రయత్నాల పట్ల స్పష్టమైన ఆలోచనలతో ముందుకు వెళ్ళుటకు అవకాశం ఉంది. ప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది వీటి విషయంలో మాత్రం చిన్న చిన్న జాగ్రత్తలు పాటించుట మేలు. ఉద్యోగంలో అధికారులకు అనుగుణంగా నడుచుకోండి లేకపోతే ఇబ్బందులు పొందుటకు అవకాశం ఉంది. విదీశీప్రయాణాలు కలిసి వస్తాయి వాటికోసం చేయు ప్రయత్నాలు ముందుకు వెళ్ళుటకు అవకాశం ఉంది. తండ్రి తరుపు వారితో విబేదాలు రాకుండా చూసుకోండి సర్దుబాటు అవసరం. ఉన్నతవిద్యాఅవకాశాలు కలిసి వస్తాయి. 

 

 

కుంభ రాశి :  వారం మొత్తంమీద చర్చాసంభందమైన విషయలకు సమయం ఇస్తారు. కుటుంబసభ్యులతో మాటపట్టింపులకు పోకండి ఓపికను కలిగి ఉండుట చేత మేలుజరుగుతుంది అవతలి వారి సూచనలు వినే ప్రయత్నం చేయండి. తలపెట్టిన పనులను విజయవంతంగా పూర్తిచేయుటకు అవకాశం కలదు కాకపోతే ఒత్తిడి ఉంటుంది. వ్యాపారసంభందమైన విషయాల్లో నూతన మార్పులు చోటుచేసుకొనే అవకాశం ఉంది సమయస్పూర్తి వలన సమస్యలను అధిగమించి విజయం పొందుతారు. దూరప్రదేశంలో నివసించే బంధువుల నుండి కొత్త కొత్త విషయాలను తెలుస్కోనే అవకాశం ఉంది. జీవితభాగస్వామితో కలిసి సమయాన్ని విందులకు కేటాయించే అవకాశం ఉంది. 

 

మీన రాశి :  వారం మొత్తంమీద బాగుంటుంది మనోస్థ్యైర్యంతో ముందుకు వెళ్ళుటకు అవకాశం ఉంది. నూతన ప్రయత్నాలకు సమయం ఇస్తారు గతకొంత కాలంగా ఎదురుచూస్తున్న ఫలితాలు పొందుతారు. కుటుంబసభ్యుల నుండి చక్కటి సహకారం లభించుట వలన మరింత ఉలాసంగా సమయాన్ని గడుపుతారు. ఉద్యోగంలో అధికారులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకొనే అవకాశం కలదు. సామజికకార్యక్రమాల విషయంలో స్పష్టమైన ఆలోచనలు కలిగి ఉంటారు. దూరప్రదేశప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది సమయం అధిక భాగం ఈవిధంగా ఉపయోగపడే అవకాశం ఉంది. వ్యాపారపరమైన విషయాల్లో మిత్రులనుండి నూతన సూచనలు పొందుతారు.   

మరిన్ని శీర్షికలు
navvandi navvinchandi