Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
mega star with lakshmi rai

ఈ సంచికలో >> సినిమా >>

రాకింగ్‌ 'ధృవ': టీజర్‌ సెన్సేషన్‌

rocking druva teaser sensation

ఎంతోకాలంగా అభిమానులు ఎదురుచూస్తోన్న రోజు రానే వచ్చింది. విజయదశమి కానుకగా తమ అభిమాన హీరో తన తాజా చిత్రం 'ధృవ' టీజర్‌ని తీసుకురావడంతో అభిమానుల ఆనందానికి హద్దే లేకుండా పోయింది. ఆ టీజర్‌ కూడా తమ అంచనలకు మించి ఉంటే, వారికి అంతకన్నా కావాల్సిందేముంది? లేట్‌ అయినా లేటెస్ట్‌గా వచ్చేశాడు రామ్‌చరణ్‌ 'ధృవ' టీజర్‌తో. తమిళ సినిమా 'తని ఒరువన్‌'కి రీమేక్‌ అయిన 'ధృవ' ఇంకా రిచ్‌గా రూపొందిందనే విషయం 'ధృవ' టీజర్‌ ద్వారా రామ్‌చరణ్‌ చెప్పకనే చెప్పాడు. గీతా ఆర్ట్స్‌ బ్యానర్‌లో నిర్మాత అల్లు అరవింద్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి స్టైలిష్‌ డైరెక్టర్‌ సురేందర్‌రెడ్డి దర్శకత్వం వహించారు. సినిమాకి కీలకం విలన్‌ పాత్ర. టీజర్‌లో మాత్రం విలన్‌ పాత్రని చూపించలేదు. ఆ పాత్రని ఇప్పుడే రివీల్‌ చేసేస్తే మజా ఉండదని బహుశా 'ధృవ' టీమ్‌ భావించి ఉండవచ్చు.

'రోజా', 'బొంబాయి' చిత్రాల ఫేం అరవింద్‌ స్వామి ఈ సినిమాలో నెగెటివ్‌ రోల్‌ చేస్తున్నాడు. రామ్‌చరణ్‌ సరసన 'బ్రూస్‌లీ' తర్వాత 'ధృవ'లో ముద్దుగుమ్మ, లక్కీ బ్యూటీ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. టీజర్‌లో రామ్‌చరణ్‌ చెప్పిన డైలాగులు, అతని స్టైలిష్‌ బాడీ లాంగ్వేజ్‌ ఇవన్నీ కలిసి 'ధృవ'పై అంచనాల్ని ఎక్కడికో తీసుకెళ్ళిపోయాయి. టీజర్‌ విడుదలైన కొద్ది గంటల్లోనే మిలియన్‌ వ్యూస్‌ దాటేసిందటే అభిమానులు ఈ టీజర్‌ కోసం ఎంత ఆతృతగా ఎదురుచూశారో అర్థమవుతుంది. డిసెంబర్‌లో సినిమాని విడుదల చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. 

మరిన్ని సినిమా కబుర్లు
mahesh muragadas speed   increase