Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
rajamouli appreciate goutami putra sathakarni

ఈ సంచికలో >> సినిమా >>

రష్మికి లక్‌ అలా కలిసొచ్చింది

rashmi so lucky

ఏ హీరోయిన్‌ అయినా గ్లామర్‌ ట్యాగ్‌ కోసం పరితపిస్తుంటుంది. బుల్లితెర బ్యూటీ రష్మికి ఆ ట్యాగ్‌ ఈజీగా దొరికేసింది. ఎంతో కష్టపడితే తప్ప దక్కని గ్లామర్‌ ట్యాగ్‌ తనకు ఈజీగా దక్కడం తన అదృష్టమేనని చెబుతుంది రష్మి గౌతమ్‌. తెలుగులో చాలా సినిమాల్లో రష్మి నటించింది ఇంతకు ముందు. అయితే అవేవీ ఆమెను హీరోయిన్‌ని చేయలేకపోయాయి. చిన్న చిన్న పాత్రలకే పరిమితమయ్యింది రష్మి అప్పట్లో. కానీ కష్టపడితే ఫలితం ఎప్పుడో ఒకప్పుడు దక్కుతుందనే నమ్మకంతో ప్రయత్నిస్తూనే వుంది.

ఆ ప్రయత్నం కలిసొచ్చి చిన్న సినిమాలకు పెద్ద హీరోయిన్‌గా గుర్తింపు దక్కించుకుంది. జబర్దస్త్‌ షోతోపాటు ఇంకొన్ని టీవీ షోస్‌ చేస్తూనే, సినిమాలకు టైమ్‌ కేటాయిస్తోంది రష్మి. అదీ ఇదీ మ్యానేజ్‌ చేసుకోవడం కష్టంగా లేదని, ఇష్టంతో ఏ పని చేసినా కష్టం అనిపించదని చెబుతూ, అందాల విందు అనేది సినీ పరిశ్రమలో చాలా చిన్న విషయమనీ, గ్లామరస్‌గా కనిపించడాన్ని తాను ఇష్టపడతానని వివరించింది. ఇప్పటికే పలు సినిమాల్లో హాట్‌ హాట్‌గా నటించిన రష్మి, తన గ్లామర్‌ని ప్రేక్షకులు ఎంజాయ్‌ చేస్తున్నంతవరకు వారిని అలరించేందుకు అలాగే నటిస్తాననీ, ఒక్క గ్లామర్‌తోనే ప్రేక్షకులు తనను మెచ్చుకోరనీ, తనలోని యాక్టింగ్‌ టాలెంట్‌ కూడా వారికి నచ్చడం వల్లే ఈ గుర్తింపు తనకు లభించిందని రష్మి అంటోంది. కీపిటప్‌ రష్మీ గౌతమ్‌. 

మరిన్ని సినిమా కబుర్లు
cheppukondi chooddam