Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
rocking druva teaser sensation

ఈ సంచికలో >> సినిమా >>

మహేష్‌ - మురుగదాస్‌ స్పీడ్‌ పెంచారు

mahesh muragadas speed   increase

సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు, విలక్షణ దర్శకుడు మురుగదాస్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న సినిమా శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటోంది. ఇంకా ఈ సినిమాకి టైటిల్‌ ఖరారు చేయలేదు. దీపావళి నాటికి టైటిల్‌ ఖరారు చేస్తారని సమాచారమ్‌. దీపావళికి తమిళ, తెలుగు సినిమాలకోసం టైటిల్‌తో కూడిన ఫస్ట్‌ లుక్‌ లేదా టీజర్‌ని విడుదల చేసే అవకాశాలున్నట్లు తెలియవస్తోంది. దీపావళి తెలుగువారికే కాదు, తమిళులకీ పెద్ద పండగే. ముఖ్యంగా సినిమా పరంగా దీపావళి, తమిళనాడుకి వెరీ వెరీ స్పెషల్‌. అందుకే ఆ రోజున మహేష్‌ - మురుగదాస్‌ సినిమాకి సంబంధించి ఓ ముఖ్యమైన ఈవెంట్‌ ప్లాన్‌ చేస్తున్నారట. ఒకేసారి తెలుగు, తమిళ భాషల్లో విడుదలయ్యేలా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. తెలుగు, తమిళ నేటివిటీకి తగ్గట్టుగా సన్నివేశాల్ని దర్శకుడు మురుగదాస్‌ ఇప్పటికే డిజైన్‌ చేసినట్లు తెలియవస్తోంది. దర్శకుడు, నటుడు కూడా అయిన ఎస్‌జె సూర్య ఈ సినిమాలో మహేష్‌కి ప్రతి నాయకుడిగా నటిస్తున్నాడు.

ఇందుకోసమే ఎస్‌జె సూర్య సిక్స్‌ ప్యాక్‌ కూడా చేశాడని సమాచారమ్‌. మహేష్‌ కూడా సిక్స్‌ ప్యాక్‌ తరహా లుక్‌లో కనిపిస్తాడట. మహేష్‌ సరసన రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. 'అభిమన్యుడు', 'వాస్కోడిగామా' తదితర టైటిల్స్‌ ప్రచారంలో ఉన్నాయి ఈ చిత్రానికి. 

మరిన్ని సినిమా కబుర్లు
rajamouli appreciate goutami putra sathakarni