Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
navvunaaluguyugaalu

ఈ సంచికలో >> శీర్షికలు >>

నవ్వండి - నవ్వించండి - కన్నవి /విన్నవి : జీడిగుంట నరసింహ మూర్తి

1 “మొన్న మా ఆవిడ కంట్లో నలక పడి రెండొందలు వదిలింది “ అన్నాడు ఒకడు 
“నువ్వే నయం. మా ఆవిడ కంట్లో పట్టు చీర పడి రెండువేలు వదిలింది “ అన్నాడు మిత్రుడు.
********************
2.  పరాత్పరం పార్కులో కూర్చుని స్వగతంలో తనకు తను ప్రశ్నించు కున్నాడు “ తను సమర్దుడినా కానా ?” అని. వెంటనే ఒక చెట్టు మీద నుండి ఒక కాకి “ కావ్” అంటూ అరిచింది.
********************
3. భార్యాభర్తలు ఇద్దరూ దెబ్బలాడుకున్నారు. భర్త కోపంగా మేడ మీద వెళ్లి కూర్చున్నాడు. భార్య మనసు మార్చుకునికాఫీ తెస్తుందేమో నని ఎదురు చూసి చివరకు తనే మెట్ల మీద నుండి క్రిందకు దిగుతున్నాడు భర్త.. “ముసలి ప్రాణం పాపం ఏడిపించడం ఎందుకు ?” అని భార్యే కాఫీ పుచ్చుకుని మెట్లు ఎక్కసాగింది. మెట్ల మధ్యలో ఉన్న భర్త “నేను మూర్ఖులకు దారి ఇవ్వను “ అన్నాడు కోపంగా.  అందుకు భార్య “ నేను ఇస్తాను “ అని సమాధానం చెప్పింది.
********************
4. పరమేశాన్ని డాక్టర్ అర్థరాత్రి ఒక టాబ్లెట్ వేసుకోమన్నాడు. కాని ఇంట్లో గడియారాల్లో బ్యాటరీలు అయిపోయి ఆగిపోయి ఉన్నాయి. సెల్ ఫోన్ కూడా అనుకోకుండా స్విచ్చాఫ్ అయిపోయింది. టైమెంతో తెలియడం లేదు. ఇంతలో అతనికి ఒక ఐడియా వచ్చింది. వెంటనే ఒక పాట అందుకున్నాడు. వెంటనే పక్కింటిలోంచి “ ఈ ముసలాయన అర్ధరాత్రి ఒంటి గంటైనా ఈ పాటలేమిటి?” అంటూ గట్టిగా అరిచాడు. “ హమ్మయ్య టైం తెలిసిందిలే “ అంటూ పరమేశం టాబ్లెట్ వేసుకున్నాడు
********************
5. “నువ్వు నాకు చేసిన సహాయానికి నీ ఋణం ఎలా తీర్చుకోవాలో తెలియడం లేదు “ అన్నాడు ఒక వ్యక్తి హాస్పిటల్లో ఉన్న పేషంట్ తో .“ ఏమీ అక్కర్లేదు. ముందు ఆక్సిజన్ పెట్టిన ట్యూబ్ మీద నుండి నీ కాలు తీసెయ్యి చాలు “ అన్నాడా పేషంట్ ఆయాస పడుతూ. 
********************
6. నిన్న రామారావు నిన్నూ మీ ఆవిడను తన డబ్బుతో సినిమాకి తీసుకు వెళ్ళాడుటగా?” అడిగాడు మిత్రుడిని ఒక వ్యక్తి. “ కాని వాడికయ్యింది వంద రూపాయలు సినిమా మధ్యలో వాడి కుటుంబానికి నేను పెట్టిన ఖర్చు నాలుగొందలు “ అంటూ ఏడుపు మొహం పెట్టాడు ఆ మిత్రుడు.
********************
7. “ మీరు ప్రస్తుతం ఎక్కడ ఉంటారు ?” అని అడిగాడు ఒక వ్యక్తిని ఒకాయన.“ తాలూకా ఆఫీస్లో “ అని చెప్పాడు ఆ వ్యక్తి. “ అక్కడేమిటి పని ?” అడిగాడు మళ్ళీ “ అక్కడ చెట్టుకింద వేరుసెనగ కాయలు అమ్ముకుంటూ వుంటాను “ అని బదులిచ్చాడు ఆ వ్యక్తి. 
********************
8. “ అన్ని సౌకర్యాలతో కొత్తగా హాస్పిటల్ తెరిచారుటగా మీ ఊళ్ళో ?” అడిగాడు మిత్రుడు ఒక వ్యక్తిని “ అవునవును . తీసుకు వెళ్ళడానికి సులువుగా ఉంటుందని స్మశానంకు దగ్గరగా తెరిచారులే !” అన్నాడు మిత్రుడు.
********************
9.  “పొద్దున్నే సూర్యోదయం చూస్తున్నావా బాబూ మంచి అలవాటే” అని మెచ్చుకున్నాడు ఒక విద్యార్ధిని ఒకాయన. “సూర్యోదయమా నా బొందా ?మా బడి తగలబడి పోతోంటే ఆనందంగా చూస్తున్నాను “ అన్నాడు ఆ విద్యార్ధి. 
********************
10. నాస్తికుడైన పుల్లయ్య చేత ఏదో విధంగా దేవుడి నామాన్ని పలికించాలని చూసాడు స్వామి. పక్కనే ఉన్న నారపీచును తీసుకుని కనీసం నారాయణ నామంలో“నారా” అని సగం పదాన్నైనా పలికించాలని ఆయన తాపత్రయం. “ దీన్నేమంటారు ?” అని అడిగాడు స్వామి.  “ పీచు “ అని సమాధానం ఇచ్చాడు పుల్లయ్య.
********************
11. ఒకావిడ పళ్ళ దుకాణంలోకి వెళ్లి “ డజను బత్తాకాయలు ఎంత? “ అని అడిగింది .షాపువాడు వందరూపాయలు అని బదులిచ్చాడు.  దానికామె “అమ్మో “ అంది గుండె మీద చెయ్యి వేసుకుని . పోనీ ఆపిల్ ఎంత అని మళ్ళీ అడిగింది.  “రెండు అమ్మోలు “ అంటూ సమాధానం ఇచ్చాడు షాపువాడు.

మరిన్ని శీర్షికలు
sapota tree