Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
navvandi navvinchandi

ఈ సంచికలో >> శీర్షికలు >>

సపోటా వృక్షం . - హైమాశ్రీనివాస్

sapota tree

‘ చికూ ‘ అనబడే - సపోటా వృక్షం .

 సక్కుబాయి ఎండలో నడిచి వచ్చేసరికి నిస్సత్తువగా కుర్చీలో వాలిపోడం చూసిన సరళ వెంటనే వంట గదిలోకెళ్ళి ఒక ప్లేట్ లో ఒలిచిన సపోటాలు నాల్గుతెచ్చి , “. ముందు ఇవితిను “అంటూ ఒక స్పూన్ చేతికిచ్చింది.సక్కుబాయ్ గబగబా వాటిని తినగానే ఎక్కడలేని శక్తీ వచ్చి, " వీటిలో ఏం వేశా వే నాకు ఇంత బలం వచ్చేసింది" అంది ఆశ్చర్యంగా.

" ఓసి  పిచ్చి ముఖమా! ఇవి మా పెరట్లోకాసిన సపోటాలే ! ఆర్గానికి పండ్లు. అసలు నీ వెప్పుడైనా ఇలా సపోటాలు తిన్నావా? వీటి లో ఉండే విటమిన్స్ నీకు తెల్సా? "అంది నవ్వుతూ. 

 "తల్లీ! నీవిప్పుడు నాకు క్లాస్ పీకుతావా? పీకు కాస్తంత కాఫీ పోసి మరీనీ  ! తప్పుతుందా! వినక చస్తానా? " కాదు  ముందుగా నీకు క్లాస్ పీకి ఆ తర్వాత ఇస్తానో జ్యూస్ " అంటూ మొదలెట్టింది. శరీరంలో నిస్సత్తువఆవహించినప్పుడు, బలహీనంగా ఉన్నప్పుడు , ఎక్కువగా పనిచేసి అలసి పోయి నపుడూ రెండు లేదా మూడు బాగా పండిన సపోటా పండ్లు  తింటే సరి. నిమిషాల్లో ఒంట్లోబలం పంపు కొట్టినట్లు వచ్చేస్తుంది. శరీరం ఎక్క డ లేని శక్తినీ మళ్లీ పుంజుకుంటుంది. మన పెరట్లో కాసిన రసాయనాలు లేని ఆర్గానిక్ సపోటా ఐ తే ఇహ చెప్పక్కర్లేదు. ఆ సపోటాలో సమృద్ధిగా లభించే’ ఫ్రక్టోస్ ‘శరీరం త్వరగా శక్తి పుంజుకునేలా చేస్తుంది. దీని గుజ్జులో అత్యధికంగా లభించే పీచు, పై పొట్టులో ఉండే 'కెరోటిన్లు' నేచర్ కాల్స్ సాఫీగా జరిగేలా సహకరిస్తాయి. దాంతో మల బద్ధకంతో మన జోలికిరాదు.  మల బధ్ధకం ఉన్నవారు సపోటా లను బాగా వాడాలి . సపోటా పండ్లలో మాంసకృత్తులు, కెరోటిన్లు, నియాసిన్, పిండి పదార్థాలు, ఇనుము, సి విటమిన్, కొవ్వు, పీచు, థయామిన్, క్యాల్షియం, రైబోఫ్లేవిన్లు, శక్తి, ఫ్రక్టోస్ షుగర్లు ఎక్కువగా లభిస్తాయి. ఈ పండ్లు పాలిఫినోలిక్ అనే శక్తి వంతమైన యాంటీ ఆక్సిడెంట్. యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ పారాసిటిక్ సుగుణా లూ ఎక్కువగా   ఉన్నాయి.  
సపోటా సతత హరితవృక్షం  . ఇది ఉష్ణ మండల ప్రాంతాల్లో బాగా  పెరుగుతుంది. భారత ఉపఖండం, మెక్సికో ప్రాంతాలలో ఎక్కువగా సపోటా తోటలను పండ్ల కోసం , వ్యాపార పంటలుగా  పెంచుతున్నారు. మొట్ట మొదటగా స్పానిష్ పాలకులు ఫిలిప్పీన్స్ లో ఈ పంటను ప్రారంభించారు.

సపోటా చెట్టు 30-40 మీటర్ల ఎత్తు వరకు పెరుగుతుంది. గాలికి తట్టుకోగల శ క్తి కలిగి ఉన్నది. చెట్టు బెరడు తెల్లగా జిగురు కారుతూ ఉంటుంది.  ఆకులు ఒకమాదిరి పచ్చగా, నునుపుగా , మందంగా ముదురాకు పచ్చగా ఉంటాయి.  తెల్ల చిన్న పుష్పాలు పూస్తాయి .సపోటా పండులోని గుజ్జు పసుపు, గోధుమ రంగుల మధ్యగా, కొంచెం పలుకులుగా ఉంటుంది. సపోటా చాలా తీయనిపండు . కాయగా ఉన్నపుడు గట్టిగా ఉంటుంది. పండగానే చాలా మెత్తగా, మృధువుగా  ఔతుంది. పచ్చి కాయలలో ’  సపోనిన్  ‘అనే పదార్ధం ఎక్కువగా ఉంటుంది.కాస్త జిడ్డుగా పాలతో ఉంటుంది, ఆపదార్ధం నాలుక్కి అతుక్కుని కా స్తంత  అనీజీగా ఉంటుంది.  ఇది తింటే నోరు ఎండుకు పోతుంది. గింజలు కొంచెం పొడవుగా , నల్లగా ఉంటాయి.  కాయలు కోసేప్పుడు తెల్లని, చిక్కని పాలుకారుతాయి,ఆ పాలు అమిత జిగటగా బంక లాగా ఉంటుంది. అందుకే సపోటాలు కోసేప్పుడు చాలా జాగ్రత్తగా కోయాలి,పాలు మనశరీరం పైన పడకుండా చూసుకోవాలి.చిక్కం కట్టిన పొడవా టి కర్రతోకానీ, చెట్టెక్కి జాగ్రత్తగా చేతికి పాలు తగలకుండా కానీ కొయ్యాలి.      

పూవులు సంవత్సరం పొడవునా ఉన్నాకూడా సపోటా చెట్లు సంవత్సరానికి రెండు మార్లు కాస్తాయి. ఈ కాయలు చెట్టున ఉన్నపుడు పండవు. బాగా పెద్దవయ్యాక ముదిరాయని తెల్సుకున్నాక  కోసి పండటానికి గడ్డిలోఉంచాలి. లేదా అట్టపెట్టేలో వేడి గాఉండేలా ఒక మూలనో ఒక గదిలోనో ఉంచితే 3,4 రోజులకు పండుతాయి. మన దేశంలో దీన్ని 'చిక్కూ' లేక 'సపోటా' అంటారు. బెంగాల్ ప్రాంతంలో 'సొఫెడా' అనీ దక్షిణాసియా,పాకిస్తాన్లలో 'చికో' అని, ఫిలిప్పీన్స్లో 'చికో' అనీ, ఇండొనేషియాలో 'సవో'  అని, మలేషియాలో 'చికు' అని అంటారు. ఇలా ఇంక అనేక దేసాల్లో ఎలాపిలిచినా దీనిలోని విటమిస్ మాత్రం అందరికీ ఒకటే విధంగా అందిస్తుంది సపోటా.
మన రాష్ట్రంలో ప్రజలు పాల సపోటా పండ్లను ఇష్టంగా తింటారు. మహారాష్ట్రలో ‘ కాలి పత్తి ‘రకాన్ని, కర్ణాటకలో’ క్రికెట్ బాల్’ రకాల్ని ఇష్టంగా తింటారు. ‘పాల ‘రకంలో దిగుబడి ఎక్కువ. పండు కోలగా, చిన్నది ఉంన్నా తీపిమాత్రం ఎక్కువ. కమ్మగా గుజ్జు వెన్నలా ఉంటుంది. పలచని తోలుతో తో కండ మృదువుగా ఉంటుంది. ఐతే ఈపండ్లు వ్యాపారపంటగా సొమ్ము చేసు కోను పనికిరావు, పండగానే ఆరోజుకు ఆరోజు స్వంత మార్కెట్లో అమ్ముకోడమే తప్ప  నిల్వఉంచి , రవాణాకు, ఎగుమతికి పనికిరావు. ఎందుకంటే సన్నని తోలు త్వరగా మెత్తబడే స్వభావం వీటిది.’ క్రికెట్ బాల్ ‘ రకం సపోటా పండ్లు గుండ్రంగా, పెద్దగా ఉంటాయి. ఒక మోస్తరు తీపి కలిగి ఉంటాయి.  సముద్ర మట్టం నుండి వెయ్యి అడుగుల ఎత్తు వరకూ ఉన్న ప్రాంతా ల్లోనూ, పొడి వాతావరణంలోనూ దిగుబడి బాగా వస్తుంది. కాలి పత్తి రకం పండ్లు కోలగా, మధ్యస్త పరిమాణంలో ఉంటాయి. తోలు మందంగా, కండ తీయగా ఉంటుంది. ఈ రకం పండ్లు నిల్వచేసి ,ఇతర ప్రాంతాలకు ఎగుమతిచేయను  అనుకూలంగా ఉంటాయి. ఐతే వీటి దిగుబడి తక్కువగా ఉంటుంది . ఇవి కాక ద్వార పూడి, కీర్తి బర్తి, పీకేయం-ఇంకాకొని  రకాలు రవాణాకు  అనువైనవే.  

సపోటా మనశరీర పోషణకూ, ఆరోగ్య రక్షణకూ బాగాపనిచేస్తుంది ఇవిహాని చేసే సూక్ష్మక్రిములను శరీరం లోకి ప్రవేశించ కుండా అడ్డుకుంటాయి.వీటిలోని  పోషక  విషయాలగురించీ చుస్తే విటమిన్ 'A' కంటి చూపును కాపాడుతుంది. విటమిన్ 'C 'శరీరంలోని హానికర ఫ్రీరాడికల్సు ను తొలగిస్తుంది. తాజా పండు లోని పొటాషియం, రాగి, ఇనుము, లాంటి పోషకాలు.. ఫోలేట్, నియాసిన్, పాంథోయినిక్ ఆమ్లాలు జీవ క్రియసరిగా జరగను స హకరిస్తాయి. అందువల్ల ఎదిగే పిల్లలకు సపోటా పండ్లను బాగా లభ్యమయ్యే కాలం లో తప్పనిసరిగా బలవంతంగా నైనాసరే తినిపించాలి.  ఆరోగ్యంతోపాటు పిల్లలు మంచి బరువు పెరుగు తారు. తక్కువ బరువున్న వారు తమ బరువును సరిగా పెంచుకోను సపోటాను అవసరమైన మోతాదు లో తీసుకుంటే బరువు పెరిగే అవకాశం ఉంది.గర్భిణులు, వృద్ధులు, రక్తహీనతతో బాధపడేవారు సపోటాలను తగుపాళ్లలో తింటే  రక్తహీనత క్రమబద్ధ మవుతుంది. బాలింతలు సపోటాలను తింటూఉంటే  పసిపిలల్లకు తల్లిపాలు పుష్కళంగా వృద్ధి చెందుతాయి. తియ్యగా మెత్తగా , రుచిగా ఉన్నాయి కదానీ, బాగా లభ్యమవుతున్నాయి కదా నీ సపోటా పండ్లను అదే పనిగా తినరాదు. అలా తింటే అజీర్ణంతోపాటు పొట్ట ఉబ్బరం కూడా వస్తుంది. గుండె జబ్బు తో బాధ పడేవారు మాత్రం రోజుకు ఒక పండును కంటే ఎక్కువ తినకపోడం ఉత్తమం. ఒబేసిటీ, మధుమేహం ఉన్నవారు  వైద్య సలహా మేరకే ఈ పండు తినాలి. సపోటా తినటం వల్ల చర్మం సౌందర్యం మెరుగవుతుంది. తాజాపండ్లను ప్యాక్ రూపంలో ముఖానికి వేసు కోడం కాక తినడం వల్ల విటమిన్లు చర్మ సౌందర్యాన్ని మెరుగుపరుస్తాయి. ముఖ్యంగా విటమిన్- 'ఎ', 'సి' లు చర్మానికి కొత్త నిగారింపునిస్తాయి. అలాగే సపోటా గింజలను మెత్తగా నూరి ముద్దలా చేసి, దానికి కొంచెం ఆముదం నూనె కలిపి తలకు రాచుకుని, మర్నాడు తలస్నానం చేస్తే శిరోజాలు మృదువుగా వస్తాయి. చుండ్రు సమస్య ఉండదు.

‘ సపోటా' అంటే మన ఆరోగ్యానికి సపోర్టర్ అన్నమాట.సపోటా  మరో పేరు ‘చికూ' అని అందరికీ  తెలియకపోవచ్చు.ఈ పండులో విటమిన్లు, మినరల్స్, టన్నిన్ లు కావల్సిన న్ని ఉన్నాయి. సపోటాపండు లోమనకు  23 ఆరోగ్యకర ప్రయోజ నాలున్నాయి.వ్యాధి నిరోధక శక్తిని పెంచు తుంది.

సాధారణంగా 170 గ్రా , సపోటా పండులో లబించే ఆహార పోషక విలువలు ఇలాఉంటాయి .శక్తి -  141 క్యాలరీలు, నీరు 132.60గ్రా, పిండిపదార్ధము -33.93గ్రా మాంసకృత్తులు --అంటే ప్రోటీన్స్   0.75గ్రా, పీచుపదార్ధం -ఫైబర్ : 9.01 గ్రా మొత్తం కొవ్వుపదార్ధము  1.87గ్రా, సాచ్యురేటెడ్ కొవ్వు -0.33గ్రా .

సపోటాలో లభించే ఖనిజ లవణాలు - కాల్సియం - 35.70mg , ఐరన్‌- 1.36mg ,మెగ్నీషియం - 20.40mg , భాస్వరం  - 20.40mg ,పొటాసియం-- 328.10mg, సోడియం-- 20.40mg ,జింక్ - 0.17mg ,కాఫర్ -- 0.15mg , సెలీనియం - 1.02 mcg.
ఇహ విటమిన్ల గురించీ ఆలోచిస్తే   - విటమిన్‌ - A: 102.00IU , థయమిన్‌- B1: 0.00mg రైబోఫ్లెవిన్‌- B2 : 0.03mg , నియాసిన్‌- B3 : 0.34mg ,పాంథోనిక్ యాసిడ్-  B5 : 0.43mg ,విటమిన్‌ ' బి 6' - 0.06mg , ఫోలిక్ యాసిడ్-  B9 : 23.80mcg , సయనోకొబాలమైన్‌- విటమిన్‌ B12: 0.00mcg , విటమిన్‌  C: 24.99mg ,  ఇంకా అనేక మైన  ఆరోగ్య రక్షకాలు సపోటాలో ఉన్నాయంటే మనం నమ్మలేం  , కా నీ  ఇది యధార్దం .   

సపోటాలో పీచు పదార్థం అధికంగా ఉండటంతో జీర్ణక్రియ సక్రమంగా జరుగుతుంది. అధికంగా ప్రోటీన్లు, ఐరన్ శక్తి ఉండటాంవల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. సపోటా శరీరానికి వెంటనే  శక్తినిచ్చే గ్లూకోస్ కలిగిం ఉండటం వల్ల తిన్నవెంటనే కావల్సిన బలం కలుగుతుంది.  ముఖ్యంగా  క్రీడాకారులకు అవసరమైన  శక్తి  సపోటా పండు తినడం వల్ల లభిస్తుంది. సపోటా లోని యాంటీ-ఆక్సిడెంట్లు, పీచు, పోషకాలు, విటమిన్ ఆ ఊపిరితిత్తులు, నోటి కాన్సర్ నుండి   రక్షణకలిగిస్తాయి. సపోటా పండు ఎముకల గట్టితనానికి, బాగా సహాయపడుతుంది.  పిండిపదార్ధాలు, అవసరమైన పోషకాలు సపోటాలో అధిక మోతాదులో ఉండడం వల్ల గర్భవతులకు, పాలిచ్చే తల్లులకు చాలా ఉపయోగకరం. ఇది నీరసాన్ని, గర్భం సమయంలో వచ్చే వికారం, మైకం వంటి ఇతర లక్షణాలను తగ్గించడానికి , ఒత్తిడిని తగ్గించడానికి కూడా సహాయపడుతుంది.

"తల్లీ! పీరియడైంది, ఇహ ఆపి  ఏదైనా కాస్త వేడి వేడి ద్రవం నాముఖాన పొయ్యి , మీ లెక్చరర్స్ గంటమ్రోగితే కానీ పాఠం ఆపరు. "అంటూ అక్కడున్న ప్లేట్ ను చెంచాతో గణగణామ్రోగించి, తలపట్టుకున్న శకుంతలను చూస్తూ, వంటగదిలోకెళ్ళి ఓ రెండు గ్లాసులను ఒకప్లేట్ లో పట్టుకువచ్చింది సరళ. ఆగ్లాస్ తీసుకుని "ఏంటే ! సరళా! నేను వేడి ద్రవం అడిగితే నీవు చల్లని ద్రవం ఇచ్చావు?" అంది నిరాశగా. తనగ్లాస్ లో ద్రవం ఓమారు సిప్ చేసి" త్రాగి చూడవే సక్కూ ! ఎప్పుడూ కాఫీలూ టీలూత్రాగి వంటికి తెచ్చుకోకు ,చెప్పిందతా మర్చిపోకు ,ఇది సపోటా మజ్జిగ."అంది చిరునవ్వుతో.

"తల్లీ! నీకీ రోజు సపోటా దయ్యం పూనినట్లుంది , తప్పుతుందా!"అంటూ త్రాగి," ఇంత బావుందేంటే , తలనొప్పి మటుమాయమైంది."అని ఆశ్చర్యంగా చూస్తున్న శకుంతలతో" ఏమనుకున్నావే సపోటా మన ఆరోగ్యానికి సపోర్టర్ " అంటున్న సరళను ప్రేమగా హత్తుకుంది శకుంతల."ఎంతమంచి విషయాలు చెప్పావే!"అంటూ.  

మరిన్ని శీర్షికలు
adsrshtam story review