Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
sapota tree

ఈ సంచికలో >> శీర్షికలు >>

మునిమాణిక్యం నరసింహారావుగారి "అదృష్టము" సమీక్ష - అంబడిపూడి శ్యాం సుందర రావు

adsrshtam story review

మునిమాణిక్యం నరసింహారావుగారు బహుముఖ ప్రజ్ఞులు , మితభాషి,అయినా మాటకలిస్తే అమితముగా మాట్లాడే సంభాషణా చతురులు. అయన నవలలు,కధలు,పద్యాలు,నాటకాలు వ్రాసారు కానీ కాంతం కదలముందు అవన్నీ దిగదుడుపే వీరికి అత్యంత కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టినవి అయన వ్రాసిన కాంతం కధలే.  కారణము వాటిల్లో హాస్య రసము గుప్పించటమే. ఈ రోజుకు మనకు హాస్య రచన అనగానే మొదట గుర్తుకు వచ్చేది అయన కాంతం కధలే. ఈ కధల ద్వారా నరసింహారావు గారు కాంతం కథకుడుగా అవతరించి కాంతం మొగుడుగా  స్థిరపడటం జరిగింది. అయన వ్రాసినవి సంఖ్యలో గాని, వాసిలో గాని తక్కువేమి కాదు. ఆయనను తెలుగు పాఠకులు,విమర్శకులు హాస్య రచయితగానే పరిగణించారు. హాస్యము రాయటం ఏంతో,  కష్టము రాసి మెప్పించటము మరీ కష్టము మునిమాణిక్యం  రచనలు అధిక భాగము ప్రధానముగా ఆత్మకధ సదృశ్యమయినవి . అంటే తన వాస్తవానుభవాలను, మానసిక అనుభూతులను కధలుగా, సాలుగా,న్బవాలాలుగా  మలచారు నిండైన గృహస్థ జీవితాన్ని అనుభవించేటందుకు,జీవితము  పట్ల  సమరస భావాన్ని పెంచుకొనేందుకు అవసరమైన మనోధైర్యాన్ని పాఠకులలో పెంచేందుకు తన రచనల ద్వారా కృషిచేసిన వ్యక్తి , అని ప్రముఖలచేత ప్రశంసలు పొందిన వ్యక్తి. మునిమాణిక్యం నరసింహారావుగారు మునిమాణిక్యం గారు తన కధలలో తన వృత్తిని ప్రవృత్తిని జోడించి రంగరించి,తన జీవితాన్ని,ఉపాధ్యాయవృత్తిని ,మధ్య తరగతి కుటుంబాల పరిస్థితిని కదా వస్తువుగా తీసుకొని తన భార్యామణి కాంతాన్ని హీరోయిన్ గా జెసి అతి సున్నితమైన చిన్న విషయాలనుకూడా  ఎంతో ఉదాత్తముగా హాస్యాన్ని జోడిస్తూ అమృత గుళికలు లాంటి కదలను  తెలుగు
పాఠకులకు శాశ్వతమైన అపురూప కానుకలుగా అందించారు.ఈ సందర్భముగా మనము కొంచము కాంతము గురించి కూడాకొంత  తెలుసుకోవాలి.  

మునిమాణిక్యం గారు  హీరోయిన్ కాంతం ను  అణుకువ,మక్కువ,గడుసుతనం,చలాకీతనం,ఓర్పు,నేర్పు,అన్నీ మేళవించిన ఒక ముగ్ద మనోహరమైన ఇల్లాలిగా,పిల్లల ఆలనా పాలనా కోసము అనుక్షణముఅరాటపడే భాద్యత గల తల్లిగా కాంతం ను  చిరంజీవిని చేశారు. ప్రస్తుతము నరసింహారావు గారి  "అదృష్టము "అనే చిన్న కథగురించి ముచ్చటించుకుందాము.ఈ కధ 1928లో ఆంధ్ర భారతి పత్రికలో ప్రచురించబడింది. కదా ప్రారంభములో మన హీరోగారు (అంటే రచయిత)పాత డైయిరీలు ముందేసుకుని తిరగేస్తూ ఉంటాడు. భార్యామణి కాంతం " కాఫీ అయినా త్రాగకుండా ప్రొద్దుటే ఈ పాత పుస్తకాలు ,తిరగేస్తున్నారు, పుణ్యమా పురుషార్థమా నాలుగు రాళ్లు సంపాదించే మార్గమేమి ఆలోచించకుండా" అని నిష్ఠురమాడి వెళుతుంది,పాత డయిరీలు తిరగేస్తూ, పాత స్నేహితులు పాత అనుభూతులను గుర్తుకు తెచ్చుకొని నవ్వుకున్నాడు మన హీరోగారు డయిరీలో ఆఖరి పేజీ లో తాను వ్రాసుకున్న అడ్రస్సు దగ్గర ఆగిపోతాడు. 104,సంభంద మొదలియార్ వీధి తిరువళక్కేణి అని వ్రాసి ఎర్ర సిరాతో అండర్లైన్ చేయబడి ఉంది. ఇంకా అయన ఆలోచనలు ఆ అడ్రస్సు ఎవరిదీ ఏ సందర్భములో నోట్ చేసుకున్నానా అని జ్ఞాపకము చేసుకోవటానికి ప్రయత్నాలు మొదలుపెడతాడు. ఇంక ఉహలు మదిలో ప్రారంభమవుతాయి .బహుశా  ఎవరో ప్రియ స్నేహితుడు కలిసినప్పుడుఅడ్రస్సు ఇచ్చి అప్పుడప్పుడు కలుస్తుండమని చెప్పి ఉంటాడు మరచిపోయి అతనికి మనస్సుకు కష్టము కలిగించి ఉంటాను ,నాకోసము ఎన్నాళ్లు ఎదురు చూసాడో వీలయితే ఈ అడ్రస్సు ప్రకారము అతన్ని కలవాలి అనుకున్నాడు. ఇంకో ఆలోచన వచ్చింది బహుశా ఏ రైలు లోనో ఏ నాటక ప్రదర్శన వద్దో పరిచయము అయినా ఒక సుకుమారి తన అడ్రస్సు ఇచ్చి ఉంటుంది అన్న తలంపుతో అప్రయత్నముగా శరీరము పులకరించి పెదవులపైనా చిరునవ్వు  వెలసింది.. నాలిక కొరుక్కుని జరిగిన పొరపాటుకు ఇప్పుడు చింతించటము  మొదలు పెట్టాడు ఎలాగైనా కలవాలి అని నిశ్చయించుకున్నాడు.

మదిలో మరో ఆలోచన మెదిలింది అదియేమిటి అంటే బహశా ఆ అడ్రస్సు ఎవరైనా పబ్లిషర్ ది  అయిఉండవచ్చు ఆ పబ్లిషర్  ఏదైనా పనియిస్తానని ఈ అడ్రస్సులో కలవమని చెప్పిఉంటాడు ఇలాంటి  ముఖ్య విషయాన్ని మరచిపోయాను ఏ పుస్తకమో ,కధో పబ్లిషర్ కు ఇచ్చివుంటే  డబ్బులు వచ్చేవి ఆ డబ్బులతో కాంతానికి ఒక సరుకో, పిల్లకు ఒక నగో చేయించేవాడిని ఈ మతిమరుపు వల్ల నష్టపోయినాను అని కాసేపు బాధపడ్డాడు. ఆలోచించిన కొద్దీ ఆందోళన ఎక్కువ అయిందే గాని ఆ అడ్రస్సు ఎవరిదీ అన్నవిషయము గుర్తుకు రాలేదు. నిజము  ఏమిటో తెలుసుకోవాలన్న ఉత్సాహము రాను రాను ఎక్కువ అవుతుంది. ఈ మాహాపట్టణము మద్రాసులో ఇల్లు ఎక్కడో, ఆ ఇంట్లో  ఎవరు ఉంటారో తెలుసుకోవాలంటే అపరాధ పరిశోధన నవలను నడపాలి అని నిశ్చయించుకున్నాడు మన హీరోగారు. అపరాధ పరిశోధన అనే భావన వచ్చేటప్పటికి కొద్దిగా భయముతో శరీరము వణికింది. తీరా ఇంటి అడ్రస్సు వెతుక్కుని వెళితే అక్కడ దయ్యాలు ఉండవచ్చు లేదా ధన రాసులు దొరకవచ్చు ఈ ఆలోచనలతో భోజనముచేసి తాంబూలము వేసుకున్నభార్యతో మాట్లాడటానికి మనస్కరించలేదు. ఆలోచనలలో అల్లావుద్దీన్ కధలు,మాంటి క్రిస్టో కధలు గుర్తుకు రావటము మొదలుపెట్టాయి. తనకు ఆ అడ్రస్సు ఇంట్లో వజ్రము దొరికినట్లు భారీ ఎవరితో నో చెపుతున్నట్లు లీలగా వినిపిస్తున్నట్లు అనిపించింది.

అక్కడికి  వెళితే ఒక పండు ముసలమ్మ తన 
దూరపు బంధువు తనకోసము ఎదురుచూస్తూ అవిడ అష్టి తాలూకు తాళము చెవులు ఇచ్చి ప్రాణము విడిచినట్లు కల కూడా వచ్చింది. మర్నాడు ఉదయము కాలకృత్యాలు తీర్చుకొని అడ్రస్సు ప్రకారము ఆ ఇంటికి వెళ్ళాడు. తన కలల ,ఆలోచనల ప్రకారము ఆ ఇంట్లో ధనప్రాప్తియా, మిత్ర దర్శనమా ,లేదా ఒక లావణ్య రాశి దర్శనమా  ఏమి జరగబోతున్నాదో అన్న ఉత్కంఠత తో లోపలి పోగా నౌకరు వచ్చి కుర్చీలో కూర్చోమని యజమానికి చెప్పటానికి లోపలికి వెళ్ళాడు పది నిముషాలలో ఆ యజమాని వచ్చాడు అయన మన హీరో గారికి పరిచితుడే . ప్రక్కన కూర్చుని కుసలా ప్రశ్నలు అయినాక, " ఏమోయి , ఎన్ని రోజులకు వచ్చావయ్యా .మూడు రోజుల్లో తిరిగి ఇస్తానని  ముప్పై రూపాయలు తీసుకున్నావు అడ్రస్సు కూడా వ్రాసుకున్నావు ఇప్పుడా రావటము పోనిలే ఇప్పటికైనా గుర్తు వచ్చింది డబ్బులు తెచ్చావా? ఆట్లా తెల్ల పోతావే  డబ్బులు తీసుకు రాలేదా? ఏమి ఫరవాలేదు మా నౌకరు ను నీ వెంబడి  మీఇంటికి పంపుతాను అతనికి పైకము ఇచ్చి పంపు " అని మిత్రుడు  నిష్ఠురముగా   అసలు విషయము చెప్పాడు అది విన్న మన హీరోగారు షాక్ అయినాడు జేబులో డబ్బులు లేవు ఇంటి దగ్గర లేవు చెపితే మిత్రుడు వినటములేదు చివరకు జేబులోంచి కాలము కాగితము తీసుకొని ఆ ముప్పై  నోటు వ్రాసి మిత్రుడి చేతిలో పెట్టి నిరాశతో ఇంటి దారి పట్టాడు .ఈవిధముగా మన హీరో గారికి సిరి పెట్టకపోయినా ఈ చీడ అంటింది. ఇంటికి వచ్చి తన కోసము భార్యామణి సిద్ధంగా ఉంచిన కాఫీ త్రాగుతూ జరిగిన విషయాన్ని తలచుకొని కాసేపు నవ్వుకున్నాడు. 

మరిన్ని శీర్షికలు
weekly horoscope21st october to 27th october