Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
cine churaka

ఈ సంచికలో >> సినిమా >>

పూరీ జగన్నాథ్ తో ముఖాముఖీ

interview with puri jagannaath

ర‌వితేజ న‌న్ను సినిమాలు మానేయ్య‌మ‌న్నాడు - పూరి జ‌గన్నాథ్

పూరి గురించి చెప్పుకోవడానికి చాలా ఉంటాయి.. ఆయ‌నా బోల్డ‌న్ని విష‌యాలు చెబుతాడు.
సినిమా.. లైఫ్
పుస్త‌కాలు... సంతోషం

ట్రెండ్‌.. బ్యాంకాక్ బీచ్‌

మ‌నుషులు.. ప‌క్షులు.. ఇలా ఎన్నెన్నో. పూరి సినిమాలే కాదు.. అత‌ని మాట‌లూ భ‌లే కిక్ ఇస్తాయి. పూరి లైఫ్ చూస్తే, అత‌ని గురించి తెలుసుకొంటే ఇంకా కిక్ వ‌స్తుంది. ప్ర‌స్తుతం 'ఇజం' సినిమా రిజ‌ల్ట్ గురించి కాస్త టెన్ష‌న్‌లో ఉన్నారాయ‌న‌. ఈ సినిమా ఈరోజే (21 అక్టోబ‌రు) ముందుకొస్తోంది. ఈ సంద‌ర్భంగా పూరితో చేసిన చిట్‌.. చాట్‌.

* హాయ్ సార్‌..
- హాయ్‌..

* ఇజం.. ఇందులో ఏముంది?
- ఓ నిజం ఉంది. జ‌ర్న‌లిజం.. పేట్రియాట్రిజం క‌లిస్తే మా సినిమా. దేశ‌భ‌క్తి ఉన్న ఓ పాత్రికేయుడి క‌థ‌.

*  కెమెరామెన్ గంగ‌తో రాంబాబులో కూడా ఇదే చెప్పారేమో?
- అదేం కాదు... ఆ క‌థ‌కీ ఈ క‌థ‌కీ సంబంధంఉండ‌దు. రాంబాబు.. ఆశ‌యం వేరు, ఈ సినిమాలో స‌త్య మార్తాండ్ ల‌క్ష్యం వేరు. ప్ర‌తీ పాత్రికేయుడికీ త‌న‌కంటూ ఓ ల‌క్ష్యం, దృక్ప‌థం ఉంటాయి. దేనిక‌దే వేరుగా చూడాలి.

*  ఇజం క‌థ క‌ల్యాణ్ రామ్ కోస‌మే రాశారా?
- లేదు.. ఓ ప‌దేళ్ల క్రితం వచ్చిన ఆలోచ‌న‌. మ‌ధ్య‌లో కొంత‌మందికి చెప్పా.. వాళ్ల‌కు న‌చ్చ‌లేదు.. (నవ్వుతూ)

* మ‌రి క‌ల్యాణ్ రామ్‌కి ఎలా న‌చ్చింది?
- ఏ క‌థ‌లో అయినా.. కాలానికి త‌గ్గ‌ట్టు మార్పులూ చేర్పులూ చేసుకొంటూ వెళ్తుంటాం క‌దా, అలా చేసిన మార్పులు క‌ల్యాణ్‌రామ్‌కి న‌చ్చాయి. పైగా ఇలాంటి పాత్ర పోషించాలంటే.,.. ఆ న‌టుడి క‌ళ్ల‌లో నిజాయ‌తీ క‌నిపించాలి. అది క‌ల్యాణ్ రామ్‌లో ఉంది. 

* ఈ సినిమా కోసం బాగా క‌ష్ట‌పెట్టిన‌ట్టున్నారు..
- (న‌వ్వుతూ) మామూలుగా కాదు. ఈ సినిమా కోస‌మే సిక్స్ ప్యాక్ చేశాడు. ప్ర‌తీ ఉద్యోగీ ఫిట్‌గా ఉంటాల‌నుకొంటాడు. పాత్రికేయుడు మాత్రం ఎందుకు ఉండ‌కూడ‌దు. త‌న ఇంటిన్సిటీ ఆలోచ‌న‌ల్లోనే కాదు, బాడీలోనూ క‌నిపించాల‌నిపించింది. దానికి త‌గ్గ‌ట్టే క‌ల్యాణ్ రామ్ బాగా క‌ష్ట‌ప‌డ్డాడు. ద్వితీయార్థంలో త‌న న‌ట‌న వేరే స్థాయిలో ఉంటుంది. ఆంధ్ర‌, తెలంగాణ ప్ర‌భుత్వాలు అవార్డులు ప్ర‌క‌టిస్తే.. అన్నీ త‌న‌కు వెళ్లిపోతాయి. 

* సాధార‌ణంగా ఇలాంటి సినిమాల్లో స్పీచులు ఎక్కువ‌గా వినిపిస్తుంటాయి...
- ఈ సినిమాలో మాత్రం స్పీచులు ఉండ‌వు. కేవ‌లం ఐడియాల‌జీ మాత్ర‌మే ఉంటుంది. అవినీతిపై ఇది వ‌ర‌కు చాలా సినిమాలొచ్చాయి.. అవి వేరు.. ఇది వేరు. కేవ‌లం స్పీచ్‌లే చూపించ‌డం లేదు. స‌మ‌స్య చూపిస్తూ.... దానికి ప‌రిష్కార మార్గం కూడా చెబుతున్నాం. బ‌హుశా... ఇలాంటి క్లైమాక్స్ ఇప్ప‌టి వ‌ర‌కూ ఏ సినిమాలోనూ చూసుండ‌రు.

* మ‌హేష్‌తో సినిమా అన్నారు.. అదెప్పుడు ఉండొచ్చు..
- మ‌హేష్ కోసం జ‌న‌గ‌ణ‌మ‌న క‌థ సిద్దం చేశా. అది ఆయ‌న‌కు బాగా న‌చ్చింది. కానీ.. ఇప్పుడు  ట‌చ్‌లో లేరు. మ‌ళ్లీ ఆయ‌న పిలిపిస్తే.. త‌ప్ప‌కుండా చేస్తా.

* త‌దుప‌రి ఎన్టీఆర్‌తోనేనా.
- అనుకొంటున్నా.. ఇంకా క్లారిటీ రాలేదు.

* ర‌వితేజ‌తో సినిమా ఎప్పుడు?
- అర్జెంటుగా ర‌వితేజ‌తో ఓ సినిమా చేయాల‌ని ఉంది. కానీ... త‌ను సినిమా చేసే మూడ్‌లో లేడు. ప్ర‌పంచం అంతా చుట్టి రావాల‌నుకొంటున్నాడు. ఆమాటే మొన్న నాతోనూ అన్నాడు. పూరి... సినిమాలు మానేయ్‌.. ప్ర‌పంచం చుట్టొద్దామ‌ని స‌ల‌హా ఇచ్చాడు. (నవ్వుతూ)

* మ‌ళ్లీ బాలీవుడ్ వైపు చూళ్లేదు.. కార‌ణం ఏమిటి?
- బాలీవుడ్ సినిమా అంటే పెద్ద క‌స‌ర‌త్తు ఉంటుంది. క‌నీసం యేడాది పాటు దానిపైనే దృష్టి పెట్టాలి. అయితే మ‌ధ్య‌లో టెంప‌ర్ రీమేక్ చేద్దామ‌న్న ఆలోచ‌న వ‌చ్చింది. అభిషేక్ బ‌చ్చ‌న్‌కి సినిమా బాగా న‌చ్చింది. అయితే ఎన్టీఆర్ స్థాయిలో అన్ని వేరియేష‌న్స్ చూపించ‌లేనేమో అన్నాడు. దాంతో ఆ ప్రాజెక్టు ఆగింది. 

* ఇజం కోసం పాట రాశారు.. పాడారు.. ఏమిటీ కొత్త యాంగిల్స్.
- ఇదంతా నా క్రెడిట్ కాదు.. అనూప్‌దే. నాతో పాట రాయించిందీ.. పాడించిందీ త‌నే. 

* చివ‌రిగా ఇజం కోసం ఏం చెబుతారు?
- నిజాయ‌తీతో చేసిన ప్ర‌య‌త్నం ఇది. జ‌ర్న‌లిజాన్ని మ‌రో లెవిల్‌లో చూపిస్తున్నాం. ప్ర‌తీ జ‌ర్న‌లిస్టుకీ ఈసినిమా న‌చ్చుతుంది. ఈ సినిమా వాళ్ల‌కు అంకితం చేశాను కూడా. ఇందులో ఉన్న కంటెంట్‌ని ప్ర‌తీ భార‌తీయుడూ ఇష్ట‌ప‌డ‌తాడు. సో.. త‌ప్ప‌కుండా చూడండి.

* ఓకే.. ఆల్ ద బెస్ట్‌
- థ్యాంక్యూ..


- కాత్యాయని

-

మరిన్ని సినిమా కబుర్లు
druva audio function chief guest katamarayudu