Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Gas and Bloating, Causes and Ayurvedic Treatments in Telugu by Dr. Murali Manohar Chirumamilla, M.D

ఈ సంచికలో >> శీర్షికలు >>

విభీషణుడు మంచివాడా..చెడ్డవాడా..? - సిరాశ్రీ

 

1. విభీషణుడు అన్న రావణుడి మంచికోరి రాముడితో పెట్టుకోవద్దన్నాడు. రావణుడు వినకుండా ఇంకా రెచ్చిపోయి యుద్ధానికి దిగాడు, చచ్చాడు. అన్నయ్య తన మాట వినుంటే విభీషణుడు సంతోషించేవాడు.

2. లంక విభీషణుడి సొంతం కావాలంటే రావణుడు,అతని సంతానం మొత్తం పోవాలి. అది జరగాలంటే పెద్ద యుద్ధం రావాలి. ఎలాగో సీతని ఎత్తుకొచ్చి రాముడితో పెట్టుకున్నాడు రావణుడు. "నువ్వు రాముడ్ని ఏమీ చేయలేవు" అంటే రావణుడి ఇగో దెబ్బతింటుంది. దాంతో రెచ్చిపోయి యుద్ధానికి దిగుతాడు. సరిగ్గా రావణుడు పోయే టైం లో పార్టీ మారిపోతే లంక తనదే. అందుకే రెచ్చగొట్టేలా ఉపదేశం చేసాడు. ఒకవేళ రావణుడు తన మాట విని రాముడితో యుద్ధానికి దిగకపోయుంటే విభీషణుడు చాలా బాధపడేవాడు.

పై రెండిట్లో ఏది కరెక్ట్?

మరిన్ని శీర్షికలు
Senagala Kura -