Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
movie review

ఈ సంచికలో >> సినిమా >>

రత్తాలుతో మెగాస్టార్‌ స్టెప్స్‌ అదరహో!

megastar steps with rattaalu

చిరంజీవి సినిమా 'ఖైదీ నెం 150'లో ముద్దుగుమ్మ లక్ష్మీరాయ్‌తో స్పెషల్‌ సాంగ్‌ ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవలే హైద్రాబాద్‌లో ప్రత్యేకంగా వేసిన సెట్‌లో ఈ పాటను చిత్రీకరించారు. లారెన్స్‌ కొరియోగ్రఫీ అందించిన ఈ సాంగ్‌లో చిరంజీవి, లక్ష్మీరాయ్‌ కలిసి అదిరిపోయే స్టెప్పులేశారు. 'సర్ధార్‌'లో తమ్ముడితోనూ, ఇప్పుడు అన్నయ్యతోనూ కలిసి డాన్స్‌ చేసినందుకు లక్ష్మీరాయ్‌ ఆనందానికి ఆకాశమే హద్దయ్యింది. ఇంత వయసులోనూ, మెగాస్టార్‌ వేసే స్టెప్పులకి సెట్‌లో అంతా ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయిపోయారట. అంతేకాదు ఈ సినిమాలో వీణ స్టెప్పులాంటిదే మరో స్పెషల్‌ స్టెప్పు ఒకటి కంపోజ్‌ చేశాడట లారెన్స్‌. 'రత్తాలు రత్తాలు..' అంటూ సాగే ఈ పాట ఫ్యాన్స్‌ని కొత్త ఉత్సాహానికి గురి చేస్తుందట. ధియేటర్లో అన్నయ్య స్టెప్పులకి ఫ్యాన్స్‌ ఊగిపోతారట. ఇంత గొప్పగా తెరకెక్కిన ఈ పాటకి దేవిశ్రీ ప్రసాద్‌ మ్యూజిక్‌ కంపోజ్‌ చేశారు. కొణిదెల ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై తొలిసారిగా రాంచరణ్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. కాజల్‌ అగర్వాలో ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. చిరంజీవి, కాజల్‌ జంట చూడ ముచ్చటగా ఉండబోతోందట. ఈ సినిమా కోసం కాజల్‌ కొంచెం ఒళ్లు చేసి బొద్దుగా మరింత అందంగా కనిపించనుందట. భారీ అంచనాల నడుమ వస్తోన్న ఈ సినిమా ఈ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. 

మరిన్ని సినిమా కబుర్లు
that is balayya ..