Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
sahiteevanam

ఈ సంచికలో >> శీర్షికలు >>

నవ్వండి-నవ్వించండి - కన్నవి /విన్నవి : జీడిగుంట నరసింహ మూర్తి

 

1. “మీ పళ్ళు అంత ధగ ధగ మెరిసిపోవడానికి ఏ టూత్ పేస్టు వాడుతారు ?” అడిగాడు ఒక నటిని విలేకరి.
“ ప్రత్యేకంగా ఒక టూత్ పేస్టుకు నేను అలవాటు పడను. కాని రెండు పూటలా చేతిలోకి తీసుకుని బాగా పాలిష్ చేస్తాను అంతే “ అంది ఆ నటి దవడ నొక్కుకుంటూ .

2. “నువ్వు నాకు చేసిన సహాయానికి నీ ఋణం ఎలా తీర్చుకోవాలో తెలియడం లేదు “ అన్నాడు ఒక వ్యక్తి హాస్పిటల్లో ఉన్న పేషంట్ తో .“ ఏమీ అక్కర్లేదు. ముందు ఆక్సిజన్ పెట్టిన ట్యూబ్ మీద నుండి నీ కాలు తీసెయ్యి చాలు “ అన్నాడా పేషంట్ ఆయాస పడుతూ

3. "రామా పురం వెళ్ళడానికి దగ్గర దారి ఏమైనా ఉందా ?" అని అడిగాడు ఒక వ్యక్తి అక్కడ రచ్చబండ మీద కూర్చుని చుట్ట కాలుస్తున్నఒక పెద్ద మనిషిని.
" ఇక్కడనుండి ఒక గంట ప్రయాణం వుంటుంది " అని జవాబిచ్చాడు ఆయన. 
" అంత కన్నా త్వరగా వెళ్ళే మార్గం లేదా ?" అడిగాడు వ్యక్తి.
"లేకేం. మా ఆంబోతు మీ వెంటపడితే అరగంటలోనే మీ వూరు చేరుకుంటారు " అన్నాడు ఆ పెద్దమనిషి భళ్ళున నవ్వుతూ.

4. "పాపి చిరాయువు అని మన పెద్దలు చెప్తూ ఉంటారు " అన్నాడు ఒక వ్యక్తి మిత్రుడితో.
"అయితే నీ ప్రాణానికేమీ డోకా లేదన్న మాటేగా?" అన్నాడు మిత్రుడు టక్కున.

5. "ఈ చీర కట్టుకుంటే మీరు నలభై ఏళ్ల ఆవిడ లాగా అందరికీ కనపడతారు మేడం " అంటూ చీరల షాపులోని ఒక వ్యక్తి ఒకామెకు చీరను చూపిస్తూ పొగుడుతూ అన్నాడు.
" ఏడ్చినట్టుంది . నా వయసు ముప్పయ్యే. " అంటూ ఆ చీరను అతని మీద విసిరి కొట్టింది ఆ లేడీ కస్టమర్ కోపంగా..

6. ఒక వ్యక్తి కిళ్ళీ షాపు దగ్గరికి వెళ్లి అక్కడ తగిలించి ఉన్న అరటిపళ్ళ గెలమీద చెయ్యి వేసాడు. వెంటనే షాపతను " గెలమీద చెయ్యి వేసావంటే పళ్ళు రాలుతాయి " అన్నాడు. అందుకా వ్యక్తి "సున్నం తక్కువెయ్యి లేకపోతే దవడ పగులుతుంది జాగ్రత్త " అన్నాడు కిళ్ళీ కడుతున్నషాపు వ్యక్తిని ఉద్దేశించి.

7. "ఇప్పటికిప్పుడు తడుముకోకుండా అబద్దమాడితే వందరూపాయలు ఇస్తాను" అన్నాడు వాసు. "అదేమిటిరా ఇందాకే కదా రెండొందలు ఇస్తాను అని చెప్పి ఇప్పుడు మాట మార్చేసావ్ !" అన్నాడు మిత్రుడు వెంటనే. 

8. "మీ కథలు సామాన్యంగా దేంట్లో పడుతూ ఉంటాయి ?" అని అడిగాడు ఒక వ్యక్తి ఒక రచయితను.
"చెత్త బుట్టలో " రచయిత టక్కున సమాధానం ఇచ్చాడు..

9. హోటల్లో శుభ్రంగా తిన్నాక డబ్బులు ఇంట్లోనే మర్చిపోయినట్టు గుర్తొచ్చింది వెంకయ్యకు. 
పర్వాలేదు లెండి గుర్తు కోసం మీ పేరు గోడమీద రాసుకుంటాం రేపు తెచ్చి ఇచ్చెయ్యండి అన్నాడు హోటల్ ప్రొప్రయిటర్,
నా పరువు పోతుంది ఆ పని మాత్రం చెయ్యకండి అంటూ వేడుకున్నాడు వెంకయ్య. 
ఎందుకండీ అంత కంగారు పడతారు మీ పేరు కనపడకుండా అక్కడ మీ చొక్కా తగిలిస్తాంగా !" అన్నాడు హోటల్ ప్రొప్రయిటర్ విశాల హృదయంతో

10. "పట్టపగలే వంద మంది నిట్టనిలువునా మోసపోయిన వైనం" అంటూ ఒక పేపర్ బోయ్ బజారులో పేపర్లు అమ్ముతున్నాడు. ఇంతలో ఒక పెద్దాయన ఆ వార్త ఏదో తెలుసుకోవాలని ఆత్రుతతో వాడిని పిలిచి ఒక పేపర్ కొనుక్కున్నాడు. ఆ వెంటనే పేపర్ బోయ్ " పట్టపగలే నూటొక్కమంది నిలువునా మోసపోయిన వైనం " అంటూ నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు.
 

మరిన్ని శీర్షికలు
weekly horoscope 4th november to 10th november